న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇప్పటికే టీ20 వరల్డ్‌కప్ టీమ్‌ను గుర్తించాం: బ్యాటింగ్ కోచ్

India batting coach Vikram Rathour Says We have identified the core of players for T20 World Cup

హామిల్టన్: అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 వరల్డ్‌కప్‌కు ఇప్పటికే కోర్ ప్లేయర్లతో కూడిన టీమ్‌ను గుర్తించామని టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ తెలిపాడు. ఇక ఈ జనరేషన్ క్రికెటర్స్ ఇంక్రిడిబుల్ ప్లేయర్సని కొనియాడాడు. న్యూజిలాండ్‌తో హమిల్టన్ వేదికగా బుధవారం జరగనున్న మూడో టీ20 నేపథ్యంలో రాథోడ్ మీడియాతో మాట్లాడాడు.

<strong>కుక్కలపై పందెం కాసేవాడ్ని.. అందుకే ఆ నిక్‌నేమ్ : రికీ పాంటింగ్</strong>కుక్కలపై పందెం కాసేవాడ్ని.. అందుకే ఆ నిక్‌నేమ్ : రికీ పాంటింగ్

జట్టును గుర్తించాం..

జట్టును గుర్తించాం..

‘సర్దుబాట్లు అనేవి చివరి నిమిషం వరకు కొనసాగుతూనే ఉంటాయి. కానీ ఇప్పటికైతే జట్టుకు కావాల్సిన కోర్ ఆటగాళ్లున్నారు. వారి పేర్లను నాతో పాటు మేనేజ్‌మెంట్‌ కూడా గుర్తించింది. జట్టు ఎలా ఉండాలనే విషయంపై స్పష్టత వచ్చింది. ఒకవేళ ఎవరైనా గాయపడినా, అప్పటికి తాము అనుకున్న ఏ క్రికెటరైనా పేలవమైన ఫామ్‌తో ఉన్నా మార్పులు ఉంటాయి. కానీ పెద్దగా మార్పులు ఉంటాయని నేను అనుకోవడం లేదు 'అని రాథోడ్ తెలిపాడు.

ప్రిపరేషన్స్ మొదలయ్యాయి..

ప్రిపరేషన్స్ మొదలయ్యాయి..

టీ20 వరల్డ్ కప్ దృష్ట్యా ఇప్పటికే తమ సన్నాహకాలు మొదలయ్యాయని, గతేడాది సెప్టెంబర్ నుంచే ప్రయోగాలు మొదలుపెట్టామన్నాడు. అందులో భాగాంగానే యువ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, శివం దూబేలకు అవకాశం కల్పిస్తున్నామన్నాడు. ఇక న్యూజిలాండ్‌లో భారత జట్టు అదరగొడుతుందని, ముఖ్యంగా యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో విజయాల్లో కీలకపాత్ర పోషిస్తూ ఆకట్టుకుంటున్నారని రాథోడ్ చెప్పుకొచ్చాడు.

‘ఈ తరం క్రికెటర్స్ ఔరా అనిపించే రితీలో రాణిస్తున్నారు. ఫార్మాట్‌‌ మారినా, దేశం ఏదైనా.. మైదానం మరేదైనా.. అద్భుతంగా ఆడుతున్నారు. ఇంత తక్కువ సమయంలో న్యూజిలాండ్ పరిస్థితులను అందిపుచ్చుకొని రాణించడం అద్భుతం.'అని ఈ బ్యాటింగ్ కోచ్ కొనియాడాడు.

సంతృప్తిగా ఉంది..

సంతృప్తిగా ఉంది..

ఆక్లాండ్ వేదికగా జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఇండియా గెలవడంపై రాథోడ్ సంతోషం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా ఈ విజయాల్లో కీలక పాత్ర పోషించిన కేఎల్ రాహుల్, అయ్యర్‌కు ధన్యవాదాలు తెలిపాడు. యువ ఆటగాళ్ల ప్రదర్శన బ్యాటింగ్ కోచ్‌గా తనకు సంతృప్తినిచ్చిందన్నాడు.

‘వారు పొందే ఎక్కువ అవకాశాలు వారి సమర్థతను తెలియజేస్తున్నాయి. వారికి అనుకూలమైన రోజున మ్యాచ్ విన్నర్స్‌గా నిలుస్తున్నారు. ఇది జట్టుకు మేలు చేస్తోంది. అలాగే వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌‌లను చూడగానే నాకు వారే మ్యాచ్ విన్నర్లనిపిస్తోంది. అవకాశాలను అందుకున్న వారు తమ సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేస్తున్నారు. వారి అద్భుత ప్రదర్శనను చూడటం గొప్పగా ఉంది.'అని రాథోడ్ తెలిపాడు.

అయ్యర్ ప్లస్ పాయింట్ అదే..

అయ్యర్ ప్లస్ పాయింట్ అదే..

ఇక శ్రేయస్ అయ్యర్ ఆలోచన విధానమే అతన్ని గొప్ప ఆటగాడిని చేస్తుందన్నాడు. ‘ అతని బ్యాటింగ్ స్కిల్స్ పక్కనపెడితే.. అయ్యర్ ఆలోచనా విధానం బాగుంది. అతనో పెద్ద ఆటగాడినని నమ్ముతాడు. అందులో అతనికి ఎలాంటి సందేహం లేదు. తానే మ్యాచ్ విన్నర్ అన్నట్లు, ఇక్కడివాడినన్నట్లు చెలరేగుతాడు. ఆ మైండ్‌సెట్టే అతనికి మేలు చేస్తుందనుకుంటున్నా. అదే అతనికి పెద్ద అడ్వాంటేజ్. 'అని రాథోడ్ చెప్పుకొచ్చాడు.

అది ఎప్పటికీ పనిచేయదు..

అది ఎప్పటికీ పనిచేయదు..

ప్రస్తుత తరం ఐపిఎల్ నుంచి నేర్చుకోగల విషయాల గురించి అడిగినప్పుడు,.. అందరూ ఐపీఎల్ తరహా భారీ షాట్లు కొట్టాలనుకుంటున్నారుని కానీ అన్ని సమయాల్లో పనిచేయదని ఈ బ్యాటింగ్ కోచ్ తెలిపాడు. సరైన షాట్స్ ఆడినప్పుడే దానికి విలువ ఉంటుదన్నాడు. ఫార్మాట్‌కు తగ్గట్లు ఆటగాళ్లు సిద్ధం కావాలన్న ప్రశ్నకు..‘ఈ రోజుల్లో ఆటగాళ్లు చాలా క్రికెట్ ఆడుతున్నారు. మూడు ఫార్మాట్లలో స్థిరంగా రాణిస్తున్నారు.

పరిస్థితులకు తగ్గట్లు వారే సొంతంగా అడ్జస్ట్ అవుతున్నారు. క్రికెట్ కాలంతో మారిపోయింది. టెస్ట్ క్రికెట్‌లో కూడా పెద్ద షాట్లు సాధారణమయ్యాయి. ఫార్మాట్.. ఫార్మాట్‌కు పెద్ద తేడా ఏం లేదు. ఈ విషయంలో కోచ్‌గా వారికి చెప్పాల్సిన అవసరం లేదు. వారే సొంతంగా గేమ్ ప్లాన్ చేసుకుంటారు. మా జనరేషన్ కన్నా ప్రస్తుత తరం చాలా స్ట్రాంగ్, ఫిట్. ఎలాంటి కష్టం లేకుండా అలవోకగా సిక్స్‌లు కొడుతున్నారు. అలా గేమ్ మారింది.'అని రాథోడ్ తెలిపాడు.

 స్ట్రాటజీలో పెద్దగా మార్పు ఉండదు..

స్ట్రాటజీలో పెద్దగా మార్పు ఉండదు..

సిరీస్‌లో మిగిలిన మూడు టీ20లను సాధారణంగా ఉండే మైదానంలో ఆడుతున్నామని, తమ స్ట్రాటజీలో పెద్దగా మార్పు ఉండదన్నాడు. కాకపోతే పరిస్థితులకు తగ్గట్లు బౌలింగ్ వ్యూహాలు మారుతాయని చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, January 28, 2020, 14:40 [IST]
Other articles published on Jan 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X