న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అసలు కోహ్లీ కెప్టెన్సీనే అర్థం కావడం లేదు.. వరుస ఓటములపై గంభీర్ ఫైర్!

India vs Australia: Gautam Gambhir says ‘Can’t understand Virat Kohli captaincy

న్యూఢిల్లీ: టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ తనకు ఏం అర్థం కావడం లేదని భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండు వన్డేల్లో కోహ్లీసేన చిత్తుగా ఓడి సిరీస్‌ను చేజార్చుకున్న విషయం తెలిసిందే. ఈ వరుస ఓటములపై స్పందించిన ఈ బీజేపీ ఎంపీ.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై విమర్శలు గుప్పించాడు. ఈఎస్‌పీఎన్ క్రికెట్ ఇన్‌ఫో పోస్ట్ మ్యాచ్ షో‌లో మాట్లాడుతూ.. భారత ప్రధాన బౌలర్ల సేవలను విరాట్ సరిగ్గా వాడుకోవడం లేదన్నాడు.

బుమ్రాకు 2 ఓవర్లా..?

బుమ్రాకు 2 ఓవర్లా..?

‘నిజాయితీగా చెబుతున్నా.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నాకే ఏం అర్థం కావడం లేదు. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఆసీస్ అడ్డుకోవాలంటే ఆరంభంలోనే వికెట్లు తీయాలి. కానీ విరాట్ మాత్రం ప్రధాన బౌలర్లతో రెండు ఓవర్లను మాత్రమే వేయించాడు. మాములుగా వన్డేల్లో మూడు స్పెల్స్‌లో 4-3-3గా వేయిస్తారు. ఒక్క స్పెల్ గరిష్టంగా నాలుగు ఓవర్ల బౌలింగ్ ఇస్తారు. కానీ విరాట్ వ్యూహం ఏంటో నాకు అర్థం కాలేదు. ఆరంభంలో బుమ్రాతో కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేయించాడు. ఇదేం కెప్టెన్సీనో ఏమో మరీ. ఆ కెప్టెన్సీ తీరును కూడా నేను విశ్లేషించలేకపోతున్నా. ఇదేం టీ20 క్రికెట్ కాదు. అలా ఎందుకు చేశాడో కూడా అర్థం కావడం లేదు. ఇది అత్యంత చెత్త కెప్టెన్సీ'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

ఆల్‌రౌండ్ ఆప్షన్స్..

ఆల్‌రౌండ్ ఆప్షన్స్..

ఇక ఆరో బౌలింగ్ ఆప్షన్ సమస్యను ఎదుర్కొంటున్న టీమిండియా.. వాషింగ్టన్ సుంధర్, శివమ్ దూబేల సేవలను ఎలా వినియోగించుకుంటుందో కూడా గంభీర్ వివరించాడు. ‘భారత జట్టుకు ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే వంటి ఆల్‌రౌండర్లు కావాలి. తదుపరి మ్యాచ్‌లో వారికి అవకాశం ఇచ్చి ఏలా ఆడుతారో చూడాలి. కానీ అలాంటి ఆటగాళ్లు ప్రస్తుతం ఆసీస్‌లో లేకుంటే మాత్రం అది ముమ్మాటికి సెలెక్షన్ కమిటీ తప్పే. అవకాశాలివ్వకుండా ఆటగాళ్ల సత్తాను తెలుసుకోలేం. ఇలా ఆప్షన్స్ భారత్ లేకుంటే మాత్రం కోహ్లీసేనకు ఘోర పరాభావం తప్పదు.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

 పేలవ ఆట..

పేలవ ఆట..

కరోనా విరామం తర్వాత ఆడిన తొలి సిరీస్‌ను భారత్‌ చేజార్చుకుంది. పేలవ ఆటతీరుతో ఫస్ట్ వన్డేలో 66 పరుగులతో చిత్తయిన కోహ్లీ సేన.. ఆదివారం జరిగిన రెండో వన్డేలోనూ 51 పరుగులతో ఓటమిపాలైంది. ఫలితంగా మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను 0-2తో సమర్పించుకుంది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 389 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' స్టీవ్‌ స్మిత్‌ (64 బంతుల్లో 104; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ సాధించగా... వార్నర్‌ (77 బంతుల్లో 83; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), లబ్‌షేన్‌ (61 బంతుల్లో 70; 5 ఫోర్లు), మ్యాక్స్‌వెల్‌ (29 బంతుల్లో 63 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), ఫించ్‌ (69 బంతుల్లో 60; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం భారత్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 338 పరుగులకు పరిమితమైంది. విరాట్‌ కోహ్లి (87 బంతుల్లో 89; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్‌ రాహుల్‌ (66 బంతుల్లో 76; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు.

Story first published: Monday, November 30, 2020, 11:45 [IST]
Other articles published on Nov 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X