న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Australia: వారెవ్వా స్మిత్.. వాటే క్యాచ్.. అచ్చం పక్షిలా పట్టేశావ్!

India vs Australia: Steve Smith blinder removes Shreyas Iyer
Ind vs Aus 2nd ODI : Steve Smith Takes A Blinder Catch To Dismiss Shreyas Iyer

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సూపర్ క్యాచ్‌కు క్రీజులో కుదురుకున్న శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 5 ఫోర్లతో 38) నిరాశగా వెనుదిరిగాడు. హెన్రీక్స్ బౌలింగ్‌లో అయ్యర్ మిడివికెట్‌ మీదుగా షాట్ ఆడగా.. ఆ దిశలో సర్కిల్‌ లోపల ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్ సూపర్ డైవ్‌తో బంతిని అందుకున్నాడు. స్మిత్ క్యాచ్ అందుకున్న తీరు ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంది. అతని ఎఫెర్డ్ వావ్ అనిపించింది.

రెప్పపాటు సమయంలో అచ్చం పక్షిలా ఎగిరి వెనక్కి డైవ్ చేస్తూ బంతిని అతను అందుకున్న తీరు ఔరా అనిపించింది. ఇక స్మిత్ సూపర్ ఫీల్డింగ్‌కు క్రీజులో ఉన్న కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లంతా నోరెళ్లబెట్టారు. శ్రేయస్ అయ్యర్ అయితే బిత్తరపోయి.. నిరాశగా వెనుదిరిగాడు. ఈ సూపర్ క్యాచ్‌తో మూడో వికెట్‌కు నమోదైన 73 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

ఈ ఓవర్‌కు ముందే జంపా వేసిన 23వ ఓవర్ నాలుగో బంతిని లెగ్ సైడ్ ఫోర్ కొట్టిన కోహ్లీ.. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కింగ్ కోహ్లీ ఫామ్ అందుకున్నాడనే భారత అభిమానుల ఆనందాన్ని హెన్రీక్స్ ఆవిరి చేశాడు. స్మిత్ సూపర్ క్యాచ్ సాయంతో అయ్యర్‌ను ఔట్ చేసి దెబ్బకొట్టాడు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీతో పాటు రాహుల్ ఉన్నాడు.

అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లకు 389 రన్స్ చేసింది. స్టీవ్ స్మిత్ (104; 64 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సులు‌) మెరుపు సెంచ‌రీతో రాణించగా.. ఓపెన‌ర్లు డేవిడ్ వార్న‌ర్‌ (83; 77 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులు‌), ఆరోన్ ఫించ్‌ (60; 69 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. చివరలో మార్నస్ లబుషేన్ (70; 61 బంతుల్లో 5 ఫోర్లు‌) ‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్ (63; 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు‌) విధ్వంసక బ్యాటింగ్‌తో భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. ఆసీస్ బ్యాట్స్‌మెన్ ధాటికి టీమిండియా బౌల‌ర్లు మ‌రోసారి భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నారు. బుమ్రా అత్య‌ధికంగా 79, షమీ 73, చహ‌ల్ 71, సైనీ 70, జ‌డేజా 60 ప‌రుగులు ఇచ్చారు.

వీడియో కాన్ఫరెన్స్‌‌తో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను కలిపిన బీసీసీఐ!వీడియో కాన్ఫరెన్స్‌‌తో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను కలిపిన బీసీసీఐ!

Story first published: Sunday, November 29, 2020, 15:48 [IST]
Other articles published on Nov 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X