న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: టెస్టుల్లో పంత్ బెస్ట్‌ చాయిస్‌ కాదు.. అతనికంటే కంటే సాహానే అత్యుత్తమం!!

IND vs SA 2019,1st Test : Rishabh Pant Not Best Choice As Keeper In Tests, Says Former India Player
IND vs SA: Deep Dasgupta says Wriddhiman Saha best batsman than Rishabh Pant

కోల్‌కతా: టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ టెస్టుల్లో ఎంతమాత్రం బెస్ట్‌ చాయిస్‌ కాదు. పంత్‌ కంటే సీనియర్ వృద్దిమాన్ సాహానే అత్యుత్తమం అని బెంగాల్‌ మాజీ కెప్టెన్‌ దీప్ దాస్‌గుప్తా అభిప్రాయపడ్డారు. దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టులలో పంత్ కంటే సాహానే తుది జట్టులోకి తీసుకొవాలని దీప్ దాస్‌గుప్తా కోరుకుంటున్నారు. పంత్‌కు అవకాశాలు ఇవ్వాలని కొందరు అంటుంటే.. ఇక చాలు అని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా పంత్ మాత్రం పరుగులు చేయడంలో విఫలమవుతున్నాడు.

<strong>కొరియా ఓపెన్‌.. క్వార్టర్‌ ఫైనల్స్‌లో పారుపల్లి కశ్యప్‌</strong>కొరియా ఓపెన్‌.. క్వార్టర్‌ ఫైనల్స్‌లో పారుపల్లి కశ్యప్‌

దక్షిణాఫ్రికా సిరీస్‌లో విఫలం:

దక్షిణాఫ్రికా సిరీస్‌లో విఫలం:

మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ప్రత్యామ్నాయంగా భావిస్తున్న పంత్‌కు ఇటీవలి కాలంలో జట్టు యాజమాన్యం పదే పదే అవకాశాలు ఇస్తోంది. అయినా పంత్ పరుగులు చేయలేకపోతున్నాడు. ప్రపంచకప్ సహా వెస్టిండీస్‌ సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ఇక ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా సిరీస్‌లో కూడా 4, 19 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు.

 ఇచ్చిన అవకాశాలు చాలు:

ఇచ్చిన అవకాశాలు చాలు:

పంత్ ఆటతీరుపై ఇప్పటికే కోచ్‌ రవిశాస్త్రి ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఇక కెప్టెన్‌ విరాట్ కోహ్లీ కూడా నాలుగైదు అవకాశాల్లోనే కుర్రాళ్లు నిరూపించుకోవాలని హెచ్చరించాడు. మరోవైపు పలువురు మాజీలు పంత్‌ ఆట తీరును మార్చుకోమని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఇక మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ మండిపడ్డాడు. పంత్‌కు ఇచ్చిన అవకాశాలు చాలు, సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోవాలన్నాడు. ఈ క్రమంలో పంత్‌కు యువరాజ్‌ మద్దతుగా నిలిచాడు. అయితే.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పంత్‌కు అవకాశాలు ఇస్తున్నారు మంచిదే. కానీ టెస్టుల్లో కూడా అతను ఎందుకంటూ దీప్‌దాస్‌ ప్రశ్నించారు.

 పంత్ కంటే సాహానే అత్యుత్తమం:

పంత్ కంటే సాహానే అత్యుత్తమం:

తాజాగా దీప్ దాస్‌గుప్తా మాట్లాడుతూ... 'పంత్‌ ఆటను పరిశీలిస్తే టెస్టుల్లో అతడు బెస్ట్‌ చాయిస్‌ కాదు. టెస్టు క్రికెట్‌ భిన్నంగా ఉంటుంది. పంత్ చివరి టెస్టు ఇన్నింగ్స్‌లో సరిగా ఆడలేదు. అతను ఒకేవిధమైన షాట్లు కొట్టి పెవిలియన్ చేరుతున్నాడు. పంత్‌ టెస్టు ఆటగాడు కాదు. సాహాను టెస్టులకు ఎంపిక చేయాల్సింది. టెస్టుల్లో పంత్ కంటే సాహానే అత్యుత్తమం. ఇందులో ఎటువంటి సందేహం లేదు' అని అన్నారు.

 అత్యుత్తమ వికెట్‌ కీపర్లలో సాహా ఒకడు:

అత్యుత్తమ వికెట్‌ కీపర్లలో సాహా ఒకడు:

'ప్రస్తుత ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ వికెట్‌ కీపర్లలో సాహా ఒకడు. రిషబ్ కంటే మంచి బ్యాట్స్‌మన్‌. కాకపోతే అతను మంచి బ్యాట్స్‌మన్‌ అవునా? కాదా?.. అనేది ఇంకా టీమిండియా మేనేజ్‌మెంట్‌ సందేహం. భారత జట్టు ఐదుగురి బౌలర్లతో మ్యాచ్‌కు సిద్ధమయ్యే క్రమంలో సాహా బ్యాటింగ్‌పై సందేహాలు ఏర్పడుతున్నాయి. అతను ప్రతీసారి పరుగులు చేస్తున్నాడు. భారత్‌-ఏ తరఫున కూడా నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టులలో సాహానే ఆడించాలి' అని దీప్‌దాప్‌ గుప్తా పేర్కొన్నారు.

Story first published: Thursday, September 26, 2019, 13:15 [IST]
Other articles published on Sep 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X