Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ISL 2020 21: సునీల్‌ ఛెత్రీ గోల్‌.. బెంగళూరు బోణీ

ISL 2020-21: Sunil Chhetri stars Bengaluru FC beat Chennaiyin FC

పనాజి: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) 202-21 ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో బెంగళూరు ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) తొలి విజయాన్ని నమోదు చేసింది. చెనైయిన్‌ ఎఫ్‌సీతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 1-0 గోల్‌ తేడాతో గెలిచింది. దీంతో ఐఎస్‌ఎల్‌ ఏడో సీజన్లో బెంగళూరు ఎఫ్‌సీ బోణీ కొట్టింది. గోవా ఎఫ్‌సీతో జరిగిన మ్యాచును 2-2తో డ్రా చేసుకున్న బెంగళూరు ఎఫ్‌సీ.. హైదరాబాద్ ఎఫ్‌సీ మ్యాచును కూడా 0-0తో డ్రా చేసుకుంది. చివరకు చెనైయిన్‌పై బోణీ కొట్టింది.

శుక్రవారం ఇరు జట్లూ హోరాహోరీగా తలపడ్డ ఈ మ్యాచ్‌లో స్టార్‌ ఆటగాడు సునీల్‌ ఛెత్రీ 56వ నిమిషంలో పెనాల్టీ స్ట్రైక్‌తో గోల్‌ కొట్టి బెంగళూరును గెలిపించాడు. ఈ సీజన్లో చెన్నయిన్ ఎఫ్‌సీ‌కిదే తొలి ఓటమి. మ్యాచ్ ఆరంభంలో బెంగళూరు ఆధిపత్యం సాగినా.. ఆ తర్వాత చెన్నయిన్‌ దీటుగా బదులిచ్చింది. ఆట రెండో అర్ధంలో ఇరు జట్లూ అనేక తప్పిదాలు చేశాయి. బెంగళూరు పెనాల్టీని సరిగ్గా ఉపయోగించుకుంది.

నేడు జరిగే మ్యాచ్‌లో నార్త్‌ ఈస్ట్‌ యునైటెడ్‌తో ఈస్ట్‌ బెంగాల్‌ తలపడతుంది. నార్త్‌ ఈస్ట్‌ యునైటెడ్ ఐఎస్‌ఎల్‌ 202-21లో ఒక్క మ్యాచ్ ఓడిపోలేదు. ఒక మ్యాచ్ గెలిచి, మరో రెండు మ్యాచులను డ్రా చేసుకుంది. ఈస్ట్‌ బెంగాల్‌ ఆడిన రెండు మ్యాచులలో భారీ ఓటములను ఎదుర్కొంది. ఈరోజు ఎలాగైనా బోణి కొట్టాలని చూస్తోంది. అయితే ఈరోజు నార్త్‌ ఈస్ట్‌ యునైటెడ్ జట్టు ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. పటిష్ట జట్టును ఈస్ట్‌ బెంగాల్‌ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

Story first published: Saturday, December 5, 2020, 10:42 [IST]
Other articles published on Dec 5, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+