న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ తన అనుభవాల నుంచే నేర్చుకోవాలి: కుంబ్లే

India vs Australia 2018,1st Test : Virat Kohli Still Learning as a Captain, Feels Anil Kumble
India vs Australia | Anil Kumble feels Virat Kohli is learning from experiences

న్యూ ఢిల్లీ: వివాదాలతో కోచ్‌ పదవి నుంచి తప్పుకున్న అనిల్ కుంబ్లే తాజాగా కోహ్లీపై మరో వ్యాఖ్య చేశాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడని మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే అన్నారు. ప్రస్తుతం కోహ్లీ ఆట పరంగా అనుభవాలను సంపాదించుకుంటున్నాడని తెలిపారు. ఇటీవల ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో జట్టు పరిస్థితి గురించి ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఆసీస్‌తో మ్యాచ్‌ల కోసం విదేశీ పర్యటనలో ఉన్న టీమిండియా ఇంకా పరిణతి చెందాల్సిన అవసరం ఉందని అన్నారు

కోహ్లీ ప్రస్తుతం నేర్చుకునే దశలో

కోహ్లీ ప్రస్తుతం నేర్చుకునే దశలో

‘ఏ ఆటగాడూ లేదా ఏ కెప్టెనూ పూర్తిగా అన్నీ తెలిసిన వాళ్లనికాదనేది నా అభిప్రాయం. విరాట్ కోహ్లీ కూడా ప్రస్తుతం నేర్చుకునే దశలోనే ఉన్నాడు. ఆటగాళ్లు ఎంత ప్రాక్టీస్‌ చేస్తే ఆట అంత బాగా అడగలరు. ఎన్ని మ్యాచ్‌లు ఆడితే వారికంత అనుభవం చేకూరుతుంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌ల నుంచి మొన్నటి వెస్టిండీస్‌ మ్యాచ్‌ల వరకు ప్రతీది టీమిండియాకొక అనుభవం లాంటిదే.

ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌ల నుంచి నేర్చుకున్నాడని

ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌ల నుంచి నేర్చుకున్నాడని

కోహ్లీ విషయానికొస్తే ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌ల నుంచి అతడెంతో నేర్చుకున్నాడని అనుకుంటున్నాను. నాకు తెలిసి ప్రస్తుత పరిస్థితుల్లో బౌలింగ్‌ విభాగంలో ఆసీస్‌ కంటే టీమిండియానే మెరుగ్గా ఉంది. అయితే ఆసీస్‌ లోయర్‌ ఆర్డర్‌ పట్ల టీమిండియా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకుంటే ఇంతకుముందు లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్స్‌ టీమిండియాను రెండు సార్లు దెబ్బకొట్టారు. మరోసారి ఆ అవకాశం వారికివ్వకూడదు.

టీమిండియాకేమంత కష్టం కాదు

టీమిండియాకేమంత కష్టం కాదు

ఆసీస్‌ సొంత గడ్డపై వారికే ఎక్కువ పరిజ్ఞానం ఉంటుంది. టీమిండియా పిచ్‌ పరిస్థితులను సరిగ్గా అంచనా వేయగలగాలి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుంటే గెలవడం టీమిండియాకేమంత కష్టం కాదు' అని విశ్లేషించారు.

కుంబ్లే అలా తప్పుకున్నాడు:

కుంబ్లే అలా తప్పుకున్నాడు:

ధర్మశాలలో జరిగిన చివరి టెస్టులో కోహ్లీకి సమాచారం లేకుండానే చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ను కుంబ్లే జట్టులోకి తీసుకున్నట్టు వార్తలు రావడం కలకలం రేపింది.

ఈ దశలో పొరపొచ్చాలున్నా కోచ్‌గా కుంబ్లే కొనసాగాడు. అయితే, చాంపియన్స్‌ ట్రోఫీలో లీగ్‌దశలో అదరగొట్టిన భారత్‌.. ఫైనల్లో పాకిస్థాన్‌ చేతిలో చిత్తయింది. మ్యాచ్‌ ఓడిన తర్వాత జట్టును ఉద్దేశించి కుంబ్లే మాట్లాడిన తీరుతో సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తదనంతరం కాంట్రాక్ట్‌ పొడిగింపు కోసం కుంబ్లే బోర్డుకు దరఖాస్తు కూడా చేయలేదు.

Story first published: Monday, December 3, 2018, 10:00 [IST]
Other articles published on Dec 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X