స్మృతి మంధాన హాఫ్ సెంచరీ, మ్యాచ్‌కు దక్కిన విక్టరీ

Posted By:
India go down fighting to England at Brabourne Stadium, Mumbai

హైదరాబాద్: ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా భారత మహిళల జట్టు నామమాత్రమైన చివరి మ్యాచ్‌ను ఇంగ్లాండ్‌తో ఆడింది. సిరీస్ లో ఇప్పటివరకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లతో ఒక్క మ్యాచ్‌లోనూ గెలవకపోయినా బుధవారం జరిగిన ఆఖరి ఒక్క మ్యాచ్ గెలిచి పరువునిలుపుకుంది. ఈ నేపథ్యంలో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. 18.5 ఓవర్లకు ఇంగ్లాండ్ జట్టు 107పరుగులను చేయగలిగింది.

108పరుగుల విజయలక్ష్యంగా బరిలోకి దిగిన భారత జట్టు కేవలం 15.4 ఓవర్లలోనే ఎనమిది వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ జట్టుపై గెలిచింది. స్మృతి మంధాన 41 బంతుల్లో (67) బాగా రాణించడంతో భారత జట్టు టార్గెట్ ను సునాయాసంగా చేదించగలిగింది. మిథాలీ రాజ్ కేవలం 6పరుగులకే వెనుదిరిగింది. ఇదిలా ఉంచితే భారత జట్టు ఆటగాళ్లు బాగా ఆడారని చెప్పడం కంటే ఇంగ్లాండ్ క్రికెటర్లు నిర్లక్ష్యంతో ఆడారంటూ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

జట్టు మొత్తం కలిపి 11 బౌండరీలు సాధించిన ఇంగ్లాండ్ జట్టు స్కోరులో మొత్తం కలిపి ఏ ఒక్కరి వ్యక్తిగత స్కోరు చెప్పుకోదగ్గ స్థాయిలో చేయలేకపోయారు. కాగా, ఈ మ్యాచ్‌లో భారత జట్టు సీనియర్ బౌలర్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది. రాధా యాదవ్, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్ తలో రెండు వికెట్లు తీయగా పూజా వస్త్రాకర్ ఒక్క వికెట్ తీయగలిగారు.

ఈ సిరీస్‌లో భాగంగా ఆసీస్‌తో రెండు‌, ఇంగ్లాండ్‌ ఓ మ్యాచ్‌ ఆడిన భారత్‌ ఒక్క దానిలో కూడా విజయం సాధించలేదు. దీంతో ఫైనల్‌ పోరు రేసులో నిలవలేకపోయింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన ఆసీస్‌, రెండు విజయాలతో ఇంగ్లాండ్‌ ఇప్పటికే ఫైనల్‌ బెర్తులు ఖాయం చేసుకున్నాయి. సిరీస్ పై ఆశలు లేకపోయినా ఈ మ్యాచ్ గెలవాలనే పట్టుదలతో భారత బ్యాట్స్ ఉమెన్స్ ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నారు.

మూడో ఓవర్ మొదటి బంతికి మిథాలీ రాజ్(5)తో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. క్రీజులో స్మృతి మంధాన(15), జెమీమా రోడ్రిగేజ్ (0)తో ఉన్నారు.

Teams:
England Women (From):
Danielle Wyatt, Amy Ellen Jones(w), Tammy Beaumont, Natalie Sciver, Heather Knight(c), Fran Wilson, Alice Davidson Richards, Jenny Gunn, Danielle Hazell, Sophie Ecclestone, Tash Farrant, Katie George, Alex Hartley, Anya Shrubsole, Bryony Smith, Kate Cross

India Women (From):
Jemimah Rodrigues, Smriti Mandhana, Mithali Raj, Deepti Sharma, Harmanpreet Kaur(c), Anuja Patil, Pooja Vastrakar, Radha Yadav, Taniya Bhatia(w), Jhulan Goswami, Poonam Yadav, Shikha Pandey, Rumeli Dhar, Mona Meshram, Veda Krishnamurthy

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Thursday, March 29, 2018, 12:00 [IST]
Other articles published on Mar 29, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి