న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India Playing XI: ఉమ్రాన్ ఇన్..కుల్దీప్ సేన్ ఔట్..షెహ్‌బాజ్ డౌట్! బంగ్లాతో రెండో వన్డే ఆడే భారత తుది జట్టు ఇదే

India Playing XI vs Bangladesh for 2nd ODI: Umran Malik In Kuldeep Sen Out and Shahbaz Ahmed Doubt

హైదరాబాద్: బంగ్లాదేశ్ పర్యటనను ఓటమితో ప్రారంభించిన టీమిండియా మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఢాకా వేదికగానే బుధవారం జరగనున్న రెండో వన్డేలో అమీతుమీ తేల్చుకోనుంది. సునాయసంగా గెలవాల్సిన తొలి వన్డే మ్యాచ్‌ను వికెట్ తేడాతో కోల్పోయిన రోహిత్ సేన.. సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. బ్యాటింగ్ వైఫల్యంతో పాటు చెత్త ఫీల్డింగ్‌తో ఓటమి చవిచూసిన టీమిండియా.. ఆ తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకొని విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.

చివరి రెండు వన్డేలను గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటుంది. మరోవైపు మెహ్‌ది హసన్ అసాధారణ పోరాటంతో చిరస్మరణీయ విజయాన్ని అందుకున్న బంగ్లాదేశ్.. అదే జోరులో రెండో వన్డే గెలిచి సిరీస్ విజయంతో భారత్‌కు షాకివ్వాలనుకుంటుంది. తొలి వన్డే ఓటమి నేపథ్యంలో భారత జట్టు తుది జట్టులో మార్పులు చేస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

ఉమ్రాన్ ఇన్.. కుల్దీప్ ఔట్..

ఉమ్రాన్ ఇన్.. కుల్దీప్ ఔట్..

గాయంతో దూరమైన మహమ్మద్ షమీ స్థానంలో ఈ పర్యటనకు ఎంపికైన ఉమ్రాన్ మాలిక్ రెండో వన్డేకు అందుబాటులోకి వచ్చాడు. తొలి వన్డే రోజే బంగ్లా చేరుకున్న అతను ఆ మ్యాచ్ సెలెక్షన్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. దాంతో యువ పేసర్ కుల్దీప్ సేన్ అరంగేట్రం చేశాడు. ఫస్ట్ మ్యాచ్‌లోనే అద్భుత బౌలింగ్‌తో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు.

అతను రాణించినా.. టీమ్ కాంబినేషన్‌లో భాగంగా పక్కనపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్రాన్ మాలిక్‌ను ఆడించాలనుకుంటే కుల్దీప్ బెంచ్‌కు పరిమితమవుతాడు. లేదు అతనికి మరో అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం ఉమ్రాన్‌‌కు నిరాశ తప్పదు. అయితే గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే ఉమ్రాన్ మాలిక్‌కే ఆడే అవకాశాలు ఉన్నాయి.

సిరాజ్ సారథ్యంలో..

సిరాజ్ సారథ్యంలో..

మహమ్మద్ సిరాజ్ సారథ్యంలో ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్‌లు పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. తొలి మ్యాచ్‌లో సిరాజ్ అద్బుత ప్రదర్శనతో మూడు కీలక వికెట్లు తీసాడు. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైన పేస్ ఆల్‌రౌండర్లు దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో అదరగొట్టారు. అయితే చివర్లో ఒత్తిడికి లోనై బంగ్లాదేశ్ ఆఖరి వికెట్ తీయలేక ఓటమి చవిచూశారు. దీపక్, శార్దూల్ లోయరార్డర్‌లో బ్యాటింగ్ ఝులిపించాల్సి ఉంది. డెత్ ఓవర్లలో కూడా క్రమశిక్షణతో బౌలింగ్ చేయాలి.

షెహ్‌బాజ్ డౌట్..

షెహ్‌బాజ్ డౌట్..

రాకరాక వచ్చిన అవకాశాన్ని షెహ్‌బాజ్ అహ్మద్ వినియోగించుకోలేకపోయాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ఫిట్‌నెస్ సమస్యలతో తొలి వన్డేకు దూరమైన స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్.. రెండో వన్డేకు కోలుకుంటే షెహ్‌బాజ్ బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. అక్షర్ కోలుకోకపోతే మాత్రం షెహ్‌బాజ్ మరో అవకాశం దక్కుతుంది. మరో స్పిన్ ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్ స్థానానికి డోకా లేదు. స్పిన్‌కు అనుకూలిస్తున్న వికెట్‌పై ఈ ఇద్దరు కీలకం కానున్నారు. సుందర్ బ్యాట్ మెరిపించాల్సి ఉంది.

బ్యాటింగ్‌లో మార్పుల్లేవ్..

బ్యాటింగ్‌లో మార్పుల్లేవ్..

తొలి వన్డేలో బ్యాటర్లు దారుణంగా విఫలమైనా.. మార్పులు ఉండకపోవచ్చు. ఓపెనర్లు రోహిత్, ధావన్ ఆడటం ఖాయం. ఈ ఇద్దరూ జట్టుకు మంచి శుభారంభాన్ని అందించాల్సి ఉంది. స్టన్నింగ్ క్యాచ్‌కు వెనుదిరిగా విరాట్ కోహ్లీ ఫస్ట్‌డౌన్‌లో బరిలోకి దిగుతాడు. అతను సైతం చెలరేగాల్సి ఉంది. నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్, ఐదో స్థానంలో కేఎల్ రాహుల్ ఆడటం ఖాయం. తొలి వన్డేలో రాణించిన రాహుల్ ఆ ఫామ్ కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఆరో స్థానంలో సుందర్ ఆడనుండగా.. దీపక్ చాహర్‌తో తొమ్మిదో స్థానం వరకు బ్యాటింగ్ లైనప్ ఉంది.

భారత తుది జట్టు (అంచనా)

భారత తుది జట్టు (అంచనా)

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), అక్షర్ పటేల్/షెహ్‌బాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్/కుల్దీప్ సేన్

Story first published: Tuesday, December 6, 2022, 7:05 [IST]
Other articles published on Dec 6, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X