న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ: స్పిన్ ఎక్కువైంది.. బీసీసీఐ తాట తీసింది.. లక్నో క్యూరేటర్‌పై వేటు!

IND vs NZ: Lucknow curator sacked for shocker of a pitch for India vs New Zealand second T20I

న్యూఢిల్లీ: భారత్-న్యూజిలాండ్ మధ్య ఆదివారం జరిగిన రెండో టీ20కి తయారు చేసిన పిచ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. బంతి గింగిరాలు తిరిగిన ఈ పిచ్‌పై బ్యాటర్లు 100 పరుగులు చేయడానికి అపోసోపాలు పడ్డారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కనీసం ఒక్క సిక్స్ కూడా నమోదు కాలేదంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ధనాధన్ బ్యాటింగ్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన టీ20ల్లో ఏమాత్రం ఊహించని స్పిన్ వికెట్‌ను చూసిన ఇరు జట్ల ఆటగాళ్లు, అభిమానులు, ప్రేక్షకులు షాక్‌కు గురయ్యారు.

ఏ మాత్రం మెరుపులు లేకుండా సప్పగా సాగిన ఈ మ్యాచ్‌పై అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా సైతం ఇదో చెత్త పిచ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. టీ20 ఫార్మాట్‌కు ఏమాత్రం సరిపోయేది కాదని, క్యూరెటర్లు మంచి పిచ్‌లు తయారు చేయడంపై దృష్టి సారించాలని కోరాడు.

బీసీసీఐ ఆగ్రహం..

బీసీసీఐ ఆగ్రహం..

మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అయితే ఈ తరహా పిచ్‌లను టీ20లకు తయారు చేస్తే ఐపీఎల్ ఆడేందుకు ఎవరూ కూడా భారత్‌కు రారని సెటైర్లు పేల్చాడు. దాంతో లక్నో వికెట్‌పై తీవ్ర చర్చ జరగగా.. బీసీసీఐ సైతం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్‌ను వివరణ కూడా కోరినట్లు జాతీయ మీడియా పేర్కొంది.

ఈ విమర్శలను అవమానంగా భావించిన ఉత్తర ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్.. లక్నో పిచ్ క్యూరేటర్ సురేందర్‌పై వేటు వేస్తూ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. తక్షణమే అతన్ని క్యూరేటర్ బాధ్యతల నుంచి తప్పించినట్లు యూపీ మీడియా పేర్కొంది.

ఐపీఎల్‌కు ఇలానే ఉంటే..

ఐపీఎల్‌కు ఇలానే ఉంటే..

కరోనా కారణంగా గత మూడు ఐపీఎల్ సీజన్లు బయో బబుల్‌లో కఠిన ఆంక్షల మధ్య కొన్ని వేదికల్లో మాత్రమే జరిగాయి. ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడటంతో పాత పద్దతిలోనే హోమ్ అండ్ అవే ఫార్మాట్‌లో అప్‌కమింగ్ సీజన్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది.

గతేడాదే ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్‌కు లక్నో మైదానం హోం గ్రౌండ్ అవనుంది. ఈ నేపథ్యంలో రెండో టీ20 మ్యాచ్ కు తయారుచేసిన పిచ్‌ను గనుక ఐపీఎల్ మ్యాచ్‌లకు తయారుచేస్తే అది మొదటికే మోసం వస్తుందని బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

కొత్త పిచ్‌ను సిద్దం చేయనున్న యూపీసీఏ

కొత్త పిచ్‌ను సిద్దం చేయనున్న యూపీసీఏ

క్యూరేటర్‌పై చర్యలు తీసుకున్నామని తెలిపిన యూపీసీఏ.. త్వరలోనే ఈ పిచ్ స్థానంలో కొత్త వికెట్‌ను రూపొందిస్తామని వివరణ ఇచ్చినట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. భారత్-న్యూజిలాండ్ రెండో టీ20 పిచ్ పై లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ మెంటార్ గౌతం గంభీర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు.

రెండో టీ20 మ్యాచ్ జరుగుతుండగా.. ఇలాంటి పిచ్‌ను చూస్తే సౌతాఫ్రికా ఆటగాడు, లక్నో టీమ్ కీలక ప్లేయర్ భారత్‌కు కూడా రాడని చమత్కరించాడు.తమ స్పిన్నర్లు అమిత్ మిశ్రా, రవి బిష్ణోయ్ మాత్రం ఈ పిచ్ పై పండుగ చేసుకుంటారని వ్యాఖ్యానించాడు.

Story first published: Tuesday, January 31, 2023, 15:53 [IST]
Other articles published on Jan 31, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X