న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎందుకంత అసహనం?: 'అశ్విన్‌తో కోహ్లీ మాట్లాడి ఉండాల్సింది'

By Nageshwara Rao
India vs England 2018 : Sourav Ganguly Talks About Ravichandran Ashwin
 IND vs ENG: Virat Kohli should talk to Ravi Ashwin, Sourav Ganguly takes a dig at off spinners impatience

హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అసహనంతో కనిపిస్తున్నాడని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. సౌతాంప్టన్ వేదికగా ముగిసిన నాలుగో టెస్టులో పిచ్‌పై ఏర్పడిన పగుళ్లని చక్కగా వినియోగించుకున్న ఇంగ్లాండ్‌ స్పిన్నర్ మొయిన్ అలీ ఏకంగా 9 వికెట్లు తీయగా, అశ్విన్ మాత్రం మూడు వికెట్లకే పరిమితమయ్యాడు.

చేతులెత్తేసి ఇంటికెళ్లేందుకు విమానం ఎక్కేసే రకం కాదు: ఘాటుగా బదులిచ్చిన రవిశాస్త్రిచేతులెత్తేసి ఇంటికెళ్లేందుకు విమానం ఎక్కేసే రకం కాదు: ఘాటుగా బదులిచ్చిన రవిశాస్త్రి

ఓవర్‌లోని ఆరు బంతుల్ని ఆరు విధాలుగా

ఓవర్‌లోని ఆరు బంతుల్ని ఆరు విధాలుగా

దీనిపై స్పందించిన గంగూలీ ఓవర్‌లోని ఆరు బంతుల్ని ఆరు విధాలుగా వేయాలన్న తపనతోనే ఆ టెస్టులో అశ్విన్ ఫెయిలయ్యాడని తెలిపాడు. ఫాస్ట్ బౌలర్లు పిచ్‌పై పగుళ్లు, గరుకు ఏర్పడేలా చేసినప్పటికీ, వాటిని అశ్విన్ వినియోగించుకోకుండా దుస్రా‌, లెగ్‌స్పిన్‌ వికెట్ల కోసం ప్రయత్నించాడని గంగూలీ మండిపడ్డాడు.

ఓవల్ వేదికగా శుక్రవారం నుంచి ఆఖరి టెస్టు

ఓవల్ వేదికగా శుక్రవారం నుంచి ఆఖరి టెస్టు

ఇరు జట్ల మధ్య ఈ సిరిస్‌లో ఆఖరి టెస్టు శుక్రవారం ఓవల్ వేదికగా ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో "మైదానంలో అశ్విన్ ఎందుకంత అసహనంతో ఉంటున్నాడో? కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడి తెలుసుకోవాలి. అతను ప్రతిసారీ.. ఓవర్‌లోని ఆరు బంతుల్నీ.. భిన్నంగా వేసేందుకు ప్రయత్నిస్తున్నాడు" అని అన్నాడు.

నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు

నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు

"భారత్ వెలుపల టెస్టులు ఆడేటప్పుడు.. ఫాస్ట్ బౌలర్లు ఏర్పరిచే పగుళ్లు, గరుకు పిచ్‌లను ఆఫ్ స్పిన్నర్ వినియోగించుకోవాలి. నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు.. పిచ్ గరుకుగా కనిపిస్తే.. లెగ్‌ స్పిన్నర్ అనిల్ కుంబ్లేకి బదులుగా హర్భజన్ సింగ్‌తో బౌలింగ్ చేయించేవాడ్ని. నాలుగో టెస్టులో 9 వికెట్లు పడగొట్టిన మొయిన్ అలీ.. అశ్విన్ కంటే మెరుగైన బౌలరేమీ కాదు" అని గంగూలీ అన్నాడు.

దూస్రా, రాంగ్ ఆన్, లెగ్‌స్పిన్‌ బౌలింగ్‌తో

దూస్రా, రాంగ్ ఆన్, లెగ్‌స్పిన్‌ బౌలింగ్‌తో

"అయితే, అతడు గరుకు పిచ్‌ని చక్కగా వినియోగించుకున్నాడు. మరోవైపు అశ్విన్ మాత్రం.. దూస్రా, రాంగ్ ఆన్, లెగ్‌స్పిన్‌ బౌలింగ్‌తో వికెట్ల కోసం ప్రయత్నించాడు. ఒకే తరహాలో టెస్టుల్లో బౌలింగ్ చేస్తుంటే విసుగు వస్తుంది. కానీ, ఆ టెక్నిక్‌ మ్యాచ్‌‌లను గెలిపించలేవు" అని సౌరవ్ గంగూలీ తెలిపాడు.

Story first published: Thursday, September 6, 2018, 11:22 [IST]
Other articles published on Sep 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X