న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లెక్క తప్పింది.. మరో మ్యాచ్ వరకూ ఆగాల్సిందే..!!

India vs Australia: List of records Rohit Sharma can break in T20I series

హైదరాబాద్: సుదీర్ఘ పర్యటనలో టీమిండియా శుభారంభాన్ని నమోదు చేస్తుందనుకుంటే వరుణుడి ప్రభావంతో నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది టీమిండియా. మ్యాచ్ ఆరంభానికి ముందే కోహ్లీతో పాటే రోహిత్ కూడా మా టార్గెట్ అని చెప్పిన ఆస్ట్రేలియన్లు.. అనుకున్నంత పని చేశారు. దీంతో కేవలం రోహిత్ 7పరుగులతో పెవిలియన్ చేరుకున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా టీ20ల్లో అధిక పరుగులు సాధించిన ఆటగాడిగా టాప్ 1 పొజిషన్ వెళ్తాడనకుంటే అది కాస్తా నిరాశగానే మిగిలింది.

వెస్టిండీస్‌తో జరిగిన చివరి టీ20ల్లోనే

వెస్టిండీస్‌తో జరిగిన చివరి టీ20ల్లోనే

ఈ సిరీస్‌లో టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కొన్ని రికార్డులు అధిగమిస్తాడని అందరూ భావించారు. టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌ జాబితాలో అగ్రస్థానం అందుకోవాలంటే రోహిత్‌ ఇంకా 58 పరుగులు చేయాలి. వెస్టిండీస్‌తో జరిగిన చివరి టీ20ల్లోనే ఈ హిట్‌ మ్యాన్‌ ఈ ఘనత అందుకుంటాడని అందరు భావించారు. కానీ అతను ఆ మ్యాచ్‌లో కూడా విఫలమై నిరాశపరిచాడు.

 రోహిత్‌ 2,214 పరుగులతో తరువాతి స్థానంలో

రోహిత్‌ 2,214 పరుగులతో తరువాతి స్థానంలో

ఈ జాబితాలో న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ మార్టన్‌ గప్టిల్‌ 2,271 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్‌ 2,214 పరుగులతో తరువాతి స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ మూడు టీ20ల సిరీస్‌లో రోహిత్‌ ఈ ఘనతనందుకుంటాడని అతని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరో 74 పరుగులు చేస్తే

మరో 74 పరుగులు చేస్తే

ఇక అంతేకాకుండా ఒక క్యాలెండర్‌ సంవత్సరంలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు నమోదు చేయడానికి కూడా రోహిత్‌ చేరువలో ఉన్నాడు. ఈ ఏడాది అతను 567 పరుగులు చేశాడు. మరో 74 పరుగులు చేస్తే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 2016లో 641 పరుగులతో నెలకొల్పిన రికార్డును అధిగమిస్తాడు. ఇక మరో 4 సిక్స్‌లు బాదితే టీ20ల్లో 100 సిక్స్‌లు కొట్టిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ రికార్డు సృష్టించనున్నాడు.

మ్యాచ్‌ను తారుమారు చేసిన వరుణుడు

మ్యాచ్‌ను తారుమారు చేసిన వరుణుడు

అమితాసక్తిగా ఎదురుచూసిన ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా ఓటమితో ఆరంభించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో బుధవారం ముగిసిన తొలి పోరులో వరుణుడు మ్యాచ్‌ను తారుమారు చేశాడు. ఆసీస్‌ను సొంత గడ్డపై ఓడించి చరిత్ర సృష్టించాలని భావించిన భారత్‌‌కు ఆసీస్ షాకిచ్చింది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆతిథ్య జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది.

Story first published: Wednesday, November 21, 2018, 18:14 [IST]
Other articles published on Nov 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X