న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'నా అంచనా తప్పని బుమ్రా తన ప్రదర్శనతో నిరూపించాడు'

India vs Australia : 'Jasprit Bumrah has proved me wrong' Says Kapil Dev
India vs Australia: Jasprit Bumrah has proved me wrong with his instant success, says Kapil Dev

హైదరాబాద్: ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రదర్శన చేస్తోన్న టీమిండియా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మెల్‌బోర్న్ వేదికగా గత ఆదివారం ముగిసిన బాక్సింగ్ డే టెస్టులో 9 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలీ బుమ్రా కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

 టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఏడాదిలోనే

టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఏడాదిలోనే

అంతేకాదు టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఏడాదిలోనే అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత తొలి బౌలర్‌గా బుమ్రా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అరంగేట్ర ఏడాదిలో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన మూడో బౌలర్‌ బుమ్రా (48). టెర్రీ ఆల్డర్‌మన్‌ (1981లో 54), ఆంబ్రోస్‌ (1988లో 49) బుమ్రా కంటే ముందు ఉన్నారు.

ఆస్ట్రేలియా గడ్డపై ఓ టెస్టులో

ఆస్ట్రేలియా గడ్డపై ఓ టెస్టులో

దీంతో పాటు ఆస్ట్రేలియా గడ్డపై ఓ టెస్టులో ఉత్తమ గణాంకాలు నమోదు చేసిన పేసర్‌గా కపిల్‌ (8/109)ను మెల్ బోర్న్ టెస్టులో బుమ్రా (9/86) అధిగమించాడు. 2018లో మొత్తం 9 టెస్టులాడిన జస్ప్రీత్ బుమ్రా ఏకంగా 48 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో బుమ్రాపై సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, సౌరవ్ గంగూలీ తదితరులు ప్రశంసలు కురిపించారు.

సీఏకు మరో షాక్: మెల్‌బోర్న్ పిచ్‌కి ఐసీసీ ‘యావరేజ్' రేటింగ్

ఆసీస్ గడ్డపై టెస్టుల్లో బుమ్రా ప్రదర్శన అద్భుతం

ఆసీస్ గడ్డపై టెస్టుల్లో బుమ్రా ప్రదర్శన అద్భుతం

తాజాగా, ఈ జాబితాలోకి మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ కూడా చేరాడు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో జస్ప్రీత్ బుమ్రా గురించి మాట్లాడుతూ "జస్‌ప్రీత్ బుమ్రా‌ క్రికెట్‌లోకి వచ్చిన కొత్తలో.. అతని బౌలింగ్‌ శైలిని చూసి ఎక్కువకాలం కొనసాగలేడని అనుకున్నా. నా అంచనా తప్పని అతను తన ప్రదర్శనతో నిరూపించాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో అతని ప్రదర్శన అద్భుతం" అని అన్నాడు.

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న బుమ్రా

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న బుమ్రా

బాక్సిండ్ డే టెస్టులో టీమిండియా విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన బుమ్రా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని సైతం అందుకున్నాడు. కాగా, ఈ సిరిస్‌లో చివరిదైన నాలుగు టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా జరగనుంది. ఈ సిరిస్ అనంతరం ఇరు జట్ల మధ్య జనవరి 12 నుంచి మూడు వన్డేల సిరిస్ ప్రారంభం కానుంది.

1
43626
Story first published: Tuesday, January 1, 2019, 13:48 [IST]
Other articles published on Jan 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X