న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫ్లాష్ బ్యాక్ ఫొటో.. నేనొక సాదాసీదా ప్రయాణికుడుని: రవిశాస్త్రి

IND vs SA: Iam Light Traveller says Ravi Shastri in Throwback Post

హైదరాబాద్: మిగతా జట్టు సభ్యులతో పోల్చితే నేనొక లైట్‌ ట్రావెలర్‌ (సాదాసీదా ప్రయాణికుడు)ని అని టీమిండియా హెడ్ కోచ్‌ రవిశాస్త్రి అంటున్నారు. రవిశాస్త్రి బుధవారం అలనాటి మధురస్మృతిని గుర్తు చేసుకుంటూ.. ఓ ఫ్లాష్ బ్యాక్ ఫొటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫొటోలో సునిల్‌ గావస్కర్‌, వెంగ్‌సర్కార్‌ తదితరులు ఉన్నారు. ఆ ఫొటో బ్లాక్ అండ్ వైట్‌లో ఉంది. రవిశాస్త్రి సహచరులలోని కొంతమంది వారితో చాలా సామాను తీసుకెళ్లగా.. శాస్త్రి మాత్రం ఎలాంటి సామానును తీసుకెళ్లలేదు.

దక్షిణాఫ్రికాతో వార్మప్ టెస్ట్ మ్యాచ్.. ఓపెనర్‌గా రోహిత్ శర్మదక్షిణాఫ్రికాతో వార్మప్ టెస్ట్ మ్యాచ్.. ఓపెనర్‌గా రోహిత్ శర్మ

రవిశాస్త్రి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో పోస్ట్ చేసి.. 'జట్టులోని చాలా మందితో పోలిస్తే నేను లైట్‌ ట్రావెలర్‌ని' అని క్యాప్షన్ ఇచ్చారు. అందరితో పోల్చితే అతి తక్కువ సామగ్రి తీసుకెళ్లేది తనే అని రవిశాస్త్రి చెప్పకనే చెప్పారు. శాస్త్రి నిత్యం షార్ట్స్‌, టీషర్ట్స్‌లో ఉంటారు. అందుకే అతనికి ఎక్కువగా సామగ్రి ఉండదు. టీమిండియా పర్యటనలను గమనిస్తే ఇదే విషయం అర్ధమవుతుంది. ఇటీవలే వెస్టిండీస్‌లో ఆయన సముద్ర తీరాన వస్త్రధారణ సైతం ఎలాగుందో చూశాం కూడా.

ప్రపంచకప్‌తో పదవీకాలం ముగియడంతో కపిల్‌ దేవ్‌ కమిటీ మరోసారి రవిశాస్త్రిని తిరిగి ప్రధాన కోచ్‌గా ఎంపిక చేసింది. రెండేళ్ల పాటు బీసీసీఐ ఒప్పందం కుదుర్చుకుంది. రవిశాస్త్రి ఒప్పందం 2021 టీ20 ప్రపంచకప్‌తో ముగుస్తుంది. గతంలో రవిశాస్త్రి క్రికెట్ మేనేజర్ (2007 బంగ్లాదేశ్ పర్యటన), టీం డైరెక్టర్ (2014-2016), హెడ్ కోచ్ (2017-2019)గా పని చేసారు. జాతీయ జట్టుతో శాస్త్రికి ఇది నాలుగో ఒప్పందం. శాస్త్రి నేతృత్వంలోనే టీమిండియా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల్లో ఘన విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. రవిశాస్త్రి తిరిగి హెడ్ కోచ్‌గా నియమించబడ్డాక.. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో డ్రా అయింది. ఇక అక్టోబర్ 2న విశాఖపట్నంలో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది.

రవిశాస్త్రి ఆటగాళ్ల కోసం బీసీఐసీతో పోరాడాడు. రవిశాస్త్రి, కోహ్లీ డిమాండ్‌ మేరకు ఆటగాళ్ల, సిబ్బంది జీతాలను సీఓఏ భారీగా పెంచిన విషయం తెలిసిందే. వీరి డిమాండ్‌ మేరకు టాప్‌ క్లాస్‌ ప్లేయర్స్‌కు ఏ+ అనే కేటగిరీ ఏర్పాటు చేసి.. వారి వార్షిక జీతాన్ని రూ 7 కోట్లకు పెంచారు. తాజాగా రవిశాస్త్రి జీతం కూడా పెరిగింది. దాదాపు అతనికి 10 కోట్ల వరకు అందనుందని తెలిసింది.

Story first published: Wednesday, September 25, 2019, 14:55 [IST]
Other articles published on Sep 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X