న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత.. వాండరర్స్ మైదానంలో కుంబ్లే తర్వాత..

IND vs SA: Ravichandran Ashwin Achieves Unique Feats After Picking a Wicket in Johannesburg

జోహన్నెస్‌బర్గ్ : సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్ అరుదైన ఘనతను అందుకున్నాడు. పూర్తిగా పేసర్లకు అనుకూలించే వాండరర్స్ మైదానంలో దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే తర్వాత వికెట్ తీసిన రెండో భారత స్పిన్నర్‌గా గుర్తింపు పొందాడు. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో కీగన్‌ పీటర్సన్‌ను ఔట్‌ చేయడం ద్వారా అశ్విన్ ఈ ఫీట్ సాధించాడు.

రెండో భారత స్పిన్నర్‌గా..

రెండో భారత స్పిన్నర్‌గా..

2006-07 సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా.. వాండరర్స్‌లో జరిగిన తొలి టెస్టులో అనిల్ కుంబ్లే (2/2, 3/54) ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. దాంతో టీమిండియా ఆ టెస్టులో 123 పరుగుల భారీ తేడాతో సఫారీలపై విజయం సాధించింది. అప్పటి నుంచి టీమిండియా రెండు సార్లు (2013-14, 2017-18) సౌతాఫ్రికాలో పర్యటించింది. అయినా ఒక్క స్పిన్నర్ కూడా వికెట్ తీయలేకపోయాడు. తాజా పర్యటనలో భాగంగా వాండరర్స్‌ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌.. కీగన్‌ పీటర్సన్‌ను ఔట్‌ చేశాడు. దీంతో అనిల్ కుంబ్లే తర్వాత వాండరర్స్‌లో వికెట్ తీసిన భారత స్పిన్నర్‌గా అశ్విన్‌ అరుదైన ఫీట్‌ సాధించాడు.

విజయానికి చేరువగా సౌతాఫ్రికా..

విజయానికి చేరువగా సౌతాఫ్రికా..

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా నాలుగో రోజు ఆటలో రెండు సెషన్లు రద్దయ్యాయి. ఎట్టకేలకు మ్యాచ్ ప్రారంభం కాగా.. సౌతాఫ్రికా నిలకడైన బ్యాటింగ్‌‌తో విజయం దిశగా దూసుకెళ్తుంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ డీన్ ఎల్గర్ హాఫ్ సెంచరీతో ఇన్నింగ్స్‌ను నడిపిస్తుండగా.. మరో బ్యాట్స్‌మన్ డస్సెన్(40) అతనికి సహకరించాడు. అయితే డస్సెన్‌ను ఔట్ చేసి మహమ్మద్ షమీ.. భారత శిభిరంలో ఆశలు రేకెత్తించాడు. 57 ఓవర్లు పూర్తి చేసే సరికి సౌతాఫ్రికా 3 వికెట్లకు 181 రన్స్ చేసింది. క్రీజులో కెప్టెన్ డీన్ ఎల్గర్(64 బ్యాటింగ్‌)తో పాటు టెంబా బవుమా(1 బ్యాటింగ్) ఉన్నారు. సౌతాఫ్రికా విజయానికి ఇంకా 59 పరుగులే చేయాల్సి ఉండగా.. భారత్ మరో 7 వికెట్లు తీయాలి. అద్భుతం జరిగితే భారత్ ఈ మ్యాచ్ గెలుస్తుంది.

240 టార్గెట్..

240 టార్గెట్..

ఈ మ్యాచ్‌లో భారత్‌ జట్టు సౌతాఫ్రికాకు 240 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌటైంది. అజింక్యా రహానే (78 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 58), చతేశ్వర్ పుజారా (86 బంతుల్లో10 ఫోర్లతో 53) అర్ధ సెంచరీలు చేయగా, హనుమ విహారి (84 బంతుల్లో 6 ఫోర్లతో 40 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే భారత్ మరో 30 పరుగుల అదనంగా చేయాల్సిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సంక్షిప్త స్కోర్లు:

సంక్షిప్త స్కోర్లు:

భారత్ తొలి ఇన్నింగ్స్: 202 ఆలౌట్ (కేఎల్ రాహుల్ 50, రవిచంద్రన్ అశ్విన్ 46, మార్కో జాన్సెన్ 4/31)

సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 229 ఆలౌట్( కీగన్ పీటర్సన్ 62, శార్దూల్ ఠాకూర్ 7/61)

భారత్ రెండో ఇన్నింగ్స్: 266 ఆలౌట్( రహానే 58, పుజారా 53, లుంగి ఎంగిడి 3/43)

Story first published: Thursday, January 6, 2022, 20:46 [IST]
Other articles published on Jan 6, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X