న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ: టీమిండియా ఔట్ డేటేడ్ టీమ్.. వసీం జాఫర్‌ను ఎగతాళి చేసిన మైఖేల్ వాన్!

IND vs NZ: Michael Vaughan trolls Wasim Jaffer and Team India after New Zealand wins 1st ODI

హైదరాబాద్: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ మరోసారి టీమిండియాపై అక్కసు వెళ్లగక్కాడు. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. బౌలింగ్ వైఫల్యంతో 307 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా కాపాడుకోలేకపోయింది. ఈ ఓటమిపై స్పందించిన మైఖేల్ వాన్.. వసీం జాఫర్‌ను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేశాడు.

ముందుగా ఈ ఓటమిపై వసీం జాఫర్ స్పందిస్తూ న్యూజిలాండ్ జట్టును అభినందించాడు. ముఖ్యంగా ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన టామ్ లాథమ్, కేన్ విలియమ్సన్‌లను కొనియాడుతూ ట్వీట్ చేశాడు. 'బ్లాక్ క్యాప్స్ అద్భుతంగా ఆడింది. అసాధారణ బ్యాటింగ్‌తో 300 లక్ష్యాన్ని 270కి పరిమితం చేసింది. విలియమ్సన్ క్లాస్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకోగా.. టామ్ లాథమ్ చెలరేగాడు. ఓ ఓపెనర్ డౌన్ ది ఆర్డర్ వచ్చి సక్సెస్ కావడం సాధారణ విషయం కాదు. ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగిన టీమిండియా వ్యూహాత్మక తప్పిదం చేసింది.'అని జాఫర్ ట్వీట్ చేశాడు.

ఈ అవకాశం కోసం గోతికాడి నక్కలా ఎదురు చూసిన మైఖేల్ వాన్.. వసీం జాఫర్ ట్వీట్ రీట్వీట్ చేస్తూ ఔట్‌డేటేడ్ టీమిండియాని విమర్శించాడు. 'న్యూజిలాండ్ డేటేడ్ వన్డే టీమ్.. ఏడుగురు బౌలింగ్ ఆప్షన్స్ లేకుంటే కనీం ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగాలి'అని సూచించాడు. ఈ ఇద్దరి మధ్య ట్విటర్ వార్ చాలా రోజులుగా సాగుతోంది. ఆధిపత్యం చేతులు మారినప్పుడల్లా ఈ ఇద్దరూ తమదైన శైలిలో ట్వీట్లతో పంచులు విసురుకుంటూ ఇరు దేశాల క్రికెట్ అభిమానులకు కావాల్సినంత మజాను అందిస్తుంటారు. ముఖ్యంగా జాఫర్ సంధించే పంచ్‌లకు వాన్ ముఖం వాడిపోతూ ఉంటుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 306 పరుగుల భారీ స్కోర్ చేసింది. శ్రేయస్ అయ్యర్(76 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 80), శిఖర్ ధావన్(77 బంతుల్లో 13 ఫోర్లతో 72), శుభ్‌మన్ గిల్(65 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించగా... చివర్లో వాషింగ్టన్ సుందర్(16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ, లూకీ ఫెర్గూసన్ మూడేసి వికెట్లు తీయగా.. ఆడమ్ మిల్నే ఓ వికెట్ పడగొట్టాడు.

అనంతరం న్యూజిలాండ్ 47.1 ఓవర్లలో 3 వికెట్లకు 309 పరుగులు చేసి గెలుపొందింది. టామ్ లాథమ్(104 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్స్‌ర్లతో 145 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. కేన్ విలియమ్సన్(98 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 94 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

Story first published: Friday, November 25, 2022, 20:27 [IST]
Other articles published on Nov 25, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X