For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అబద్ధం: కోహ్లీని జాగ్రత్తగా ఉండమని ఆదేశించడమా.. ?

India vs Australia 2018-2019 : Virat Kohli and Team Should Be Careful With Aussies | Oneindia Telugu
Did COA ask Virat Kohli to be humble? BCCI denies media reports

హైదరాబాద్: ఆస్ట్రేలియా పర్యటనలో హుందాగా వ్యవహరించాలని భారత కెప్టెన్‌ విరాట్ కోహ్లీ‌ని సుప్రీంకోర్టు నియమిత బీసీసీఐ పాలకుల కమిటీ ఆదేశించినట్లు వచ్చిన వార్తలో నిజం లేదని బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. ఆస్ట్రేలియాతో మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేల సుదీర్ఘ సిరీస్‌ని ఆడేందుకు టీమిండియా శుక్రవారం భారత్‌ నుంచి అక్కడికి వెళ్లింది. పర్యటనకు ముందు విరాట్ కోహ్లీని సీఓఏ ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి.

ముంబైకి చెందిన ప్రముఖ పత్రికలో

ముంబైకి చెందిన ప్రముఖ పత్రికలో

‘ఆస్ట్రేలియా పర్యటనలో సత్ప్రవర్తనతో మెలగాలి' అని సీఓఏ కోహ్లీకి చెప్పినట్టు ముంబైకి చెందిన ప్రముఖ పత్రికలో కథనం ప్రచురితమైంది. ప్రస్తుతం టీమిండియా బ్రిస్బేన్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

'రోహిత్ నిలబెడితే టీమిండియాను అదుపుచేయలేం'

కోహ్లీ.. అణకువగా ఉండు:

కోహ్లీ.. అణకువగా ఉండు:

‘‘ముంబైకి చెందిన ఓ పత్రికలో నవంబర్‌ 17, 2018న ‘అణకువగా ఉండు: విరాట్‌ కోహ్లీకి సీఓఏ మెమో' అనే వార్త వచ్చింది. ఆస్ట్రేలియాలో కోహ్లీ మర్యాదగా నడుచుకోవాలని, అణకువగా ఉండాలని సీవోఏ చెప్పినట్టు రాశారు. జట్టు యాజమాన్యంతో సంప్రదించిన తర్వాత ఆ కథనం కట్టుకథ అని తెలిసింది. అందులో ఎలాంటి వాస్తవాలు లేవని ఖండిస్తున్నాం'' అని బీసీసీఐ స్పందించింది.

అభిమానులకు మధ్య వేలు చూపించిన కోహ్లీ

అభిమానులకు మధ్య వేలు చూపించిన కోహ్లీ

గత పర్యటనలో విరాట్‌ స్థానిక అభిమానులకు మధ్య వేలు చూపించాడు. కాగా వారు తనతో అనవసర కవ్వింపులకు దిగడంతో అలా చేశానని మరోసారి సహనం కోల్పోనని తర్వాత వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. భారత క్రికెటర్ల కంటే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్ల ఆటనే తాను ఎక్కువగా ఆస్వాదిస్తానని ఇటీవల ఓ అభిమాని ట్విట్టర్‌లో పెట్టిన కామెంట్‌కి ఘాటుగా స్పందించిన విరాట్ కోహ్లీ.. అయితే నువ్వు దేశం విడిచి వెళ్లు అని సమాధానమిచ్చాడు.

మీడియాతో కాస్త హుందాగా వ్యవహరించు

మీడియాతో కాస్త హుందాగా వ్యవహరించు

అతనిపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అభిమానులు విమర్శలు గుప్పించారు. కోహ్లీ అలా వ్యాఖ్యానించడంపై కొంత మంది మాజీ క్రికెటర్లు సైతం పెదవి విరిచారు. దీంతో.. కోహ్లీ మాటల్ని సీరియస్‌గా తీసుకున్న బీసీసీఐ పాలకుల కమిటీ.. ‘అభిమానులు, మీడియాతో కాస్త హుందాగా వ్యవహరించు' అని ఆదేశించినట్లు వార్తలొచ్చాయి. భారత్, ఆస్ట్రేలియా మధ్య నవంబరు 21న తొలి టీ20 జరగనుంది.

Story first published: Monday, November 19, 2018, 11:36 [IST]
Other articles published on Nov 19, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+