న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసీస్‌తో వన్డేల్లో ఆడేందుకు సిద్ధమవుతున్నా: హార్దిక్ పాండ్యా

India vs Australia 2018-2019 : Hardik Pandya Trying To Be Fit For ODIs | Oneindia Telugu
India vs Australia: Trying to be Fit For ODIs, Says Hardik Pandya

ముంబై: ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరిన టీమిండియాలో కేవలం టీ20, టెస్టు ఫార్మాట్లకు మాత్రమే జట్లను ప్రకటించింది. ఇంకా వన్డే జట్టు ప్రకటించాల్సి ఉన్న నేపథ్యంలో జనవరిలో జరిగే వన్డే సిరీస్‌ సమయానికి ఫిట్‌నెస్‌ సాధించి జాతీయ జట్టులో చోటు దక్కించుకుంటానని టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ధీమా వ్యక్తం చేశాడు. దుబాయ్‌ వేదికగా సెప్టెంబర్‌లో జరిగిన ఆసియాకప్‌లో వెన్నునొప్పితో ఏకంగా టోర్నీ మొత్తానికే పాండ్య‌ దూరమైయ్యాడు.

ఫిట్‌నెస్ కోసం తంటాలు పడుతూనే

ఫిట్‌నెస్ కోసం తంటాలు పడుతూనే

వెస్టిండీస్‌తో మ్యాచ్ జరుగుతోన్న సమయంలో తొడకండరాలు పట్టేయడంతో మైదానంలోనే కుప్పకూలి పోయాడు. ఈ నిమిత్తం చికిత్స తీసుకున్న పాండ్యా ప్రస్తుతం కోలుకుంటున్నాడు. నెట్స్‌లో ప్రాక్టీసు చేస్తూనే ఫిట్‌నెస్ కోసం తంటాలు పడుతున్నాడు. ఈ క్రమంలో ఆసీస్‌తో వన్డే సిరీస్‌ నాటికి జాతీయ జట్టులో స్థానం దక్కించుకోవడానికి సన్నద్ధమవుతున్నట్లు పేర్కొన్నాడు.

60రోజుల తర్వాత మళ్లీ బౌలింగ్‌

దీని గురించి మాట్లాడుతూ..‘దాదాపు 60రోజుల తర్వాత మళ్లీ బౌలింగ్‌ చేయడం ఆరంభించాను. ముంబైలో ప్రతిరోజు దీనికోసమని బౌలింగ్‌ సెషన్స్‌కు వెళ్తున్నాను. ఎలాగైనా 2019 జనవరిలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లోపు పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధిస్తాను. జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తాను. అవకాశం వచ్చాక వన్డేల్లో కొన్ని ఓవర్లు క్రమంగా బంతులు విసిరేందు ప్రయత్నిస్తాను. దాంతో మళ్లీ సులభంగానే లయ అందుకోగలననే నమ్మకముంది' అని హార్దిక్‌‌ చెప్పుకొచ్చాడు.

ఆసీస్‌ను వారి గడ్డపై ఓడించగల సత్తా

ఆసీస్‌ను వారి గడ్డపై ఓడించగల సత్తా

మరోవైపు బుధవారం నుంచి ఆస్ట్రేలియాతో ఆరంభం కానున్న టీ20 సిరీస్‌లో భారత్‌ బలమైన జట్టుతో బరిలోకి దిగుతుందని పాండ్య అన్నాడు. ఆసీస్‌ను వారి గడ్డపై ఓడించగల సత్తా ప్రస్తుత జట్టుకు ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇరు జట్లకు ఇది గొప్ప సిరీస్ అవుతుందని ఆశిస్తున్నట్లు ఈ ఆల్‌రౌండర్‌ పేర్కొన్నాడు. ఆసీస్‌తో మూడు టీ20లు, నాలుగు టెస్టులకు మాత్రమే సెలక్షన్‌ కమిటీ జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఫేవరేట్‌గా బరిలోకి టీమిండియా

ఫేవరేట్‌గా బరిలోకి టీమిండియా

ఆస్ట్రేలియాలో సుదీర్ఘ పర్యటనకు శ్రీకారం చుడుతోంది టీమిండియా. కంగారూలతో మూడు టీ20ల సిరీస్‌ తొలి మ్యాచ్‌ బుధవారం బ్రిస్బేన్‌లో జరగనుంది. ఈ సిరీస్‌‌లో అదే గడ్డపై ఆస్ట్రేలియాను ఢీకొంటూ టీమిండియా ఫేవరెట్‌గా దిగబోతుండటం ప్రత్యేకత. బాల్‌ టాంపరింగ్‌ వివాదం తర్వాత ఆస్ట్రేలియా ప్రదర్శన దారుణంగా కనిపిస్తోంది. స్మిత్‌, వార్నర్‌లపై నిషేధం పడటంతో కంగారూ జట్టు బలహీనపడిపోయింది. ఇటీవలే పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికాల చేతుల్లో అన్ని ఫార్మాట్లలోనూ సిరీస్‌ పరాజయాలు చవిచూసింది ఆసీస్‌.

Story first published: Wednesday, November 21, 2018, 13:46 [IST]
Other articles published on Nov 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X