న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మొహమ్మద్ అమీర్ బౌలింగ్‌ను రోహిత్ ఎదుర్కోగలడా?

India and Pakistan are rivals at politics and cricket

న్యూ ఢిల్లీ: ఇన్నాళ్లుగా క్రికెట్‌ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తోన్న భారత్, పాక్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. మరి కొద్ది గంటల్లో దుబాయ్ వేదికగా పోరు మొదలుకానుంది. ఇప్పటికే మ్యాచ్‌కు సంబంధించి టిక్కెట్ల అమ్మకంలో జోరు పెరిగింది. మ్యాచ్‌కు సంబంధించి ఇంగ్లాండ్‌ పర్యటనలో చెలరేగిన కోహ్లి గైర్హాజరు, భారత్‌ వరుసగా రెండు మ్యాచ్‌లు ఆడుతుండటం, ఇక్కడి ఎడారి వాతావరణంలో తీవ్రమైన వేడి వంటి అంశాలపై చర్చ కొనసాగుతోంది.

ఉత్కంఠపోరులో టీమిండియా విక్టరీఉత్కంఠపోరులో టీమిండియా విక్టరీ

ఆరంభం అదిరిపోతేనే.. రాణించగలం:

ఆరంభం అదిరిపోతేనే.. రాణించగలం:

డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాకు తగినట్లుగా భారత్‌ ఆరంభం అదిరిపోవాలి. కానీ ఇంగ్లండ్‌లో విఫలమైన మన ఆటగాళ్లు ఎంత తొందరగా కోలుకొని గాడిలో పడతారనేది కీలకం. చాలా రోజులుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న ధోని, రోహిత్, భువనేశ్వర్‌లాంటి వాళ్లు నేరుగా మ్యాచ్‌ బరిలోకి దిగి రాణించడం అంత సులువు కాదు. ఇక్కడి వేడి అన్నింటికంటే పెద్ద సమస్య.

ఛాంపిన్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ను చిత్తుగా:

ఛాంపిన్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ను చిత్తుగా:

ఇంగ్లండ్‌ గడ్డపై సుదీర్ఘ స్పెల్‌లు బౌలింగ్‌ చేసిన మన పేసర్లు కూడా ఇక్కడ అదే తరహాలో బౌలింగ్‌ చేయాలంటే చాలా కష్టం. రెండేసి, మూడేసి పరుగులు తీయడం కూడా బ్యాట్స్‌మన్‌ శక్తిని పూర్తిగా హరించివేసే అవకాశం ఉంది కాబట్టి ఈ టోర్నీలో డబుల్‌ సెంచరీ సాధించడం మాత్రం అసాధ్యమని తేలిపోయింది. గత ఏడాది చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ను ఓడించడం వల్ల మానసికంగా పాకిస్తాన్‌దే పైచేయి. ఆ మ్యాచ్‌లో పాక్‌ ఓపెనర్లు, ఆరంభ బౌలర్లు అద్భుత ప్రదర్శనతో భారత్‌ను చిత్తు చేశారు.

అమీర్ బౌలింగ్‌ను రోహిత్ ఎదుర్కోవాల్సిందే:

అమీర్ బౌలింగ్‌ను రోహిత్ ఎదుర్కోవాల్సిందే:

ఎమిరేట్స్‌ కూడా పాకిస్తాన్‌ను సొంత మైదానంలాంటిది కాబట్టి ఇక్కడి పరిస్థితులపై భారత్‌కంటే వారికే ఎక్కువ అవగాహన ఉంటుంది. ఆ జట్టు ఇటీవలి ఫామ్‌ కూడా చాలా బాగుంది. యువకులు, అనుభవజ్ఞులతో జట్టు సమతూకంగా ఉండటంతో పాటు వారి ఫీల్డింగ్‌ కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా గొప్పగా కనిపిస్తోంది. టెస్టు జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత తన సత్తా ఏమిటో ఇక్కడి చూపించాలని రోహిత్‌ పట్టుదలగా ఉన్నాడు. అయితే అటు వైపు మొహమ్మద్‌ ఆమిర్‌ సిద్ధంగా ఉన్నాడు.

పాకిస్తాన్‌ బ్యాట్స్‌మెన్‌కు, భారత స్పిన్నర్లకు

పాకిస్తాన్‌ బ్యాట్స్‌మెన్‌కు, భారత స్పిన్నర్లకు

ఫుట్‌వర్క్‌ మెరుగ్గా ఉండని రోహిత్‌ను చక్కటి స్వింగ్‌తో తొలి రెండు ఓవర్లలోనే వెనక్కి పంపాలని అతను భావిస్తూ ఉండవచ్చు. దీనిని అధిగమించగలిగితే రోహిత్‌ను అడ్డుకోవడం చాలా కష్టం. చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ తర్వాత పాకిస్తానీ ఫఖర్‌ జమాన్‌ అతి వేగంగా దూసుకొచ్చాడు. మరోసారి అతని ఆట కీలకం కానుంది. ప్రతిభ గల పాకిస్తాన్‌ బ్యాట్స్‌మెన్‌కు, భారత స్పిన్నర్లకు మధ్య జరిగే ఆసక్తికర పోరును చూడాల్సిందే. అయితే ఎప్పటిలాగే ఎవరు గెలుస్తారనేది ఈ మ్యాచ్‌లో అంచనా వేయడం కష్టమే.

Story first published: Wednesday, September 19, 2018, 12:03 [IST]
Other articles published on Sep 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X