న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫిట్‌నెస్‌లో పాస్: ఆస్ట్రేలియాతో 'బాక్సింగ్ డే' టెస్టుకి హర్ధిక్ పాండ్యా?

India vs Australia: Hardik Pandya is likely to join Team India before third Test in Melbourne - Report

హైదరాబాద్: ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి జరగనున్న బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ కోసం భారత్ సెలక్టర్లు హార్దిక్ పాండ్యాని ఎంపిక చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, ఈ ఏడాది సెప్టెంబరులో జరిగిన ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై మ్యాచ్ ఆడుతూ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు.

పెర్త్‌లో రెండో టెస్టు: ఆసీస్ 243 ఆలౌట్, భారత విజయ లక్ష్యం 287పెర్త్‌లో రెండో టెస్టు: ఆసీస్ 243 ఆలౌట్, భారత విజయ లక్ష్యం 287

బౌలింగ్ చేస్తుండగా పాండ్యా వెన్నుముకకి గాయమవడంతో మైదానంలోనే కుప్పకూలాడు. దీంతో నడవలేని స్థితిలో ఉన్న పాండ్యాని స్ట్రెచర్ సాయంతో మైదానం వెలుపలకి తీసుకెళ్లాల్సి వచ్చింది. గాయం నుంచి తాజాగా కోలుకున్న హార్దిక్ పాండ్యా, ఇటీవల రంజీ ట్రోఫీలో బరోడా జట్టు తరఫున మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు.

1
43624
ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 73 పరుగులు చేసిన పాండ్యా

ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 73 పరుగులు చేసిన పాండ్యా

ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే బ్యాట్‌తో 137 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో 73 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా అటు బౌలింగ్‌లోనూ సత్తాచాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టి తిరిగి మునుపటి ఫామ్‌ను అందుకున్నాడు.

‘బాక్సింగ్ డే’ టెస్టుకి పాండ్యాను ఎంపిక చేయాలని

‘బాక్సింగ్ డే’ టెస్టుకి పాండ్యాను ఎంపిక చేయాలని

దీంతో ఆస్ట్రేలియాతో ‘బాక్సింగ్ డే' టెస్టుకి పాండ్యాను ఎంపిక చేయాలని సెలక్టర్లు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 31 పరుగులతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సిరిస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.

టీమిండియా విజయ లక్ష్యం 287

పెర్త్ వేదికగా జరుగుతున్న రెండో టస్టులో ఆస్ట్రేలియా 287 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. నాలుగోరోజైన సోమవారం ఓవర్‌నైట్ స్కోరు 132/4తో రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టు 243 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 43 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని మొత్తం 287 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

పెర్త్ టెస్టు ఫలితం ఎలా ఉండబోతుందోనని ఆసక్తికరం

పెర్త్ టెస్టు ఫలితం ఎలా ఉండబోతుందోనని ఆసక్తికరం

ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా ఇప్పటివరకు ఇంతటి పెద్ద లక్ష్యాన్ని చేధించిన దాఖలా లేదు. దీంతో పెర్త్ టెస్టు ఫలితం ఎలా ఉండబోతుందోనని ఆసక్తికరంగా మారింది. మరోవైపు పచ్చికతో కూడిన పిచ్ క్రమంగా బ్యాటింగ్‌‌కి కష్టంగా మారడం విశేషం. మంగళవారం ముగియనున్న రెండో టెస్టులో భారత్ విజయం సాధిస్తుందా? లేక డ్రా చేసుకుంటుందా? అనేది తెలియాలి.

Story first published: Monday, December 17, 2018, 12:48 [IST]
Other articles published on Dec 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X