న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ అవుకోహ్లీ అవుట్‌తో కుప్పకూలిన టీమిండియా, 283కు ఆలౌట్

India all out for 283, Australia get first-innings lead of 43

పెర్త్‌: టీమిండియా-ఆసీస్‌ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 283 పరుగులకు ఆలౌట్‌ అయింది. అంతకుముందు 172/3ఓవర్‌నైట్‌ స్కోర్‌తో బ్యాటింగ్‌ మొదలు పెట్టిన టీమిండియా మూడోరోజు 111 పరుగులు జోడించింది. కోహ్లీ శతకంతో ఆకట్టుకున్నాడు. 257 బంతుల్లో 123పరుగులు (13ఫోర్లు, 1సిక్సు) చేశాడు. మూడోరోజు ఆటలో కోహ్లీతోపాటు పంత్‌(30) రాణించి టీమిండియా స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు. కోహ్లీ ఔట్‌ అయిన తర్వాత టీమిండియా దూకుడుకు బ్రేక్‌ పడింది.

ఆస్ట్రేలియాకి 43 పరుగుల ఆధిక్యం

ఆస్ట్రేలియాకి 43 పరుగుల ఆధిక్యం

పంత్‌ మినహా టెయిలెండర్లు ఆకట్టుకోకపోవడంతో టీమిండియా 105.5 ఓవర్లలో 283 పరుగులకే ఆలౌట్‌ అయింది. దీంతో.. తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులు చేసిన ఆస్ట్రేలియాకి 43 పరుగుల ఆధిక్యం లభించింది. కోహ్లీతో పాటు అజింక్య రహానె (51: 105 బంతుల్లో 6ఫోర్లు, 1సిక్సు) హాఫ్ సెంచరీతో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.

ఆరంభ ఓవర్‌లోనే భారత్‌కి గట్టి ఎదురుదెబ్బ

ఆరంభ ఓవర్‌లోనే భారత్‌కి గట్టి ఎదురుదెబ్బ

ఆదివారం తొలి సెషన్ ఆరంభ ఓవర్‌లోనే భారత్‌కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ బౌలింగ్‌లో బంతిని డిఫెన్స్ చేసేందుకు రహానె ప్రయత్నించగా.. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి నేరుగా కీపర్ టిమ్‌పైన్ చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో.. జట్టు స్కోరు 173 వద్దే భారత్ 4వ వికెట్ చేజార్చుకుంది. ఆ తర్వాత వచ్చిన తెలుగు క్రికెటర్ హనుమ విహారి (20: 46 బంతుల్లో 2ఫోర్లు) కాసేపు క్రీజులో నిలిచినా.. జట్టు జట్టు స్కోరు 233 వద్ద అతనూ ఔటైపోయాడు. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఆఫ్ స్టంప్‌కి వెలుపల పడిన బంతిని వెంటాడి కీపర్ టిమ్‌పైన్ చేతికి అతను చిక్కాడు.

చివరి వికెట్‌గా బుమ్రా ఔటవ్వడంతో

చివరి వికెట్‌గా బుమ్రా ఔటవ్వడంతో

ఈ దశలో కాసేపు దూకుడుగా ఆడిన విరాట్ కోహ్లి 251 వద్ద అంపైర్ వివాదాస్పద నిర్ణయం కారణంగా ఔటవడంతో.. భారత్ జట్టు మళ్లీ ఒత్తిడిలో పడింది. ఒక ఎండ్‌లో రిషబ్ పంత్ (36: 50 బంతుల్లో 2ఫోర్లు, 1సిక్సు) క్రీజులో నిలిచినా.. మహ్మద్ షమీ (0), ఇషాంత్ శర్మ (1), ఉమేశ్ యాదవ్ (4 నాటౌట్), జస్‌ప్రీత్ బుమ్రా (4) తేలిపోయారు. చివరి వికెట్‌గా బుమ్రా ఔటవ్వడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఆసీస్‌ బౌలర్లలో లైయన్‌ నాథన్‌ 5వికెట్లు, హేజిల్‌వుడ్‌, స్టార్క్‌ చెరో రెండు వికెట్లు తీయగా కమిన్స్‌ ఖాతాలో ఒక వికెట్‌ పడింది.

1
43624
Story first published: Sunday, December 16, 2018, 12:48 [IST]
Other articles published on Dec 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X