న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బ్రిస్బేన్ మైదానంలో ప్రాక్టీసు చేస్తోన్న టీమిండియా

India vs Australia 2018-19 : Team India Starts Praticing At Brisbane Stadium | Oneindia Telugu
India vs Australia: Team India hits the ground running with first training session at the Gabba

బ్రిస్బేన్: ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన టీమిండియా సాధన మొదలు పెట్టింది. ఆదివారం బ్రిస్బేన్ స్టేడియంలో తొలి ప్రాక్టీస్ సెషన్‌లో కెప్టెన్ విరాట్‌ కోహ్లీ సహా ఆటగాళ్లందరూ గబ్బా మైదానంలో కఠిన సాధన చేశారు. నవంబరు 21న బ్రిస్బేన్ వేదికగానే తొలి టీ20 మ్యాచ్ ఆడనున్న టీమిండియా.. ఆతిథ్య జట్టుతో 4 టెస్టులు, 3 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. సాధన ముగిసిన తర్వాత సంబంధిత చిత్రాలను బీసీసీఐ ట్విటర్‌లో పంచుకుంది.

పునరాగమనంలో రోహిత్ శర్మ,

పునరాగమనంలో రోహిత్ శర్మ,

జస్ప్రీత్‌ బుమ్రా, కృనాల్‌ పాండ్య, దినేశ్‌ కార్తీక్‌ సాధన చేశారు. దాదాపు 10నెలల తర్వాత మళ్లీ భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేసిన రోహిత్ శర్మ, పార్థీవ్ పటేల్ నెట్స్‌లో ఎక్కువ శ్రమించగా.. యువ హిట్టర్ రిషబ్ పంత్ సెషన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి.. తన బ్యాట్‌ను సరి చూసుకున్నాడు.

డిసెంబర్‌ 6 నుంచి అసలైన సమరం

డిసెంబర్‌ 6 నుంచి అసలైన సమరం

కృనాల్ పాండ్య, జస్‌ప్రీత్ బుమ్రా నెట్స్‌లో బౌలింగ్ చేయగా.. కోహ్లీ, మనీశ్ పాండే హిట్టింగ్ ప్రాక్టీస్ చేసినట్లు తెలుస్తోంది. భారత్‌ తొలుత టీ20లు ఆడనుంది. నవంబర్‌ 21న మొదటి టీ20 బ్రిస్బేన్‌లో జరగనుంది. డిసెంబర్‌ 6 నుంచి అసలైన సమరం టెస్టు సిరీస్‌ సిరీస్‌ ఆరంభం కానుంది.

కోహ్లీని జాగ్రత్తగా ఉండమని ఆదేశించడమా.. అది అబద్ధం: బీసీసీఐ

ఎంతో పరిణతి సాధించానని కెప్టెన్ విరాట్‌ కోహ్లీ

ఎంతో పరిణతి సాధించానని కెప్టెన్ విరాట్‌ కోహ్లీ

గతంతో పోలిస్తే తానిప్పుడు ఎంతో పరిణతి సాధించానని టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ ఆసీస్‌కు బయల్దేరే ముందు అన్న సంగతి తెలిసిందే. తాను అభిరుచితో క్రికెట్‌ ఆడతానని పేర్కొన్నాడు. గత సిరీస్‌లో కోహ్లీ నాలుగు శతకాలు సాధించాడు. ఇక విరాట్‌ ఆసీస్‌లో ఆడేందుకు బాగా ఇష్టపడతాడని, అక్కడి పిచ్‌లు అతడి ఆటతీరుకు బాగా నప్పుతాయని కోచ్‌ రవిశాస్త్రి వెల్లడించారు.

టీ20, టెస్టు సిరీస్‌ కోసం ఎంపికైన టీమిండియా

టీ20, టెస్టు సిరీస్‌ కోసం ఎంపికైన టీమిండియా

భారత టీ20 జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, ఖలీల్ అహ్మద్

భారత టెస్టు జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, లోకేశ్ రాహుల్, పృథ్వీ షా, చతేశ్వర్ పుజారా, ఆజింక్య రహానె, హనుమ విహారి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, పార్థివ్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్

Story first published: Monday, November 19, 2018, 9:43 [IST]
Other articles published on Nov 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X