న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ: మైదానంలో దూసుకొచ్చిన పిల్లాడు.. సెక్యూరిటీని హెచ్చరించిన రోహిత్!

 IND vs NZ: A fan invaded the field and hugged Rohit Sharma during India vs New Zealand 2nd ODI

రాయ్‌పూర్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ అభిమాని సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి దూసుకొచ్చాడు. తన అభిమాన క్రికెటర్ అయిన రోహిత్ శర్మ గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఈ ఊహించని ఘటనతో షాక్‌కు గురైన భద్రతా సిబ్బంది.. వెంటనే అప్రమత్తమై ఆ అభిమానిని మైదానం నుంచి తీసుకెళ్లారు. దాంతో మ్యాచ్ కాసేపు నిలిచి పోయింది. అయితే మైదానంలోకి దూసుకొచ్చిన ఆ అభిమాని ఓ 12 ఏళ్ల బాలుడు కావడం విశేషం.

రోహిత్ శర్మను పిచ్చిగా అభిమానించే ఆ కుర్రాడు.. తన ఆరాధ్య క్రికెటర్‌ను ఎలాగైన కలవాలనే ఉద్దేశంతో సాహసం చేశాడు. ఇక ఆ కుర్రాడిని వదిలేయాని రోహిత్ శర్మ సెక్యూరిటీకి సూచించడం టీవీ కెమెరాల్లో కనిపించింది. రోహిత్ శర్మ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. భారత్ ఇన్నింగ్స్ సందర్భంగా బ్లెయిర్ టిక్‌నెర్ వేసిన 10వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ నాలుగో బంతిని రోహిత్ సిక్సర్ బాదగా.. అనంతరం ఆ బాలుడు మైదానంలోకి దూసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు మహమ్మద్ షమీ(3/18), హార్దిక్ పాండ్యా(2/16), వాషింగ్టన్ సుందర్(2/7) విజృంభించడంతో న్యూజిలాండ్ 34.3 ఓవర్లలోనే 108 పరుగులకే కుప్పకూలింది. గ్లేన్ ఫిలిప్స్(52 బంతుల్లో 5 ఫోర్లతో 36), మైకేల్ బ్రేస్‌వెల్(30 బంతుల్లో 4 ఫోర్లతో 22) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సిరాజ్, ఠాకూర్, కుల్దీప్ యాదవ్‌కు తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్య చేధనకు దిగిన టీమిండియా విజయం దిశగా దూసుకెళ్తోంది. న్యూజిలాండ్ బ్యాటర్లు తడబడిన వికెట్‌పై భారత ఓపెనర్లు స్వేచ్చగా ఆడారు. ముఖ్యంగా రోహిత్ శర్మ తనకే సాధ్యమైన ట్రేడ్ మార్క్ షాట్లతో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 47 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ అనంతరం షిప్లే బౌలింగ్‌లో రోహిత్ ఎల్బీగా వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 72 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో శుభ్‌మన్ ఇన్నింగ్స్ నడపిస్తున్నాడు.

Story first published: Saturday, January 21, 2023, 18:17 [IST]
Other articles published on Jan 21, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X