న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇషాన్‌ కిషన్‌ మెరుపు ఇన్నింగ్స్‌.. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం

India A vs South Africa A: Ishan Kishan quick fifty, Krunal Pandya helps India A take 2-0 lead over South Africa A

తిరువనంతపురం: శనివారం జరిగిన రెండో అనధికారిక వన్డేలో భారత-ఎ జట్టు యువ వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ (24 బంతుల్లో 55; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో దక్షిణాఫ్రికా-ఎ జట్టుపై భారత్ విజయం సాధించింది. దీంతో ఆతిథ్య భారత్‌-ఎ వరుసగా రెండో విజయం నమోదు చేసి ఐదు వన్డేల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అక్షర్‌ పటేల్‌ (36 బంతుల్లో 60 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌కి తోడు కీలక సమయంలో లెగ్‌స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ (5/47) మాయ చేయడంతో తొలి వన్డేలో భారత్‌-ఎ 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

13 ఏళ్ల తర్వాత బుమ్రా హ్యాట్రిక్.. మూడో భారత బౌలర్‌గా రికార్డు!!13 ఏళ్ల తర్వాత బుమ్రా హ్యాట్రిక్.. మూడో భారత బౌలర్‌గా రికార్డు!!

వర్షం కారణంగా రెండో వన్డేను 21 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత కెప్టెన్‌ మనీశ్‌ పాండే ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా-ఎ జట్టు 21 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసింది. 15 ఓవర్లకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయిన ప్రొటీస్ జట్టును కెప్టెన్‌ బవుమా (33 బంతుల్లో 40; 6 ఫోర్లు), క్లాసెన్‌ (27 బంతుల్లో 31; 3 సిక్స్‌లు) ధాటిగా ఆడుతూ ఆదుకున్నారు. అంనతరం జార్జి లిండే (25 బంతుల్లో 52 నాటౌట్‌; ఫోర్, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేసాడు. భారత బౌలర్లలో దీపక్‌ చహర్, ఖలీల్‌ అహ్మద్, యజువేంద్ర చహల్, అక్షర్‌ పటేల్‌లు తలో వికెట్‌ తీశారు.

అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి అధిగమించింది. క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాట్స్‌మెన్‌ దూకుడుగా ఆడటంతో.. మరో ఓవర్‌ మిగిలి ఉండగానే భారత్‌ విజయాన్ని అందుకుంది. 57 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన ఇషాన్‌ కిషన్‌ జట్టును ఆదుకున్నాడు. అతనికి జతగా అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌ (19 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. ఆఖర్లో 4 పరుగుల తేడాతో 3 వికెట్లు కోల్పోయిన దశలో కృనాల్‌ పాండ్యా (15 బంతుల్లో 23 నాటౌట్‌; ఫోర్, సిక్స్‌) బ్యాట్‌ ఝళిపించాడు. ఇషాన్‌ కిషన్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది. మూడో వన్డే సోమవారం జరుగుతుంది.

Story first published: Sunday, September 1, 2019, 13:58 [IST]
Other articles published on Sep 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X