న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భలే థ్రిల్: ఇండియా ఎలా 'కంగారె'త్తించింది?

ఆస్ట్రేలియా చేతిలో మరోసారి ఇండియాకు పరాభవం తప్పదని అనిపించిన మ్యాచ్ అద్భుతమైన మలుపు తిరిగింది. ఓ థ్రిల్లర్‌ను తలపించింది.

By Pratap

బెంగళూరు: రెండో టెస్టులో కూడా ఆస్ట్రేలియా చేతిలో ఇండియాకు పరాభవం తప్పదనిపించే స్థితి వచ్చింది. అయితే, మ్యాచ్ అనూహ్యంగా మలుపు తిరిగింది. మొదట బ్యాటింగ్‌లో భారత్ చిత్తయింది. బౌలింగులోనూ తీసికట్టుగానే ప్రతిభ చూపించింది. మొత్తంగా ఆత్మరక్షణలో పడింది.

అయితే, అనూహ్యమైన రీతిలో ఆస్ట్రేలియాపై 75 పరుగుల ఆధిక్యతతో విజయం సాధించింది. వాస్తవానికి నాలుగో రోజు మొదట్లో ఇండియాకు నిరాశ తప్పలేదు. మూడో రోజు 126 పరుగుల ఆధిక్యతతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు ఉంచడంలో విఫలమైంది.

నాలుగో రోజు మంగళవారం కేవలం 61 పరుగులు మాత్రమే జోడించి చివరి ఆరు వికెట్లను కోల్పోయింది. దీంతో భారత్‌కు 188 పరుగుల ఆధిక్యత మాత్రమే లభించింది. దీంతో భారత్ ఓడిపోవడం ఖాయమనే అనిపించింది. ఆ స్థితిలో ఆస్ట్రేలియాను ఓడించే విషయంలో ఊహించని ప్రదర్శనను కోహ్లీ సేన కనబరిచింది. బౌలింగులో విశేషమైన ప్రతిభను కనబరిచింది.

ఇషాంత్ శర్మ నడిపించాడు....

ఇషాంత్ శర్మ నడిపించాడు....

స్వల్ప ఆధిక్యతతో విజయం సాధించాలన్నా, కనీసం డ్రా చేయాలన్నా ప్రారంభంలోనే ఓపెనర్లను విడదీయక తప్పదు. తద్వారా ఆస్ట్రేలియాపై ఒత్తిడి పెంచాలి. సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ ఈ స్థితిలో సత్తా చాటాడు. ఓపెనర్లు వికెట్ల ముందు కుదురుకోకుండానే వికెట్ తేశాడు. కీలకమైన మాత్ రెన్షా వికెట్‌ను అతను కూల్చడం కలిసి వచ్చింది. ఈ సిరీస్‌లో రెండు అర్థ సెంచరీలు చేశాడు.

అప్పుడు క్యాచ్‌లు వదిలేసి...

అప్పుడు క్యాచ్‌లు వదిలేసి...

క్లోజ్ ఇన్‌లో ఉన్న ఫీల్డర్లు క్యాచ్‌లు వదిలేస్తుండడంపై ఇటీవల విమర్శలు వెల్లువెత్తాయి. పూణే టెస్టు మ్యాచులో చాలా క్యాచ్‌లను ఇండియా జారవిడిచింది. ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్‌కు మూడు లైఫ్‌లు లభించాయంటే ఫీల్డింగ్ ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. దాంతో అతను ఆస్ట్రేలియాను విజయం దిశగా నడిపించగలిగాడు. బెంగళూరు టెస్టు మ్యాచులో టీమిండియా ఫీల్డింగ్ అద్భుతమనే చెప్పాలి. క్యాచ్‌లను ఏ మాత్రం వదిలేయలేదు. క్యాచ్‌లు పట్టుకోవడమే కాకుండా ఫీల్డింగ్‌ కూడా పకడ్బందీగా చేశారు.

మరో అద్భుతమైన క్యాచ్ పట్టిన సాహా

మరో అద్భుతమైన క్యాచ్ పట్టిన సాహా

భారత్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అద్భుత క్యాచ్‌‌ను అందుకున్నాడు. ఫుల్ లెంగ్త్ డైవ్‌తో క్యాచ్ పట్టాడు. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ వేడ్ ఎడమ చేతి బ్యాట్స్‌మన్. అశ్విన్ ఆఫ్ వికెట్‌వైపు బంతిని వేశాడు. ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకుని లెగ్‌సైడ్‌వైపు గాల్లోకి లేచింది. వికెట్స్ ముందు పడుతున్నబంతివైపు సాహా ఉరికాడు. సాహా గాల్లో ఉండగానే బంతి అతని గ్లోవ్స్‌లో పడింది. లెగ్ స్లిప్‌లో ఉన్న ఫీల్డర్‌కే కష్టం అనుకుంటే ఆఫ్ వికెట్ వెనుక ఉన్న సాహా లెగ్ సైడ్ వికెట్ల ముందు పడుతున్న బంతిని నమ్మశక్యం కాని విధంగా ఒడిసి పట్టుకున్నాడు. సాహా తొలి టెస్ట్‌లో సైతం నాథన్ లియోన్ క్యాచ్‌ను అద్భుతమైన డైవ్ చేసి పట్టిన విషయం తెలిసిందే.

అశ్విన్ తిరిగి రాణించాడు...

అశ్విన్ తిరిగి రాణించాడు...

మొదటి మ్యాచులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేయడానికి అశ్విన్ తిప్పలు పడ్డాడు. బెంగళూర్‌లో జరిగిన తొలి ఇన్నింగ్సులోనూ అతను రాణించలేదు. రెండో ఇన్నింగ్సులో అతని చేతివాటం పనిచేసింది. అవసరమైన సమయంలో అద్భుతంగా రాణించి ఆరు వికెట్లు తీసి జట్టు విజయానికి తోడ్పడ్డాడు.

ఆ వికెట్ తీశాక అశ్విన్ ఇలా చేశాడు...

ఆ వికెట్ తీశాక అశ్విన్ ఇలా చేశాడు...

మ్యాచ్ చివరలో మిచెల్ స్టార్క్‌ను బౌల్డ్ చేసిన అశ్విన్ తన చూపుడు వేలును నుదిటి మీద పెట్టుకున్నాడు. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. కెప్టెన్ కోహ్లీ సంతోషంలో చేతులు కొట్టడానికి దగ్గరకి వచ్చినప్పటికీ పట్టించుకోకుండా అశ్విన్ అలా ఎందుకు చేశాడనేది ఎవరికీ అర్థం కాలేదు. అంతకుముందు భారత్ సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అభినవ్ ముకుంద్ స్టార్క్ బౌలింగ్‌లో సిక్సర్ బాదాడు. అయితే ఆ సమయంలో బ్యాట్ అతని తలపై నుంచి వెళ్లింది. దీంతో నీ బ్యాటింగ్‌లో ఏదో లోపం ఉందన్నట్టు సంకేతమిస్తూ స్టార్క్ తన నుదిటి మీద చూపుడు వేలు పెట్టి రుద్దుతూ అభినవ్ వైపు చూశాడు. అందుకు ప్రతీకారంగానే ఇప్పుడు అశ్విన్ అలా చేశాడని అంటున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X