న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: నిలకడగా ఆడితేనే టీమిండియాకు రోహిత్ మరో సెహ్వాగ్‌ అవుతాడు

IND vs SA 2019,1st Test: Rohit Sharma Needs To Keep Up Aggression Like Sehwag, Says Sachin Tendulkar
IND vs SA: Sachin Tendulkar said Rohit Sharma Needs To Keep Up Aggression Like Virender Sehwag


ముంబై: టీమిండియాకు రోహిత్ శర్మ మరో వీరేందర్ సెహ్వాగ్‌ అవ్వాలంటే దూకుడుతో పాటు ఆటలో నిలకడ చూపించాలని భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ సూచించారు. విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ పరుగుల వరద పారించాడు. రోహిత్ భారీ సెంచరీతో (176, 244 బంతుల్లో; 23 ఫోర్లు, 6 సిక్సర్లు) మంచి ఆరంభం ఇచ్చాడు. అయితే మహారాజ్‌ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయిన రోహిత్‌ స్టంప్‌ ఔట్‌ అయ్యాడు. ఈ టెస్టులో తొలిసారి ఓపెనర్‌గా ఆడినా.. రోహిత్ దూకుడుగా ఆడాడు.

Test, ODI, T20I: తొలి భారత క్రికెటర్‌గా రోహిత్ శర్మ అరుదైన రికార్డు Test, ODI, T20I: తొలి భారత క్రికెటర్‌గా రోహిత్ శర్మ అరుదైన రికార్డు

తాజాగా సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ... 'ఏదైనా ఆలోచన ధోరణి బట్టి ఉంటుంది. టెస్టుల్లో ఓపెనింగ్‌ చేయాలంటే భిన్నమైన ఆలోచన ధోరణి ఉండాలి. సెహ్వాగ్‌ ఆలోచన విధానం విభిన్నంగా ఉంటుంది. వన్డే, టెస్టు వీరు ఒకేలా ఆడతాడు. దూకుడే అతడి నైజం. ఇన్నింగ్స్ తొలి బంతి నుంచే బౌండరీలు కొట్టాలనుకుంటాడు. ఆలోచన ధోరణి ఆటగాడి సామర్థ్యం, బలాలపై ఆధారపడి ఉంటుంది. సెహ్వాగ్‌లా దూకుడుగా ఆడే ఆటగాళ్లు ఎంతో మంది ఉంటారు. కానీ.. అతడిలా నిలకడగా రాణించాలి. వీరు సరైన ఓపెనర్' అని అన్నాడు.

'ఇంగ్లాండ్‌లో ఓపెనర్‌గా ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెహ్వాగ్‌ సెంచరీ చేసాడు. అది అతని కెరీర్‌కు ఎంతో ఉపయోగపడింది. సెహ్వాగ్‌ కొన్ని కఠిన పరిస్థితులను కూడా ఎదుర్కొన్నాడు. నిలకడ అనేది ఆటలో చాలా ముఖ్యం. టెస్టుల్లో రోహిత్‌ ఓపెనర్‌గా ఎలా రాణిస్తాడో వేచిచూడాలి. టీమిండియాకు రోహిత్ మరో సెహ్వాగ్‌ అవ్వాలంటే దూకుడుతో పాటు ఆటలో నిలకడ చూపించాలి' అని సచిన్ పేర్కొన్నాడు.

'సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ టాప్ బౌలర్‌. కేవలం బంతితోనే కాదు కీలకమైన పరుగులు చేసి జట్టును ఎన్నోసార్లు ఆదుకున్నాడు. భారత జట్టులో అతడు కీలక సభ్యుడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ప్రతి ఆటగాడి కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజం. అశ్విన్‌ సుదీర్ఘకాలంగా జట్టుతో ఉన్నాడు. తన ఏంటో ఇప్పటికే నిరూపించుకున్నాడు. నా వరకైతే అతడు భారత జట్టులో అంతర్భాగం' అని తెలిపాడు.

Story first published: Thursday, October 3, 2019, 13:52 [IST]
Other articles published on Oct 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X