న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'టీమిండియాకు ఆడని సమయంలో లైన్‌ అండ్‌ లెంగ్త్‌పై కఠోరంగా శ్రమించా'

India tour of West Indies: Umesh says time away from team gave him chance to work on bowling issues

ఆంటిగ్వా: టీమిండియాకు ఆడని సమయంలో లైన్‌ అండ్‌ లెంగ్త్‌పై కఠోరంగా శ్రమించా. ప్రస్తుతం పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నా అని పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ పేర్కొన్నాడు. 2018 డిసెంబర్‌లో ఆస్ట్రేలియాపై చివరగా టెస్టు ఆడాడు. అనంతరం ఉమేష్ భారత జట్టుకు దూరమయ్యాడు. ఇక రంజీలో విదర్భ తరఫున అద్భుత ప్రదర్శన చేసాడు. ఆ వెంటనే ఐపీఎల్‌లో బెంగళూరు జట్టుకు ఆడాడు. తాజాగా విండీస్‌-ఏతో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాడు. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఉమేష్ 19 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.

<strong><em>ఆసీస్ మాజీ పేసర్ మిచెల్‌ జాన్సన్‌కు అరుదైన గౌరవం!!</em></strong>ఆసీస్ మాజీ పేసర్ మిచెల్‌ జాన్సన్‌కు అరుదైన గౌరవం!!

నిరంతరం ప్రాక్టీస్ చేయాలి:

నిరంతరం ప్రాక్టీస్ చేయాలి:

ఉమేష్ టీమిండియాకు ఆడని ఖాళీ సమయంలో విదర్భ క్రికెట్‌ అకాడమీలో కోచ్‌ సుబ్రతో బెనర్జీ వద్ద శిక్షణ తీసుకున్నాడు. తాజాగా ఉమేష్ యాదవ్ మాట్లాడుతూ... 'ఒక ఫాస్ట్‌ బౌలర్‌గా నిరంతరం ప్రాక్టీస్ చేయాలి. ఏయే ప్రాంతాల్లో బంతులేయాలో తెలుసుకొని మంచి లయను సెట్ చేసుకోవాలి. నేను కూడా ఇదే చేశాను. మ్యాచ్‌ పరిస్థితులకు తగ్గట్టు సిద్ధం అయ్యాను' అని ఉమేష్ తెలిపాడు.

సుబ్రతో రాయ్‌తో కలిసి పని చేశా:

సుబ్రతో రాయ్‌తో కలిసి పని చేశా:

'భారత జట్టుకు ఆడని సమయంలో విదర్భ క్రికెట్‌ అకాడమీలో కోచ్‌ సుబ్రతో రాయ్‌తో కలిసి పని చేశా. నిరంతర క్రికెట్‌ ఆడితే లైన్‌ అండ్‌ లెంగ్త్‌ సరిచేసుకోవడం కష్టమవుతుంది. కొన్ని డెలివరీల సమస్యలు కూడా ఉన్నాయి. అన్నిటిని ఆయన వద్ద పరిష్కరించుకున్నా. చాలా కాలం తర్వాత సన్నాహక మ్యాచ్‌ ఆడినందుకు సంతోషంగా ఉంది. ఇంతకుముందు భారత్ ఎ తరపున ఆడటానికి ఇక్కడకు వచ్చా. పిచ్‌ భిన్నంగా మాత్రం లేదు. బంతి స్వింగ్ అయింది' అని ఉమేశ్‌ పేర్కొన్నాడు.

 లోపాలను సరిదిద్దుకున్నా:

లోపాలను సరిదిద్దుకున్నా:

'ఏయే ప్రాంతాల్లో బంతులు విసరాలో మానసికంగా సిద్ధమయ్యా. డాట్ బాల్స్ వేయడం నా మనస్తత్వం. ఆసీస్‌ పర్యటన తర్వాత రంజీ ట్రోఫీ ఆడా. వెంటనే ఐపీఎల్‌ వచ్చింది. ఆ తరువాత రెండున్నర నెలల్లో నా లోపాలను పరిష్కరించడానికి, నా లయను తిరిగి పొందడంపై దృష్టి సారించా. అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకోవడం మంచిది. అప్పుడే తప్పుల్ని సరిచేసుకోగలం' అని ఉమేష్ అన్నారు.

పీసీబీకి క్షమాపణలు చెప్పిన స్పాట్‌ ఫిక్సింగ్‌ క్రికెటర్‌

పేస్ బౌలర్ల మధ్య పోటీ ఉంది:

పేస్ బౌలర్ల మధ్య పోటీ ఉంది:

'బెనర్జీ నా బౌలింగ్‌పై సానుకూలంగా ఉన్నారు. భారత జట్టులోని ఆటగాళ్లు, బ్యాట్స్‌మెన్‌ను అడిగినప్పుడూ అదే చెప్పారు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. నేను అదే చేశా. జట్టు నిరంతరం మ్యాచ్‌లు ఆడుతుందంటే రిజర్వు బెంచ్‌ బలం బాగుండాలి. టీమిండియాలో పేస్ బౌలర్ల మధ్య మంచి పోటీ ఉంది. మెరుగైన ప్రదర్శన చేసిన వారికి అవకాశాలు లభిస్తాయి' అని ఉమేశ్‌ చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, August 20, 2019, 15:32 [IST]
Other articles published on Aug 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X