న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SL:చేతులెత్తేసిన బ్యాట్స్‌మన్.. 36 పరుగులకే 5 వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో భారత్!

IND vs SL: Wanindu Hasaranga jolts India with 2 wickets in his 1st over

కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న ఆఖరి టీ20లో టీమిండియా టాపార్డర్ కుప్పకూలింది. పవర్ ప్లేలోనే కీలక నాలుగు వికెట్లు కోల్పోయింది. ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌తో బరిలోకి దిగిన భారత్.. 25 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కెప్టెన్ శిఖర్ ధావన్(0), సంజూ శాంసన్(0) డకౌట్ కాగా.. దేవదత్ పడిక్కల్(9), రుతురాజ్ గైక్వాడ్(14) తీవ్రంగా నిరాశపరిచారు. ఆ తర్వాత వచ్చిన నితీశ్ రాణా(6) సైతం తీవ్రంగా నిరాశ పరిచాడు. వానిందు హసరంగా రెండు వికెట్లతో భారత పతనాన్ని శాసించగా.. దుష్మంత్ చమీరా, రమేశ్ మెండీస్, డసన్ షనక చెరొక వికెట్ తీశారు.

ప్రస్తుతం క్రీజులో కుల్దీప్ యాదవ్ (0 బ్యాటింగ్), భువనేశ్వర్ కుమార్ (7 బ్యాటింగ్) ఉన్నారు. బ్యాట్స్‌మన్ చేతులెత్తేసిన వేళ భారత్ బౌలర్లే బ్యాటింగ్ చేస్తున్నారు. విజయం దేవుడెరుగు పరువు నిలుపుకోవాల్సిన పరిస్థితిని టీమిండియా కొని తెచ్చుకుంది. కరోనాతో టీమిండియా ప్రధాన ఆటగాళ్లంతా దూరమవడంతో భారత్ బ్యాటింగ్ పరంగా పూర్తిగా బలహీనమైంది. తొలి ఓవర్‌లోనే కెప్టెన్ శిఖర్ ధావన్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరగ్గా.. గైక్వాడ్ రెండు ఫోర్లు, పడిక్కల్ ఒక ఫోర్‌తో జోరు కనబర్చారు. కానీ మెండీస్ బౌలింగ్‌లో పడిక్కల్ ఎల్బీగా వెనుదిరగ్గా.. ఆ తర్వాత సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ ఒకే ఓవర్‌లో ఎల్బీగా వెనుదిరిగారు. ఆ తర్వాత నితీశ్ రాణా.. డసన్ షనక సూపర్ క్యాచ్‌తో రాణా ఔటయ్యాడు.

అంతకుముందు టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. గత మ్యా‌చ్‌లో గాయపడ్డ సైనీ ప్లేస్‌లో సందీప్ వారియర్ అరంగేట్రం చేశాడు. ఇక శ్రీలంక జట్టులో ఓ మార్పు చోటు చేసుకుంది. ఇసురు ఉడానా ప్లేస్‌లో నిస్సంక జట్టులోకి వచ్చాడు. టాస్ గెలిచిన ధావన్ బ్యాటింగ్ తీసుకోవడం పూర్తిగా మిస్ ఫైర్ అయింది.

Story first published: Thursday, July 29, 2021, 20:51 [IST]
Other articles published on Jul 29, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X