న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Australia 3rd T20I లైవ్ అప్‌డేట్స్.. ఆఖరి టీ20 ఆసీస్‌దే!

India vs Australia 3rd T20 Live Updates

సిడ్నీ: ఆసీస్ గడ్డపై భారత్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకున్న కోహ్లీ సేన ఆ జోరును కొనసాగించలేకపోయింది. ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన ఆఖరి టీ20లో 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(61 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 85) ఒంటరి పోరాటం వృథా అయింది. అతనికి తోడుగా మరో బ్యాట్స్‌మెన్ రాణించకపోవడం, చెత్త ఫీల్డింగ్ భారత్ విజయావకాశాలను దెబ్బతీశాయి. మరోవైపు సమష్టిగా రాణించిన ఆసీస్ అద్భుత విజయాన్నందుకుని క్లీన్ స్వీప్‌ను తప్పించుకుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. మాథ్యూవేడ్ (53 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 80), గ్లేన్ మ్యాక్స్‌వెల్(36 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సుంధర్ రెండు వికెట్లు తీయగా.. నటరాజన్, ఠాకుర్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 174 పరుగులే చేసింది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్వెప్సన్ (3/23) భారత పతనాన్ని శాసించగా.. మ్యాక్స్‌వెల్, అబాట్, టై, జంపా తలో వికెట్ తీశారు.

Dec 08, 2020, 5:21 pm IST

ఆఖరి టీ20 ఆసీస్‌దే

ఆఖరి టీ20లోె ఆస్ట్రేలియా 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ జట్టు విధించిన 187 పరుగుల లక్ష్యాన్ని భారత్ అందుకోలేకపోయింది.

Dec 08, 2020, 5:19 pm IST

సుంధర్ ఔట్

ఫోర్ కొట్టి జోరు కనబర్చిన సుంధర్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

Dec 08, 2020, 5:13 pm IST

విరాట్ ఔట్

భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (61 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 85) సామ్స్ సూపర్ క్యాచ్‌కు వెనుదిరిగాడు.

Dec 08, 2020, 5:11 pm IST

లక్కీ విరాట్.. స్టంపౌట్ మిస్

విరాట్ కోహ్లీకి మరో లైఫ్ లభించింది. స్టంపౌట్ చేసే అవకాశాన్ని మాథ్యూవేడ్ వృథా చేశాడు. జంపా వేసిన 18వ ఓవర్ ఆఖరి బంతికి స్టెప్ ఔటై ఆడే ప్రయత్నం చేసిన విరాట్.. బంతిని మిస్సయ్యాడు.

Dec 08, 2020, 5:07 pm IST

ఐదో వికెట్ కోల్పోయిన భారత్

భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. వరుస బౌండరీలతో జోరు కనబర్చిన హార్దిక్ పాండ్యా(20) ఆట ముగిసింది. జంపా బౌలింగ్‌లో ఫించ్‌కు చిక్కి పాండ్యా వెనుదిరిగాడు.

Dec 08, 2020, 5:03 pm IST

కోహ్లీ, పాండ్యా మెరుపులు..

విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపిస్తుండటంతో భారత్ విజయం దిశగా దూసుకెళ్లుంది.

Dec 08, 2020, 4:46 pm IST

అయ్యర్ గోల్డెన్ డక్

టీమిండియా నాలుగో వికెట్ కూడా కోల్పోయింది. శాంసన్ ఔటవ్వడంతో క్రీజులోకి వచ్చిన అయ్యర్.. ఆడిన ఫస్ట్ బాల్‌కే ఎల్బీగా వెనుదిరిగాడు. రివ్యూ తీసుకున్నా.. ఫలితం లేకపోయింది. దాంతో భారత్ 100 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.

Dec 08, 2020, 4:44 pm IST

మూడో వికెట్ కోల్పోయిన భారత్

భారత్ మూడో వికెట్ కోల్పోయింది. మూడో మ్యాచ్‌లో కూడా శాంసన్(10) విఫలమయ్యాడు. స్వెప్సన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగాన్‌లో స్మిత్‌కు చిక్కాడు.

Dec 08, 2020, 4:41 pm IST

విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ

విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జంపా బౌలింగ్‌లో క్విక్ సింగిల్ తీసిన భారత కెప్టెన్..41 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో అర్థ సెంచరీ సాధించాడు.

Dec 08, 2020, 4:29 pm IST

రెండో వికెట్ కోల్పోయిన భారత్.. ధావన్ ఔట్

భారత్ రెండో వికెట్ కోల్పోయింది. స్వెప్సన్ బౌలింగ్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్(21 బంతుల్లో 3 ఫోర్లతో 28) డిప్ మిడ్ వికెట్ మీదుగా పుల్ షాట్ ఆడగా.. ఆ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న ఆడమ్ సామ్స్ పరుగెత్తుకుంటూ వచ్చి బంతిని అందుకున్నాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 74 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

Dec 08, 2020, 4:16 pm IST

ముగిసిన పవర్ ప్లే.. భారత్ స్కోర్ 55/1

పవర్ ప్లే ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. శిఖర్ ధావన్(18 బ్యాటింగ్), విరాట్ కోహ్లీ(31 బ్యాటింగ్)ల భాగస్వామ్యం కూడా హాఫ్ సెంచరీ ధాటింది.

Dec 08, 2020, 4:02 pm IST

విరాట్ కోహ్లీకి లైఫ్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(9)కి మరో లైఫ్ లభించింది. మ్యాక్స్ వెల్ వేసిన మూడో ఓవర్ రెండో బంతిని విరాట్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడగా.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్ చేతులోకి వచ్చిన సునాయస క్యాచ్‌ను నేలపాలు చేశాడు.

Dec 08, 2020, 3:55 pm IST

జస్ట్ మిస్..

విరాట్ కోహ్లీ(2) తృటిలో రనౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అబాట్ బౌలింగ్‌లో క్విక్ సింగిల్‌కు విరాట్ ప్రయత్నించగా.. బంతిని అందుకున్న మ్యాక్సీ వికెట్లవైపు కొట్టాడు. కానీ బంతి మిల్లీ మీటర్ తేడాతో స్టంప్స్‌కు తగలకుండా వెళ్లింది. దాంతో భారత కెప్టెన్ ఊపిరి పీల్చుకున్నాడు.

Dec 08, 2020, 3:51 pm IST

తొలి వికెట్ కోల్పోయిన భారత్

187 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు గట్టి షాక్ తగిలింది. మ్యాక్స్‌వెల్ వేసిన ఫస్ట్ ఓవర్ సెకండ్ బాల్‌‌ను మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్‌కు ప్రయత్నించిన ఓపెనర్ కేఎల్ రాహుల్(0) స్మిత్‌కు చిక్కి వెనుదిరిగాడు.

Dec 08, 2020, 3:31 pm IST

భారత్ లక్ష్యం 187

ఆఖరి ఓవర్లలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆసీస్ 186 పరుగులకే పరిమితమైంది. చివరి 5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయిన ఆసీస్ 47 పరుగులు చేసింది.

Dec 08, 2020, 3:30 pm IST

డీఆర్సీ షాట్ రనౌట్

నట్టూ వేసిన ఆఖరి ఓవర్‌లో రెండో పరుగుకు ప్రయత్నించిన డీఆర్సీ షాట్(7) రనౌట్‌గా వెనుదిరిగాడు.

Dec 08, 2020, 3:24 pm IST

మ్యాక్సీ బౌల్డ్..

వరుసగా లైఫ్‌లు అందుకున్న మ్యాక్స్‌వెల్ నటరాజన్ బౌలింగ్‌లో మాత్రం వెనుదిరగక తప్పలేదు. అతను వేసిన ఆఖరి ఓవర్ ఫస్ట్ బాల్‌కు మ్యాక్సీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రివర్స్ స్వీప్ షాటో ఆడబోయి వికెట్ సమర్పించుకున్నాడు.

Dec 08, 2020, 3:16 pm IST

మ్యాక్సీ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ

మ్యాక్స్‌వెల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నటరాజన్ వేసిన 18వ ఓవర్‌లో ఫోర్ కొట్టి 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు.

Dec 08, 2020, 3:10 pm IST

మ్యాక్సీకి మళ్లీ లైఫ్..!

గ్లేన్ మ్యాక్స్‌వెల్‌కు మరో లైఫ్ లభించింది. శార్దుల్ ఠాకుర్ వేసిన 17వ ఓవర్‌లో అతను ఇచ్చిన క్యాచ్‌ను దీపక్ చాహర్ నేలపాలు చేశాడు.

Dec 08, 2020, 2:59 pm IST

సంజూ.. వాటే ఫీల్డింగ్

సంజూ శాంసన్ కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. సూపర్ మ్యాన్‌లా గాల్లోకి లేచి సిక్సర్‌ను ఆపాడు. ఠాకూర్ వేసిన 14వ ఓవర్ రెండో బంతిని మ్యాక్స్‌వెల్ భారీ షాట్ ఆడగా.. బౌండరీ లైన్ వద్ద సంజూ అడ్డుకొని 4 పరుగులు సేవ్ చేశాడు.

Dec 08, 2020, 2:56 pm IST

మ్యాక్సీ.. లక్కీ

మ్యాక్స్‌వెల్ లక్కీ లైఫ్ అందుకున్నాడు. చాహల్ వేసిన 13వ ఓవర్ ఆఖరి బంతిని మ్యాక్సీ భారీ షాట్‌కు ప్రయత్నించి బంతి గాల్లోకి లేచింది. అప్రమత్తమైన కీపర్ కేఎల్ రాహుల్ బంతిని అందుకున్నాడు. ఇక మ్యాక్సీ కూడా మైదానం వీడేందుకు సిద్దమయ్యాడు. బౌండరీ లైన్ వరకు వెళ్లగా.. మరో బ్యాట్స్‌మన్ కూడా గ్రౌండ్‌లోకి వచ్చాడు. కానీ అప్పుడే థర్డ్ అంపైర్ నోబాల్ అని ప్రకటించడంతో అంతా అవాక్కయ్యారు. మ్యాక్సీ మళ్లీ తిరిగొచ్చాడు.

Dec 08, 2020, 2:37 pm IST

మాథ్యూ వేడ్ హాఫ్ సెంచరీ

ఆసీస్ ఓపెనర్ మాథ్యూ వేడ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నటరాజన్ వేసిన 11వ ఓవర్‌లో లెగ్‌సైడ్ క్విక్ డబుల్‌తో 49 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ సిరీస్‌లో వేడ్‌కు బ్యాక్‌ టు బ్యాక్ ఫిఫ్టీ

Dec 08, 2020, 2:30 pm IST

స్మిత్ క్లీన్ బౌల్డ్.. ఆసీస్ స్కోర్ 79/2

ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుంధర్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్(24) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ ఓవర్‌లో ఫస్ట్ బంతికే స్టంపౌట్ కావాల్సిన అతను.. కీపర్ కేఎల్ రాహుల్ తప్పిదంతో బతికిపోయాడు. కానీ మరో మూడు బంతుల వ్యవధిలోనే వెనుదిరగడంతో రాహుల్ ఊపిరి పీల్చుకున్నాడు.

Dec 08, 2020, 2:26 pm IST

ఆఖరి టీ20కి కోహ్లీ డూప్!

ఆఖరి టీ20కి విరాట్ కోహ్లీని పోలీ ఉన్న వ్యక్తి హాజరయ్యాడు. స్టాండ్స్‌లో అతను నిలబడ్డ ఫొటో నెట్టింట వైరల్ అయింది. అచ్చం కోహ్లీలానే ఉన్న అతను అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ ఫొటోలో అతని పక్కన ఉన్న వ్యక్తి నవ్‌దీప్ సైనీకి డూప్‌లా ఉన్నాడు.

Dec 08, 2020, 2:14 pm IST

పవర్ ప్లేలో ఆసీస్ స్కోర్ 51/1

మాథ్యూ వేడ్ ధాటిగా ఆడటంతో ఆసీస్ పవర్ ప్లే ముగిసే సరికి వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది. చాహర్ వేసిన ఐదో ఓవర్‌లో వరుస బౌండరీలు బాదిన మాథ్యూ..17 రన్స్ పిండుకున్నాడు. అనంతరం నటరాజన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

Dec 08, 2020, 1:51 pm IST

తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్.. ఫించ్ సిల్వర్ డక్

వాషింగ్టన్ సుంధర్ బౌలింగ్‌లో ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్(0) పాండ్యాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

Dec 08, 2020, 1:43 pm IST

ఆసీస్ తుది జట్టులోకి వచ్చిన ఫించ్

Dec 08, 2020, 1:42 pm IST

ఆస్ట్రేలియాపై చివరి టీట్వంటీలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

Story first published: Tuesday, December 8, 2020, 17:34 [IST]
Other articles published on Dec 8, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X