న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India Playing 11: సిరాజ్ ఔట్.. ఆవేశ్ ఖాన్ ఇన్! న్యూజిలాండ్‌తో రెండో టీ20లో బరిలోకి దిగే భారత జట్టు ఇదే!

 India Playing 11 vs New Zealand 2nd T20 Match: Injured Mohammed Siraj Out And Avesh Khan In

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా కాన్పూర్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొంది బోణీ కొట్టింది. ఈ విజయంతో కెప్టెన్‌గా రోహిత్ శర్మ, కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌లకు మంచి శుభారంభం దక్కింది. ఇక ఇదే ఉత్సాహంలో రోహిత్ సేన మరో ఆసక్తికర పోరుకు సిద్దమవుతోంది. రాంచీ వేదికగా శుక్రవారం జరిగే రెండో టీ20లో పర్యాటక కివీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటుంది. తద్వారా చివరి టీ20కి రిజర్వ్ బెంచ్ సత్తాను పరీక్షించాలని భావిస్తోంది. మరోవైపు ఫస్ట్ టీ20లో ఆఖరి ఓవర్‌ వరకు పోరాడిన న్యూజిలాండ్.. రెండో టీ20లో ఎలాగైనా గెలిచి సిరీస్ రేసులో నిలవాలనుకుంటుంది. దాంతో ఈ మ్యాచ్‌పై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 గాయంతో సిరాజ్ ఔట్..

గాయంతో సిరాజ్ ఔట్..

ఇక రెండో టీ20కి టీమ్‌లో పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదు. విన్నింగ్ కాంబినేషన్‌నే రోహిత్-ద్రవిడ్ ద్వయం కొనసాగించనుంది. అయితే ఫస్ట్ మ్యాచ్‌లో తీవ్రంగా గాయపడిన మహమ్మద్ సిరాజ్‌కు తదుపరి రెండు మ్యాచ్‌లకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. ఇన్నింగ్స్ చివరి ఓవర్ బౌలింగ్ చేస్తూ సిరాజ్ గాయపడిన విషయం తెలిసిందే. అతను వేసిన తొలి బంతికి మిచెల్ సాంట్నర్ కొట్టిన షాట్‌ను ఆపే క్రమంలో సిరాజ్ ఎడమ చేతి వేళ్లకు బలంగా తాకింది. రక్త స్రావం కూడా అయింది. ఫిజియో వచ్చి కట్టు కట్టాడు. అయితే ప్రధాన బౌలర్ల కోటా పూర్తవడంతో సిరాజ్ అంత పెద్ద గాయాన్ని భరిస్తూనే బౌలింగ్ కొనసాగించాడు. ఓ వికెట్ కూడా తీసి ఔరా అనిపించాడు. గాయం నేపథ్యంలో టెస్ట్ సిరీస్ కోసం సిరాజ్‌కు విశ్రాంతి ఇవ్వనున్నారు. అదే జరిగితే ఆవేశ్ ఖాన్ జట్టులోకి రావడం ఖాయం.

 అదే టాపార్డర్..

అదే టాపార్డర్..

ఇక ఫస్ట్ మ్యాచ్ మాదిరే కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. రాహుల్ విఫలమైనప్పటికీ రోహిత్ చెలరేగాడు. సెకండ్ మ్యాచ్‌లోనైనా రాహుల్ రాణించాలి. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేస్తాడు. తొలి మ్యాచ్‌లో కోహ్లీ లేని లోటును పూడ్చుతూ సూర్య చెలరేగాడు. తనదైన షాట్లతో న్యూజిలాండ్ బౌలర్లను చితక్కొట్టాడు. హాఫ్ సెంచరీతో జట్టులో కీలక పాత్ర పోషించాడు. నాలుగో స్థానంలో రిషభ్ పంత్ బ్యాటింగ్ చేయనుండగా.. ఐదు, ఆరో స్థానల్లో శ్రేయస్, వెంకటేశ్ బరిలోకి దిగనున్నారు. ఈ ఇద్దరు కూడా తమ సత్తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.

 ఆల్‌రౌండర్లుగా..

ఆల్‌రౌండర్లుగా..

వెంకటేశ్ అయ్యర్‌తో పాటు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ ఆల్‌రౌండర్లు బరిలోకి దిగనున్నారు. వెంకటేశ్ అయ్యర్ బౌలింగ్ చేయకపోయిప్పటికీ బ్యాటింగ్‌లో బౌండరీ కొట్టాడు. ఆ వెంటనే ఔటయ్యాడు. అయితే అతను కొట్టిన బౌండరీ టీమ్ ప్రెజర్‌ను తగ్గించింది. అక్షర్ పటేల్, అశ్విన్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. బౌలింగ్‌లో అక్షర్ విఫలమైనప్పటికీ.. అశ్విన్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. రెండు కీలక వికెట్లు తీసాడు. అక్షర్ విఫలమైనా అతనికి మరో అవకాశం దక్కనుంది. బ్యాటింగ్ సామర్థ్యం అతనికి ఉన్న ప్రధాన బలం.

తొలి మ్యాచ్‌లో ఆశ్చర్యకరంగా భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్‌లు బరిలోకి దిగారు. ఈ ఇద్దరూ ఒకే తరహా బౌలింగ్ శైలి అయినప్పటికీ టీమ్‌మేనేజ్‌మెంట్ ఇద్దర్ని ఆడించింది. రెండు వికెట్లతో పాత భువనేశ్వర్‌ను తలపించగా.. దీపక్ చాహర్ ఓ వికెట్‌‌తో పర్వాలేదనిపించాడు. సిరాజ్ గాయం నేపథ్యంలో ఆవేశ్ ఖాన్‌కు చోటు దక్కనుంది.

 భారత్ తుది జట్టు(అంచనా)

భారత్ తుది జట్టు(అంచనా)

రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, ఆవేశ్ ఖాన్

Story first published: Thursday, November 18, 2021, 15:13 [IST]
Other articles published on Nov 18, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X