న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఢిల్లీ స్టేడియంలో తీవ్రంగా దుమ్మూ, ధూళీ.. పరిశుభ్రానికి నీటి ట్యాంకర్లు(వీడియో)!!

India Vs Bangladesh 1st T20: Arun Jaitley Stadium Amid Air Pollution! | #DelhiAirEmergency
India vs Bangladesh, 1st T20I: DDCA uses water tankers to wash dust ahead of 1st T20I

ఢిల్లీ: భారత పర్యటనలో బంగ్లాదేశ్‌ మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. ఆదివారం ఇరు జట్ల మధ్య అరుణ్‌ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్‌తో ఈ పర్యటన ప్రారంభం కానుంది. ఈ రోజు తొలి టీ20 జరగనున్న దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. పొగ, దుమ్మూ, ధూళీ, మంచు ఢిల్లీని సతమతం చేస్తున్నాయి. ఇక దీపావళి తర్వాత ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాద స్థాయిలో ఉంది.

India vs Bangladesh: కోహ్లీని ఒప్పించడానికి 3 సెకన్లు పట్టింది: గంగూలీIndia vs Bangladesh: కోహ్లీని ఒప్పించడానికి 3 సెకన్లు పట్టింది: గంగూలీ

తొలి టీ20 సందర్భంగా దుమ్మూ, ధూళీని తొలగించడానికి అరుణ్‌జైట్లీ స్టేడియాన్ని నీటి ట్యాంకర్లతో కడిగారు. దిల్లీ, డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ శనివారం స్టేడియం పరిసరాల్ని నీటితో కడిగింది. పెద్ద పైప్‌ ద్వారా స్టేడియంలోని గేట్ల పరిసరాల్ని శుభ్రంగా కడిగేశారు. ప్రస్తుతం మైదానం శుభ్రంగా మారింది. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. ఢిల్లీ సిబ్బందిపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాద స్థాయిలో ఉండడంతో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. అయితే చివరి నిమిషంలో మ్యాచ్‌ వేదికను మార్చడం వీలుకాదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించారు. షెడ్యూల్‌ ప్రకారమే మ్యాచ్‌ను నిర్వహిస్తామని చెప్పారు. మరోవైపు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, మ్యాచ్ జరుగుతుంది అని తెలిపారు. కాలుష్యం కారణంగా కాస్త ఇబ్బందిగా ఉన్నా.. తమ జట్టు ఆటగాళ్లు తొలి మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నారని బంగ్లా కోచ్‌ రసెల్‌ డొమింగో స్పష్టం చేశారు.

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఆదివారం రాత్రి 7 గంటలకు తొలి టీ20 మ్యాచ్‌ పార్రంభం కానుంది. సీనియర్లతో పాటు పలువురు కుర్రాళ్లు భారత్‌ తరఫున తమ సత్తా చాటేందుకు సన్నద్ధమయ్యారు. ఆల్‌రౌండర్‌గా శివమ్‌ దూబే అరంగేట్రం చేయడం దాదాపుగా ఖాయమైంది. హార్దిక్‌ పాండ్యా స్థానంలో చోటు దక్కించుకున్న శివమ్‌.. అదే తరహాలో విధ్వంసకర బ్యాటింగ్‌ చేయగడు. టీ20 ప్రపంచకప్‌ కోసం యువ ఆటగాళ్లను పరీక్షిస్తున్న భారత్‌.. ఈ మూడు మ్యాచ్‌లతో ఓ అంచనాకు వచ్చే అవకాశముంది.

మరోవైపు కీలక ఆటగాళ్లు లేకుండానే బంగ్లా జట్టు పొట్టి ఫార్మాట్‌కు రెడీ అవుతోంది. ఐసీసీ బంగ్లా స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబల్‌పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇక తమీమ్ ఇక్బాల్, సైఫుద్దీన్ సిరీస్‌కు దూరం కావడంతో బంగ్లాదేశ్ జట్టు బలహీనపడింది. అయితే సీనియర్ ఆటగాళ్లు సౌమ్య సర్కార్, ముష్ఫికర్ రహీమ్, లిటన్ దాస్, మొసద్దిక్ హుస్సేన్ బ్యాటింగ్ భారం మోయనున్నారు. వీళ్ళు ఏ మేరకు రాణిస్తారో చూడాలి.

Story first published: Sunday, November 3, 2019, 14:36 [IST]
Other articles published on Nov 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X