న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వాషింగ్టన్ సుందర్ క్రిస్టియన్ కాదు హిందువే.. అతని పేరు వెనుక ఆసక్తికర కథ!

India vs Australia: Mystery Behind Gabba Test Hero Washington Sundar’s Name

హైదరాబాద్: 'వాషింగ్టన్ సుందర్'క్రికెట్ సర్కిల్లో ప్రస్తుతం మారుమోగుతున్న పేరు.! ఆస్ట్రేలియాతో జరుగుతున్న బ్రిస్బేన్ టెస్ట్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన టీమిండియా హీరో! టీ20 ప్లేయర్‌గా వచ్చి నెట్ బౌలర్‌గా ఆసీస్‌లోనే ఉండిపోయిన వాషింగ్టన్ అనూహ్య రీతిలో గబ్బా టెస్ట్ ద్వారా సుదీర్ఘ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేశాడు. గాయాలతో సీనియర్లు దూరమవడంతో తుది జట్టులో చోటు దక్కించుకున్న సుందర్.. ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. స్టీవ్ స్మిత్ వికెట్‌తో టెస్ట్ వికెట్ల ఖాతా తెరిచాడు. ఆ తర్వాత మరో రెండు వికెట్లు తీసి(3/89) ఆసీస్ పతనాన్ని శాసించాడు.

అసాధారణ బ్యాటింగ్..

అసాధారణ బ్యాటింగ్..

అనంతరం అసాధారణ బ్యాటింగ్‌తో భారత జట్టును కష్టాల్లోంచి గట్టెక్కించాడు. సహచర ఆటగాడు శార్దుల్ ఠాకూర్‌తో కలిసి ఏడో వికెట్ ఏకంగా 123 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. భారత్ తరఫున ఏడోవికెట్‌కు ఇదే రికార్డు భాగస్వామ్యం. అంతేకాకుండా అరంగేట్ర మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ అందుకోవడంతో పాటు బ్రిస్బేన్ వేదికగా హయ్యెస్ట్ స్కోర్ సాధించిన తొలి ఓవర్‌సీస్ అరంగేట్ర ప్లేయర్‌గా.. యంగెస్ట్ ఆటగాడిగా పలు అరుదైన ఘనతనలను అందుకున్నాడు. దాంతో ఈ యువ ఆటగాడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు. ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నాడు.

క్రిస్టియన్ కాదు.. హిందువే

క్రిస్టియన్ కాదు.. హిందువే

ఈ నేపథ్యంలో వాషింగ్టన్ సుందర్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదే అతని పేరు వెనుక ఉన్న కథ. ఆ పేరు చూసి అందరూ క్రిస్టియన్ అని భావిస్తారు. కానీ సుందర్ హిందూ కటుంబంలోనే జన్మించాడనే విషయం చాలా మందికి తెలియదు. అయితే ఆ పేరెందుకు అలా పెట్టుకున్నాడనే విషయంపై స్వయంగా సుందరే ఒకసారి వివరించాడు. వాషింగ్టన్ సుందర్ తండ్రి పేరు సుందర్. అతనిది చాలా పేద కుటుంబం. సుందర్‌కు చదువుకునే స్తోమత కూడా లేని కఠిన పరిస్థితుల్లో పెరిగాడు.

ఆర్మీ అధికారి సాయంతో..

ఆర్మీ అధికారి సాయంతో..

ఆ సమయంలో సుందర్ ఇంటికి రెండు వీధుల ఆవతల పీడీ వాషింగ్టన్ అనే ఆర్మీ అధికారి నివసించేవాడట. ఆయనకు క్రికెట్ అంటే చాలా ఇష్టమట. రేడియోలో క్రికెట్ కామెంట్రీ వింటూ ఆస్వాదించేవాడట. సుందర్ కూడా వాళ్ల ఇంటికి వెళ్తూ ఆయనతో సాన్నిహిత్యం పెంచుకున్నాడట. అయితే సుందర్‌కు చదువకునే స్తోమత లేదని గ్రహించిన వాషింగ్టన్.. అతనికి క్రికెట్‌పై ఉన్న ఆస్తికి తెలుసుకున్నాడట. అప్పటీ నుంచి సుందర్ బాధ్యతలు అన్నీ వాషింగ్టనే చూసుకున్నాడట. యూనీ ఫామ్ కొనివ్వడం, స్కూల్ ఫీజులు కట్టడం, గ్రౌండ్‌కు సైకిల్ మీద తీసుకెళ్లి క్రికెట్ మెలకువలు నేర్పించడం అంతా ఆయనే చూసుకునేవాడట.

ఆయన గుర్తుగానే..

ఆయన గుర్తుగానే..

అతని సాయంతో సుందర్ జీవితంలో స్థిరపడ్డాడు. వాషింగ్టన్‌ను తన గాడ్ ఫాదర్‌లాగా సుందర్ భావించేవాడు. 1999లో వాషింగ్టన్ మరణించాడు. అదే ఏడాది సుందర్‌కు ఒక కొడుకు పుట్టాడు. తన గాడ్ ఫాదర్ పేరునే కొడుకుకు పెట్టుకున్నాడు. ఆ కొడుకే వాషింగ్టన్ సుందర్. తమిళనాడు ప్రీమియర్ లీగ్ ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన సుంధర్.. ఆర్‌సీబీ తరఫున ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చి భారత జట్టులోకి వచ్చాడు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉండటం అతని ప్లస్ పాయింట్. ఇదే సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను కాదని గబ్బా టెస్ట్‌లో వాషింగ్టన్‌కు అవకాశం దక్కెలా చేసింది.

Story first published: Sunday, January 17, 2021, 16:27 [IST]
Other articles published on Jan 17, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X