న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్టు సిరీస్‌లో భారత్ గెలుస్తుందని జోస్యం చెప్తోన్న వీవీఎస్

India vs Australia 2018: VVS Laxman predicts result of four-match Test series

హైదరాబాద్: సుదీర్ఘ కాలంగా ఆసీస్ గడ్డపై టెస్టు సిరీస్‌లో పరాభవాన్ని ఎదుర్కొంటున్న టీమిండియా మరి కొద్ది రోజుల్లో తాను ఎదుర్కోనున్న కఠిన సవాల్‌కు సిద్ధమవుతోంది. టీమిండియా డిసెంబరు 6 నుంచి ఆతిథ్య జట్టుతో నాలుగు టెస్టుల సిరీస్‌ని ఆడనుంది. ఈ నేపథ్యంలో.. సిరీస్ ఫలితంపై ఇప్పటికే ఇరు దేశాల మాజీ క్రికెటర్లు తమ అంచనాలు చెప్తుండగా.. ఈ జాబితాలోకి తాజాగా వీవీఎస్ లక్ష్మణ్‌ కూడా చేరాడు.

భారత్ కచ్చితంగా 3-1తో గెలవగలదు

భారత్ కచ్చితంగా 3-1తో గెలవగలదు

ఆస్ట్రేలియా పిచ్‌లను చూస్తుంటే.. మ్యాచ్‌లు డ్రా అయ్యే అవకాశాలు శూన్యమనిపిస్తోంది. ఆ గడ్డపై టెస్టు సిరీస్‌ గెలిచేందుకు భారత్‌కి ఇంతకంటే అవకాశం మరొకటి ఉండదు. డేవిడ్ వార్నర్, స్టీవ్‌స్మిత్ ఆసీస్ జట్టులో లేకపోవడంతో ఈ మాట చెప్పడం లేదు. భారత్ జట్టు‌కి సిరీస్ గెలవగలిగే సత్తా ఉందని నమ్మి చెప్తున్నా. ఇటీవల ఇంగ్లాండ్ గడ్డపై భారత్ జట్టు 4-1తో సిరీస్ గెలుస్తుందని అంచనా వేశాను. కానీ.. టీమిండియా 1-4 తేడాతో ఓడిపోయింది. అయితే.. ఆస్ట్రేలియాపై మాత్రం ధీమాగా చెప్తున్నా. భారత్ జట్టు కచ్చితంగా 3-1తో సిరీస్ గెలవగలదు.

టెస్టు సిరీస్‌ని భారత్ కైవసం చేసుకుంటుందని

టెస్టు సిరీస్‌ని భారత్ కైవసం చేసుకుంటుందని

4 టెస్టుల సిరీస్‌ని భారత్ జట్టు కైవసం చేసుకుంటుందని చెప్పుకొచ్చిన వీవీఎస్ లక్ష్మణ్.. క్వీన్‌స్వీప్ మాత్రం కష్టమేనంటూ అనుమాన్ని వ్యక్తం అభిప్రాయపడ్డాడు. 2014లో ఆఖరిసారి ఆస్ట్రేలియా గడ్డపై నాలుగు టెస్టుల సిరీస్‌లో పోటీపడిన భారత్ జట్టు 0-2 తేడాతో ఓడిపోయింది. ఆ సిరీస్‌లో విరాట్ కోహ్లి నాలుగు శతకాలు సాధించి 600పైచిలుకు స్కోరు సాధించినా.. భారత్ జట్టు మాత్రం కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేకపోయింది.

ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టు బలహీనంగా

ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టు బలహీనంగా

అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టు బలహీనంగా కనిపిస్తోంది. బాల్ టాంపరింగ్ కారణంగా డేవిడ్ వార్నర్, స్టీవ్‌స్మిత్, బెన్‌క్రాప్ట్‌పై నిషేధం వేటు పడటంతో.. ఆ జట్టు‌లో సమతూకం లోపించింది. దీంతో.. ఆ గడ్డపై టెస్టు సిరీస్‌ గెలిచేందుకు భారత్‌కిదే సువర్ణావకాశమని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.

Story first published: Tuesday, November 27, 2018, 17:32 [IST]
Other articles published on Nov 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X