న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ: సెంచరీతో విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్!

IND vs NZ: Shubman Gill becomes highest India’s individual scorer in T20Is

అహ్మదాబాద్: టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తన జోరును కొనసాగిస్తున్నాడు. వన్డేల్లో సెంచరీలతో చెలరేగిన గిల్.. టీ20 ఫార్మాట్‌లోనూ ఆ ముచ్చట తీర్చుకున్నాడు. న్యూజిలాండ్‌తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో టీ20లో గిల్(63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 126 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగాడు. ఈ శతకంతో టీ20ల్లోనూ తాను సత్తా చాటగలనని చాటిచెప్పాడు. 35 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన గిల్.. 54 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో వీరవిహారం చేశాడు.

అయితే ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనతను అందుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ కలిగిన భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. గతేడాది ఆసియాకప్‌లో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి టీ20 సెంచరీ అందుకున్న విరాట్ కోహ్లీ 122* పరుగులతో అజేయంగా నిలిచి భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. తాజాగా ఈ రికార్డును గిల్ అధిగమించాడు. 126* పరుగులతో గిల్ అగ్రస్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ 122*, రోహిత్ శర్మ 118 తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

IND vs NZ: Shubman Gill becomes highest India’s individual scorer in T20Is

23 ఏళ్ల శుభ్‌మన్ గిల్.. అంతర్జాతీయ క్రికెట్‌లో 51 ఇన్నింగ్స్‌ల్లోనే 6 సెంచరీలు(4వన్డే, 1టీ20, 1టెస్ట్), 9 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఈ ఏడాదే ఒక డబుల్ సెంచరీతో పాటు రెండు సెంచరీలు నమోదు చేయడం విశేషం. శుభ్‌మన్ గిల్ సెంచరీతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 234 పరుగులు చేసింది. గిల్‌కు అండగా రాహుల్ త్రిపాఠి(44), హార్దిక్ పాండ్యా(30) మెరుపులు మెరిపించారు. న్యూజిలాండ్ బౌలర్లలో బ్రేస్‌వేల్, టిక్‌నర్, సోదీ, డారిల్ మిచెల్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ 54 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతోంది.

Story first published: Wednesday, February 1, 2023, 22:09 [IST]
Other articles published on Feb 1, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X