న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరోసారి ఆసీస్ గడ్డపై పూజారా సెంచరీ

India vs Australia 3rd Test Day 2:Pujara Century, Kohli Fifty Put India On Top
India vs Australia, Pujara Century Puts India on Top

మెల్‌బోర్న్‌: ఆసీస్‌తో మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టులో టీమిండియా నయావాల్‌ ఛెతేశ్వర్‌ పుజారా శతక్కొట్టాడు. రెండోరోజు లైయన్‌ వేసిన 113వ ఓవర్‌ మొదటి బంతిని ఫోర్‌గా మలచడంతో పుజారా 281 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. తొలి రోజు బ్యాటింగ్‌కు దిగిన పుజారా.. క్రీజులో కుదురుకుని ఆసీస్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటున్నాడు. మరో ఎండ్‌లో సారథి విరాట్‌కోహ్లీ పుజారాకు మంచి సహకారాన్ని అందిస్తున్నాడు. టెస్టుల్లో పుజారాకు ఇది 17వ శతకం. పుజారా-కోహ్లీ (68) జోడీ ఇప్పటి వరకు 154 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. లంచ్‌ విరామ సమయానికి భారత్‌ స్కోరు 277/2.

మయాంక్ దూకుడుతో భారత్ శుభారంభం

మయాంక్ దూకుడుతో భారత్ శుభారంభం

బాక్సింగ్ డే' టెస్ట్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. తొలి టెస్ట్ ఆడుతున్న మయాంక్ అగర్వాల్ వస్తూనే హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. తొతలి రోజు టీ విరామ సమయానికి 54.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది టీమిండియా. అద్భుతంగా ఆడుతూ 76 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్... కమ్మిన్స్ బౌలింగ్‌లో ఆసీస్ కెప్టెన్ పైనీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మయాంక్ అగర్వాల్ అవుట్ అవ్వగానే టీ బ్రేక్‌కి వెళ్లింది ఆసీస్.

71 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై ఓపెనర్‌గా మయాంక్ అగర్వాల్ రికార్డు

రెగ్యూలర్ ఓపెనర్ల స్థానంలో దిగి

రెగ్యూలర్ ఓపెనర్ల స్థానంలో దిగి

మొదటి రెండు టెస్టుల్లో ఘోరంగా విఫలమైన రెగ్యులర్ ఓపెనర్లు కేఎల్ రాహుల్, మురళీ విజయ్ గైర్హాజరీతో మయాంక్ అగర్వాల్‌తో పాటు తెలుగు కుర్రాడు హనుమ విహారి ఓపెనింగ్ చేశాడు. ప్రతిసారీ మిడిల్ ఆర్డర్ లో బరిలోకి దిగే విహారి ఓపెనర్‌గా ఆకట్టుకోలేకపోయాడు. మొదటి వికెట్‌కు 40 పరుగుల భాగస్వామ్యం నిర్మించిన తర్వాత విహారి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ పూజారా... క్రీజులో కుదురుకునేందుకు ఎక్కువ సమయమే తీసుకున్నాడు.

టెస్ట్ సిరీస్‌లో హాఫ్ సెంచరీ చేసిన మొదటి ఓపెనర్‌గా

టెస్ట్ సిరీస్‌లో హాఫ్ సెంచరీ చేసిన మొదటి ఓపెనర్‌గా

66 బంతులు ఎదుర్కొని కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. మరో ఎండ్‌లో మయాంక్ అగర్వాల్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడంతో దూకుడుగా భారత స్కోరు బోర్టు పరుగులు పెట్టింది. ఈ దశలో 95 బంతుల్లో 6 ఫోర్లతో 52 పరుగులు చేసి... తొలి హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు మయాంక్ అగర్వాల్. ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో హాఫ్ సెంచరీ చేసిన మొదటి ఓపెనర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.

టెస్టు కెరీర్‌లో పుజారాకిది 21వ హాఫ్ సెంచరీ

టెస్టు కెరీర్‌లో పుజారాకిది 21వ హాఫ్ సెంచరీ

అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి నిలకడగా ఆడిన పుజారా 152 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. టెస్టు కెరీర్‌లో పుజారాకిది 21వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. మయాంక్‌తో కలిసి రెండో వికెట్‌కు 83 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన పుజారా.. కోహ్లీతో కలిసి మూడో వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మెల్‌బోర్న్ పిచ్‌పై బలమైన ఆసీస్ సీమర్లను ఎదర్కొంటూ వికెట్లను కాపాడుకుంటూ భారత్ ఆడిన తీరు అద్భుతం. ఆరంభంలో వేగంగా ఆడిన కోహ్లీ తర్వాత కొంచెం నెమ్మదిగా ఆడాడు.

1
43625
Story first published: Thursday, December 27, 2018, 8:11 [IST]
Other articles published on Dec 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X