న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ: సాహాను సాగనంపి మా తెలుగోడికి అవకాశమివ్వండయ్యా! నెట్టింట పేలుతున్న సెటైర్స్!

 Ind vs NZ: Time For Wriddhiman Saha Farewell And K S Bharat Into Indian Playing 11 Test Squad

హైదరాబాద్: టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహాపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన సాహా తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం ఒకే ఒక పరుగు చేసి టీమ్ సౌథీ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దాంతో సాహాపై అభిమానులు మండిపడుతున్నారు. అతన్ని పక్కన పెట్టాల్సిన సమయం వచ్చేసిందని, యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

పంత్‌కు విశ్రాంతివ్వడంతో..

రెగ్యులర్ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు విశ్రాంతి ఇవ్వడంతో వృద్దీమాన్ సాహా, కేఎస్ భరత్‌లను ఈ సిరీస్‌కు ఎంపిక చేశారు. అయితే ఫస్ట్ టెస్ట్‌లో కేఎస్ భరత్‌కు చోటు దక్కుతుందని అంతా భావించినా.. టీమ్‌మేనేజ్‌మెంట్ సీనియర్ వికెట్ కీపర్ వృద్దీమాన్ సాహాకే అవకాశం ఇచ్చింది. అయితే ఈ అవకాశాన్ని సాహా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడు. అతను గనుక ఓ 30-40 పరుగులు చేసినా టీమిండియాకు భారీ స్కోర్ లభించేదని కామెంట్ చేస్తున్నారు. 12 బంతులు ఎదుర్కొన్న సాహా.. తీవ్రంగా ఇబ్బంది పడ్డాడని, అతని పనైపోయిందని కామెంట్ చేస్తున్నారు.

కేఎస్ భరత్ తీసుకోండి..

ఈ నేపథ్యంలో సాహా ఆట తీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికైనా సాహాను జట్టు నుంచి తప్పించి అతని స్థానంలో కేఎస్‌ భరత్‌ను ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ''ఏం ఆడుతున్నావయ్యా! ఆటపై కాస్త దృష్టి పెట్టు! సాహాను ఇంకా జట్టులో కొనసాగించడం ఎందుకు? మా తెలుగోడి అవకాశమివ్వండయ్యా.. ఇప్పటికైనా అతన్ని కాదని రిషభ్‌ పంత్‌ను ఎందుకు తీసుకుంటారో అర్థమవుతోందా! సాహా ఫామ్‌లో లేడు కదా! బైబై చెప్పేయండి! సాహాకు బదులు కేఎస్‌ భరత్‌ను జట్టులోకి తీసుకోండి.' అని ట్రోల్‌ చేస్తున్నారు.

భారత్ 345 ఆలౌట్..

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా 345 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. 111.1 ఓవర్ల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. 258/4 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను మొదలెట్టిన టీమిండియా కివీస్‌ బౌలర్‌ టిమ్‌ సౌథీ దెబ్బతీశాడు. అర్ధ సెంచరీ సాధించిన జడేజా.. ఆ తర్వాత సాహా, సెంచరీ హీరో శ్రేయస్‌ అయ్యర్‌, అక్షర్‌ పటేల్‌ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మరో బౌలర్‌ అజాజ్‌ పటేల్‌ అశ్విన్‌, ఇషాంత్‌ శర్మలను పెవిలియన్‌కు పంపి లాంఛనం పూర్తి చేశాడు.

Story first published: Friday, November 26, 2021, 16:30 [IST]
Other articles published on Nov 26, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X