న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Wriddhiman Saha:టెస్ట్‌లకు పక్కనపెట్టిన బీసీసీఐ.. కీలక నిర్ణయం తీసుకున్న సాహా!

India senior wicketkeeper Wriddhiman Saha Opts Out Of Bengals Ranji Trophy Campaign
Saha Making It Easy For Ks Bharat | Teamindia Test Squad || Oneindia Telugu

న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ వృద్దిమాన్ సాహా కీలకం నిర్ణయం తీసుకున్నాడు. ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమయ్యే ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ నుంచి తప్పుకున్నాడు. బెంగాల్ జట్టుకు ప్రాతినిథ్యం వహించే అతను ఈ సీజన్‌కు దూరంగా ఉండాలనుకున్నాడు. టీమిండియాకు సాహా సేవల అవసరం లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) భావిస్తున్న నేపథ్యంలోనే సాహా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొహాలి వేదికగా వచ్చేనెలలో భారత జట్టు శ్రీలంకతో ఆడే రెండు టెస్టుల సిరీస్‌కు తనను పక్కన పెడ్తారనే విషయం సాహాకు తెలిసినట్లు సమాచారం.

కేఎస్ భరత్ రాకతో..

కేఎస్ భరత్ రాకతో..

ఈ నేపథ్యంలోనే టీమిండియాకు ఆడనప్పుడు రంజీ క్రికెట్ ఆడటం ఎందుకనే అభిప్రాయంలో సాహా ఉన్నాడని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు. ఇప్పటికే టీమిండియాలో రిషభ్‌ పంత్‌ పూర్తిస్థాయిలో కీపింగ్‌ బాధ్యతలు నిర్వర్తిస్తోన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన కాన్పూర్‌ టెస్టులో కేఎస్‌ భరత్‌ సైతం యువ వికెట్ కీపర్‌గా ఆకట్టుకున్నాడు. దీంతో అతన్ని పంత్‌కు బ్యాకప్‌ కీపర్‌గా తీర్చిదిద్దాలని టీమ్‌మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అందువల్లే సాహాను పక్కనపెట్టాలనే నిర్ణయం తీసుకొని ఉంటారని సదరు ఉన్నతాధికారి తెలిపాడు.

బోర్డు పెద్దల సూచనలతోనే..

బోర్డు పెద్దల సూచనలతోనే..

‘శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు ఎంపిక చేయమని జట్టు యాజమాన్యంలోని కీలక వ్యక్తులు సాహాకు నేరుగా చెప్పారు. పంత్‌కు ప్రత్యామ్నాయంగా కేఎస్‌ భరత్‌కు అవకాశం ఇవ్వాలని సెలెక్టర్లు నిర్ణయించుకున్నారు. అతన్ని టీమిండియా జట్టుతో కొనసాగిస్తే పరిస్థితులకు అలవాటు పడతాడని అనుకున్నారు. అందుకే సాహాను పక్కనపెట్టారు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే అతను కూడా బెంగాల్ క్రికెట్‌ అసోసియేషన్‌కు ఈ సీజన్‌లో రంజీ ట్రోఫీ ఆడనని చెప్పి ఉంటాడు. దాంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కూడా అతన్ని రంజీలకు ఎంపిక చేయలేదేమో!' అని ఆ అధికారి వివరించారు.

అత్యుత్తమ కీపర్‌గా..

అత్యుత్తమ కీపర్‌గా..

కాగా, సాహా ఇప్పటికే 37 ఏళ్ల వయసు ఉండటంతో సెలెక్షన్‌ కమిటీ కూడా యువకుల వైపు మొగ్గు చూపుతోందని కూడా సదరు అధికారి తెలిపాడు. అతనికి ఈ విషయం బాధ కలిగించేదే అయినా.. ఇకపై టీమిండియాకు ఆడకపోతే రంజీ ట్రోఫీ ఎందుకు ఆడాలని అతడు అనుకొని ఉంటాడని అభిప్రాయపడ్డాడు. ఇక సాహా టీమిండియా తరఫున ఇప్పటివరకు మొత్తం 40 టెస్టులు ఆడగా.. అందులో మూడు సెంచరీలతో మొత్తం 1,353 పరుగులు చేశాడు. కీపర్‌గా 104 మందిని పెవిలియన్‌ పంపాడు. అందులో 92 క్యాచ్‌లు, 12 స్టంప్‌ ఔట్లు ఉన్నాయి.

Story first published: Wednesday, February 9, 2022, 14:09 [IST]
Other articles published on Feb 9, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X