Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia: మాక్స్‌వెల్‌ భారీ సిక్సర్.. ట్రోల్ చేసిన పంజాబ్!!

India vs Australia: Glenn Maxwell hits huge six, Kings XI Punjab trolls him

హైదరాబాద్:యూఏఈ వేదికగా ముగిసిన ఐపీఎల్ 2020లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడిన గ్లెన్ మాక్స్‌వెల్‌.. పూర్తిగా విఫలమయిన విషయం తెలిసిందే. 13 మ్యాచ్‌లు ఆడి ఒక్క సిక్స్ కూడా కొట్టని మాక్స్‌వెల్‌.. టీమిండియాతో ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న వన్డే సిరీస్‌లో మాత్రం రెచ్చిపోయి ఆడుతున్నాడు. సిక్సుల వర్షం కురిపిస్తున్నాడు. తొలి వన్డేలో 3 సిక్సులు బాది 19 బంతుల్లోనే 45 పరుగులు చేశాడు. ఇక రెండో వన్డేలో 29 బంతుల్లోనే 63 రన్స్ చేశాడు. ఏకంగా 4 భారీ సిక్సులు బాదాడు. మూడో వన్డేలో కూడా 38 బంతుల్లో 59 రన్స్ చేశాడు. మరో నాలుగు సిక్సులు బాదాడు.

ఈరోజు గ్లెన్ మాక్స్‌వెల్‌ బాదిన నాలుగింటిలో ఓ సిక్స్.. స్టేడియం పైకప్పుపై పడింది. రవీంద్ర జడేజా వేసిన 36వ ఓవర్ మూడో బంతికి మాక్స్‌వెల్‌ భారీ సిక్స్ బాదాడు. లెగ్ సైడ్ బాదిన ఆ సిక్సర్ స్టేడియం పైకప్పు పైకి దూసుకెళ్లింది. దీంతో మాక్స్‌వెల్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ట్రోల్ చేసింది. పెద్ద కళ్లున్న బొమ్మను పోస్ట్ చేసింది. అందులో బొమ్మ కళ్లు అటూఇటూ తిరుగుతున్నాయి. 'మాక్స్‌వెల్‌ మధ్యలో ఉన్నాడు' అని కాప్షన్ పెట్టింది.

ఇక అంతర్జాతీయ వన్డేలలో గ్లెన్ మాక్స్‌వెల్‌ స్ట్రైక్ రేట్ 125.18గా ఉంది. కనీసం 100 వన్డే ఇన్నింగ్స్‌లు ఆడిన వారిలో మాక్స్‌వెల్‌ స్ట్రైక్ రేట్ అగ్రస్థానంలో ఉంది. జోస్ బట్లర్ (119.05), షాహిద్ ఆఫ్రిది (117.01), తీసారా పెరీరా (112.60), వీరేందర్ సెహ్వాగ్ (104.34) మాక్స్‌వెల్‌ తరవాతి స్థానాల్లో వరుసగా ఉన్నారు. మాక్స్‌వెల్‌ ఆసీస్ తరఫున 7 టెస్టులు, 115 వన్డేలు, 64 టీ20లు ఆడాడు. వన్డేల్లో రెండు శతకాలు, 21 హాఫ్ సెంచరీలు బాదాడు.

ఆసీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత బౌలర్లు పట్టు బిగించారు. ఆసీస్ తొమ్మిదవ వికెట్ కోల్పోయింది. జట్టు స్కోర్ 278 పరుగుల దగ్గర ఆస్టన్ అగర్ పెవిలియన్ చేరాడు. ఆసీస్ విజయానికి 12 బంతుల్లో 21 రన్స్ కావాలి. క్రీజులో జోష్ హాజిల్‌వుడ్ (2), ఆడం జంపా (2)లు ఉన్నారు. ఇప్పటికే ఆసీస్ సిరీస్ గెలిచిన విషయం తెలిసిందే.

Story first published: Wednesday, December 2, 2020, 17:03 [IST]
Other articles published on Dec 2, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+