న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'షా'కు సాధ్యం కాకపోవచ్చు.. పంత్ ఐతే ఓకే: గంగూలీ

India vs West Indies 2018 : 'Rare Talent' Will Be A Massive Game Changer In All Formats : Ganguly
IND vs WI: Sourav Ganguly predicts a massive game changer across formats for India and its not Prithvi Shaw

న్యూఢిల్లీ: టీమిండియాలో మార్పులు చేయాలని భావించిన సెలక్టర్లు.. ఎట్టకేలకు యువ క్రికెటర్లు రిషబ్ పంత్.. పృథ్వీ షాలకు అవకాశం కల్పించారు. వెస్టిండీస్‌తో జరుగుతోన్న టెస్టు మ్యాచ్‌తో కెరీర్ ఆరంభించిన పృథ్వీ షా.. అరంగ్రేట మ్యాచ్ నుంచే ప్రత్యేక గుర్తింపుతో సత్తా చాటుకుంటున్నాడు. అతనితో పాటుగానే పంత్ సైతం అదే స్థాయిలో ఆడుతూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు.

మరీ.. ఇంత గందరగోళానికి గురి చేస్తాడనుకోలేదు: కోహ్లీమరీ.. ఇంత గందరగోళానికి గురి చేస్తాడనుకోలేదు: కోహ్లీ

సెంచరీతో పాటు టాప్ స్కోరర్‌గా

సెంచరీతో పాటు టాప్ స్కోరర్‌గా

భారత జట్టులో నెలన్నర రోజులుగా యువ క్రికెటర్లు రిషబ్ పంత్, పృథ్వీ షా మెరుపు ఇన్నింగ్స్‌లతో అందరి చూపు తమవైపు తిప్పుకున్నారు. ఇంగ్లాండ్‌పై అరంగేట్రం సిరీస్‌లోనే సెంచరీ బాది 21ఏళ్ల వికెట్ కీపర్ రిషబ్ పంత్ వెలుగులోకిరాగా.. ఆదివారం వెస్టిండీస్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో సెంచరీతో పాటు టాప్ స్కోరర్‌గా నిలిచి 18 ఏళ్ల షా తన అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్నాడు.

మ్యాచ్‌ని మలుపు తిప్పే సామర్థ్యం

మ్యాచ్‌ని మలుపు తిప్పే సామర్థ్యం

ఈ ఇద్దరిలో మ్యాచ్‌ని మలుపు తిప్పే సామర్థ్యం ఎవరికి ఉంది..? అని ప్రశ్నించగా.. గంగూలీ వికెట్ కీపర్ పంత్‌కే ఓటు వేశాడు. ‘రిషబ్ పంత్ క్రీజులో చాలా ఉత్సాహంగా కనిపిస్తాడు. అతని ఆట కూడా సహజసిద్ధంగా ఉంటుంది. అన్ని ఫార్మాట్లలోనూ మ్యాచ్‌ని మలుపు తిప్పగలిగే సామర్థ్యం అతనికి ఉంది' అని గంగూలీ ప్రశంసించాడు.

సెంచరీలను చేజార్చుకున్నా.. బౌండరీలు బాది

సెంచరీలను చేజార్చుకున్నా.. బౌండరీలు బాది

వెస్టిండీస్‌తో రాజ్‌కోట్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 84 బంతుల్లో 8ఫోర్లు, 4సిక్సులు 92 పరుగులు చేసిన రిషబ్ పంత్.. ఉప్పల్‌లో ముగిసిన రెండో టెస్టులోనూ 134 బంతుల్లో 11ఫోర్లు, 2సిక్సుల సాయంతో సరిగ్గా 92 పరుగుల వద్దే ఔటయ్యాడు. ఈ రెండు సందర్భాల్లోనూ అతను సెంచరీలను చేజార్చుకున్నా.. బౌండరీలు బాదిన తీరు అతని దూకుడుని ప్రస్ఫుటం చేస్తోంది.

పృథ్వీను సెహ్వాగ్ లాంటి దిగ్గజాలతో

పృథ్వీను సెహ్వాగ్ లాంటి దిగ్గజాలతో

ఇప్పటికే టెస్టుల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న రిషబ్ పంత్.. వెస్టిండీస్‌తో వన్డేలకి కూడా ఎంపికైన విషయం తెలిసిందే. పృథ్వీ షా ప్రదర్శన పట్ల అరంగ్రేట మ్యాచ్ నుంచి గంగూలీ పెద్దగా హర్షం వ్యక్తం చేయట్లేదు. సెంచరీ చేసి కెరీర్ మొదలుపెట్టిన 'షా'కు శుభాకాంక్షలు తెలిపిన గంగూలీ.. పృథ్వీను సెహ్వాగ్ లాంటి దిగ్గజాలతో పోల్చడం సరికాదని అభిప్రాయపడ్డాడు.

Story first published: Monday, October 15, 2018, 15:32 [IST]
Other articles published on Oct 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X