న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ:టామ్ లాథమ్ వికెట్ కోహ్లీ ఐడియానే.. ఉచ్చు బిగించి ఔట్ చేసిన శార్దూల్ ఠాకూర్!

 IND vs NZ: Rohit Sharma says Tom Latham wicket was planned by Virat Kohli, Hardik and Shardul

ఇండోర్: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నా.. జట్టు కోసం తన విలువైన సూచనలు, సలహాలు ఇస్తూనే ఉన్నాడు. న్యూజిలాండ్‌తో హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ధారళంగా పరుగులిచ్చి తీవ్ర ఒత్తిడిలో చివరి ఓవర్‌కు సిద్దమైన శార్దూల్ ఠాకూర్‌కు యార్కర్ వేయాలని సూచించి ఫలితం రాబట్టిన విరాట్.. చివరి వన్డేలోనూ విలువైన సలహా ఇచ్చాడు. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో కలిసి శార్దూల్ ఠాకూర్‌తో న్యూజిలాండ్ తాత్కలిక సారథి టామ్ లాథమ్‌కు ఉచ్చు బిగించాడు. భారత ఆటగాళ్ల వ్యూహంలో చిక్కుకున్న లాథమ్ గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. ఈ వికెట్‌ న్యూజిలాండ్ పతనాన్ని శాసించింది.

కోహ్లీ సలహాతోనే..

ఈ వికెట్ అనంతరం విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ ఒకరినొకరు నవ్వుకున్నారు. అయితే వికెట్ తీసిన ఆనందంలో అలా చేసి ఉంటారని అంతా అనుకున్నారు. కానీ తమ వ్యూహంలో టామ్ లాథమ్ చిక్కుకున్నాడనే అలా సెలెబ్రేట్ చేసుకున్నట్లు తాజాగా తెలిసింది. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మ ఈ విషయాన్ని తెలియజేశాడు. రోహిత్, హార్దిక్ కలిసి.. టామ్ లాథమ్‌ను శార్దూల్‌తో బోల్తా కొట్టించారని, నకుల్ బాల్ వేయాలనే ఆలోచిన వారిదేనని పేర్కొన్నాడు.

 నకుల్ బాల్ వేయాలంటూ..

నకుల్ బాల్ వేయాలంటూ..

'శార్దూల్ ఠాకూర్ అద్భుతమైన నకుల్ బాల్‌తో టామ్ లాథమ్‌ను ఔట్ చేశాడు. ఇన్నింగ్స్ మిడిల్‌లో లాథమ్ వికెట్ కోసం విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా కలిసి శార్దూల్‌తో అద్భుతమైన ప్రణాళిక రచించారు. ఆ ప్లాన్ అద్భుతంగా వర్కౌటైంది'అని రోహిత్ చెప్పుకొచ్చాడు. దాంతో ఈ వికెట్ వ్యూహాన్ని అర్థం చేసుకున్న ఫ్యాన్స్ విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 26వ ఓవర్‌లో శార్దూల్ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసాడు. ముందుగా క్రీజులో సెట్ అయిన డారిల్ మిచెల్‌ను షార్ట్ పిచ్‌బాల్‌తో పెవిలియన్ చేర్చిన శార్దూల్ ఠాకూర్.. మరుసటి బంతికే నకల్ బాల్‌తో లాథమ్‌ను బోల్తా కొట్టించాడు.

శతక్కొట్టిన రోహిత్, శుభ్‌మన్ గిల్..

శతక్కొట్టిన రోహిత్, శుభ్‌మన్ గిల్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 385 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(85 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో 101), శుభ్‌మన్ గిల్(78 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్స్‌లతో 113) సెంచరీతో చెలరేగగా... హార్దిక్ పాండ్యా(38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 54) హాఫ్ సెంచరీతో మెరిసాడు. న్యూజిలాండ్ బౌలర్లలో జకోబ్ డఫ్ఫీ, బ్లెయిర్ టిక్‌నర్ మూడు వికెట్లు తీయగా.. మైఖేల్ బ్రేస్‌వెల్ ఓ వికెట్ పడగొట్టాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ 41.2 ఓవర్లలో 295 పరుగులకు కుప్పకూలింది. డెవాన్ కాన్వే(100 బంతుల్లో12 ఫోర్లు, 8 సిక్స్‌లతో 138) సెంచరీతో చెలరేగినా ఫలితం లేకపోయింది. హెన్రీ నికోల్స్(42) మినహా మరే బ్యాటర్ రాణించలేదు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ మూడేసి వికెట్లు తీయగా.. చాహల్ రెండు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, ఉమ్రాన్ మాలిక్ చెరొక వికెట్ తీసారు.

Story first published: Wednesday, January 25, 2023, 12:05 [IST]
Other articles published on Jan 25, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X