న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మైదానంలో నచ్చనివి జరిగితే ఎలా ప్రవర్తించాలో కోహ్లీ చెప్తున్నాడు(వీడియో)

India vs Australia: Australian journalist uses random video to ridicule Virat Kohli

పెర్త్‌: భార‌త కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మీద ఆస్ట్రేలియా జ‌ర్న‌లిస్ట్ ఒక‌రు సోష‌ల్ మీడియాలో అభ్యంతరకర ట్వీట్ చేశారు. కొద్ది రోజులుగా ఆసీస్‌ మీడియాలో భార‌త‌ ఆటగాళ్లకు వ్యతిరేకంగా కథనాలు వెలువ‌డుతున్న విష‌యం తెలిసిందే. పెర్త్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆసీస్‌ కెప్టెన్ టిమ్‌పైన్‌, కోహ్లీకి మధ్య వాగ్వాదం గురించి రోజూ చర్చ జరుగుతూనే ఉంది. దీనిపై ఆసీస్‌ మీడియా భిన్నకథనాలతో హ‌ద్దులు దాటి ప్ర‌వ‌ర్తిస్తోంది. అప్పటి నుంచి మీడియా కోహ్లీ, అతడి జట్టుపై పుంఖానుపుంఖాలుగా వార్తలు రాస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ ఆసీస్‌ పాత్రికేయుడు డెన్నిస్‌ టరీన్ సైతం కోహ్లీని కించ పరిచే విధంగా వీడియోను పోస్ట్‌ చేశారు.

ప్రతికూలంగా జరగనప్పుడు ఎలా ప్రవర్తించాలో

దాంతో పాటు విరాట్ వ్య‌వ‌హార‌శైలిపై భిన్నంగా రాసుకొచ్చాడు. ‘మైదానంలో మనకు ప్రతికూలంగా జరగనప్పుడు ఎలా ప్రవర్తించాలో కోహ్లీ మనకు చూపిస్తున్నాడు' అని క్యాప్షన్‌ ఇచ్చి వీడియో ట్వీట్‌ చేశాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్‌ అవుతోంది. జ‌ర్న‌లిస్ట్‌పై భార‌త అభిమానులు తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు.

వార్నర్ వీడియో కూడా పెట్టి ఉంటే

‘డేవిడ్‌ వార్నర్ మైదానంలో ఇలాగే ప్రవర్తించేవాడు. తన వీడియో కూడా పెట్టి ఉంటే బావుండేది' అని, ‘కోహ్లీ ఎప్పుడైనా బ్యాటు నేలకేసి కొట్టడం, కుర్చీలను తన్నడం మీరు చూశారా?' అని డెన్నిస్‌ను తిడుతూ కామెంట్లు పెడుతున్నారు. రిక్కీ పాంటింగ్ మోటెరా క్రికెట్ స్టేడియం వేదికగా 2011 ప్రపంచ కప్ జింబాబ్వే వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ కథనం గుర్తులేదా. కేవలం ఆసీస్ 250 పరుగులు మాత్రమే చేసిందని పాంటింగ్ ఓ టీవీని బద్ధలుకొట్టాడు. శాండ్‌పేపర్ వాడే జట్ల కంటే ఏం తీసిపోలేదులెమ్మంటూ మరో నెటిజన్ ట్వీట్‌కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

వాళ్లకు లేని.... వీళ్లకు కావాలా

వాళ్లకు లేని.... వీళ్లకు కావాలా

నిజానికి కోహ్లీ ఆసీస్ కెప్టెన్‌తో మాట్లాడుతూ.. ఇలా చేస్తే మీరు సిరీస్‌లో 2-0తేడాతో ఓడిపోతారంటూ కవ్వించే ప్రయత్నం చేశాడు. దానికి స్పందించిన టిమ్ అదే స్థాయిలో స్పందించి రెండ్రోజుల పాటు వాదనకు రమ్మంటూ కోహ్లీని రెచ్చగొట్టాడు. వాటికి సానుకూలంగానే స్పందించిన కోహ్లీ మౌనం పాటించాడు. ఆ తర్వాత ఆసీస్ మీడియా వ్యతిరేక కథనాల వల్ల కోహ్లీ ప్రవర్తనపై వివరణ కావాలంటూ బీసీసీఐని కోరింది ఆస్ట్రేలియా క్రికెట్. ఇది కేవలం ఆటలో భాగమే కానీ, వ్యక్తిగత దూషణ ఏం లేదంటూ ఇరు దేశాల క్రికెట్ బోర్డులతో పాటు ఆసీస్-భారత్‌లు కూడా పట్టించుకోవడం మానేశాయి. డిసెంబరు 26న జరగనున్న బాక్సింగ్ డే టెస్టు కోసం సన్నద్ధమవుతున్నాయి.

Story first published: Sunday, December 23, 2018, 11:12 [IST]
Other articles published on Dec 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X