న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంతా 2020 మహిమ.. లేకుంటే రవీంద్ర జడేజాను సంజయ్ మంజ్రేకర్ ప్రశంసించుడేంది!

India vs Australia: Sanjay Manjrekar praises Ravindra Jadeja for the first time in the commentary box

హైదరాబాద్: 2020 అందరికి ఓ కొత్త ప్రపంచాన్ని చూపించింది. ఎన్నడూ చూడని,అసలు ఊహకందని విషయాలను కళ్లముందుకు తీసుకొచ్చింది. చైనావోడి కరోనా గత్తర పుణ్యమా.. అగ్రరాజ్యాలే అల్లాడాయి. ధనవంతులు, పేదోళ్లనే తేడాలేకుండా అందరిని ఇంట్లో కూర్చోబెట్టింది. ఇక ఆటలైతే ఆగమాగమయ్యాయి. టీ20 ప్రపంచకప్, ఒలింపిక్స్ వాయిదా పడ్డాయి. దాంతో ఊహకందని విషయం ఏది జరిగినా.. అంతా 2020 మహిమా అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది.

అయితే తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే‌లో రవీంద్ర జడేజా(50 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అయితే అతని బ్యాటింగ్ సమయంలో కామ్‌బాక్స్‌లో ఉన్న భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ రవీంద్ర జడేజాను కొనియాడుతూ వ్యాఖ్యానం కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో అభిమానులంతా అవాక్కయ్యారు. అంతా 2020 మహిమా అంటూ కామెంట్ చేస్తున్నారు.

జడేజా X మంజ్రేకర్..

జడేజా X మంజ్రేకర్..

రవీంద్ర జడేజా, సంజయ్ మంజ్రేకర్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే వైరం ఉంది. గతేడాది వన్డే వరల్డ్‌కప్ సందర్భంగా రవీంద్ర జడేజా అరకొర ఆటగడంటూ మంజ్రేకర్ ఎద్దేవా చేయగా.. 'నీ కంటే ఎక్కవ మ్యాచ్‌లు నేనే ఆడాను.. నీ నోటి విరేచనాలను ఆపు' అంటూ జడేజా ఘటుగా బదులిచ్చాడు. అప్పటి నుంచి వీరి మధ్య వైరం కొనసాగుతుంది. అవకాశం వచ్చినప్పుడల్లా మంజ్రేకర్.. జడేజాను విమర్శిస్తూనే ఉన్నాడు. తాజా సిరీస్ సందర్భంగా కూడా జడేజా క్రమశిక్షణ లేని ఆటగాడంటూ విమర్శించాడు. అయితే బుధవారం జరిగిన మూడో వన్డేలో జడేజా భారీ షాట్లు కొడుతుంటే కామ్‌బాక్స్‌లో ఉన్న మంజ్రేకర్ ప్రశంసిస్తూ కామెంట్రీని కొనసాగించాడు. అద్భుతమైన ఆటగాడంటూ కొనియాడాడు.

మంజ్రేకర్ మనసు చంపుకున్నావా?

జడేజాను కొనియాడుతూ మంజ్రేకర్ వ్యాఖ్యానం చేయడంపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మంజ్రేకర్ మనసు చంపుకొని కామెంట్రీ చెప్పావా? అని ఒకరంటే.. ఎంత కష్టం వచ్చే మంజ్రేకర్‌కని ఇంకొకరు సెటైరిక్‌గా కామెంట్ చేశారు. ‘2020 మహిమ కాకపోతే.. జడేజాను మంజ్రేకర్ ప్రశంసించుడేంది?'అని మరొకరు ట్వీట్ చేశారు. ‘మొత్తానికి జడేజాను మొచ్చుకున్నావ్.. ఇది జరుగుతుందని ఊహించలేదు'అని కూడా కామెంట్ చేస్తున్నారు.

గమ్మునుండవయ్యా..

ఈ మ్యాచ్‌కు ముందు జడేజానే టార్గెట్‌ చేస్తూ మాట్లాడిన మంజ్రేకర్‌.. అతనితో మాత్రం తనకు వ్యక్తిగతంగా ఎటువంటి ఇబ్బందీ లేదన్నాడు. కానీ ఒక క్రమశిక్షణ అంటూ తెలియని జడేజా లాంటి క్రికెటర్లతోనే తనకు ప్రాబ్లమ్‌ అని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపై జడేజా స్పందించాడు. చేతిలో కప్ పట్టుకొని ఉన్న ఫొటోనూ షేర్ చేస్తూ.. ‘గమ్మునుండవయ్యా'అని మంజ్రేకర్ వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించాడు. దానికి సానుకూలంగా ఆలోచించమనే ట్యాగ్ ఇచ్చాడు.

బీసీసీఐ వేటు..

బీసీసీఐ వేటు..

మంజ్రేకర్‌ మంచి వ్యాఖ్యాత అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతనికి మంచి క్రికెట్‌ పరిజ్ఞానంతో పాటు ఇంగ్లీష్ భాషపై మంచి పట్టుంది. కానీ ఆటగాళ్లపై హద్దులు దాటి చేసిన కామెంట్సే అతన్ని వివాదాస్పద కామెంటేటర్‌గా నిలబెట్టాయి. గత సీజన్ ఐపీఎల్ సమయంలో ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్‌ను 'మతిలేని క్రికెటర్' అంటూ వ్యాఖ్యానించడం.. 2019 వన్డే ప్రపంచకప్‌లో రవీంద్ర జడేజాతో కయ్యానికి దిగడం.. సహచర కామెంటేటర్ హర్షా భోగ్లాని హేళన చేస్తూ మాట్లాడటం.. వంటి ఘటనలు అతన్ని దోషిగా నిలబెట్టాయి.

దాంతో గత మార్చిలో సౌతాఫ్రికా సిరీస్ సమయంలో మంజ్రేకర్‌పై వేటు వేసిన బీసీసీఐ.. ఐపీఎల్ 2020లో కూడా కామెంట్రీ చెప్పే అవకాశం ఇవ్వలేదు. ప్రస్తుతం జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా సిరీస్‌‌లో కూడా మంజ్రేకర్ వ్యాఖ్యానం చేసే అవకాశం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మాత్రమే ఇచ్చింది.

Story first published: Wednesday, December 2, 2020, 15:00 [IST]
Other articles published on Dec 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X