న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Gabba Test: సుందర్, శార్దుల్ రికార్డు భాగస్వామ్యం.. టీ బ్రేక్ సమయానికి భారత్ 253/6

India vs Australia: Shardul Thakur and Washington Sundar fight with record-breaking stand

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు‌లో భారత ఆటగాళ్లు వాషింగ్టన్ సుందర్(82 బంతుల్లో 5 ఫోర్లతో 38 బ్యాటింగ్), శార్దుల్ ఠాకుర్(62 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 33 నాటౌట్) సూపర్ బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. నిర్లక్ష్యమైన ఆటతీరుతో కీలక బ్యాట్స్‌మెన్ చేతులెత్తిసినా.. క్లిష్ట స్థితిలో మెచ్యూర్ బ్యాటింగ్‌తో భారత్‌ను గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. సుంధర్‌కు ఇది అరంగేట్ర మ్యాచ్ కాగా.. షార్ధుల్ ఠాకుర్‌కు రెండో మ్యాచ్ మాత్రమే. అయినా వరల్డ్ క్లాస్ బౌలర్లను సూపర్బ్‌గా ఎదుర్కొంటున్నారు.

మంచి బంతులను గౌరవిస్తూ.. లూజ్ బాల్స్‌ను బౌండరీకి తరలిస్తున్నారు. దాంతో టాపార్డర్, మిడిలార్డర్‌ను సులువుగా పెవిలియన్ చేర్చిన ఆసీస్ బౌలర్లు ఈ ఇద్దరి బ్యాటింగ్‌కు విసిగిపోతున్నారు. 186 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును నిలకడైన బ్యాటింగ్‌తో గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఓ దశలో భారత్ 200 పరుగులైనా చేస్తుందా? అనిపించింది.

కానీ ఈ ఇద్దరూ అసాధారణ పోరాటంతో ఆసీస్ బౌలర్లను ఎదుర్కొంటున్నారు. దాంతో టీబ్రేక్ సమయానికి భారత్ 87 ఓవర్లలో 6 వికెట్లకు 253 పరుగులు చేసింది. ఇప్పటికే ఈ ఇద్దరు 124 బంతుల్లో 67 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు. తద్వారా కపిల్ దేవ్-మనోజ్ ప్రభాకర్ పేరిట ఉన్న ఏడో వికెట్ 57 పరుగు భాగస్వామ్యం రికార్డును బ్రేక్ చేశారు.

లంచ్ బ్రేక్ తర్వాత భారత్ మయాంక్ అగర్వాల్(38), రిషభ్ పంత్(23) వికెట్లను త్వరగా కోల్పోయింది. హేజిల్‌వుడ్‌ వేసిన 66.3 ఓవర్‌కు మూడో స్లిప్‌లో గ్రీన్‌ చేతికి చిక్కి పంత్ వెనుదిరగాడు. మయాంక్‌ అగర్వాల్‌(38) సైతం హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు.

Story first published: Sunday, January 17, 2021, 10:38 [IST]
Other articles published on Jan 17, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X