న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గత పదేళ్లలో మొత్తం 13: రనౌట్లలో పుజారా అరుదైన రికార్డు

By Nageshwara Rao
IND vs ENG: Cheteshwar Pujara becomes batsman with joint-most run-out dismissals in last 10 years of Tests

లండన్: ఆతిథ్య ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా క్రికెటర్ ఛటేశ్వర్ పుజారా ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గత పదేళ్లలో టెస్టు క్రికెట్‌లో అత్యధిక సార్లు రనౌటైన ఆటగాళ్ల జాబితాలో పుజారా అగ్రస్థానంలో నిలిచాడు. ప్రస్తుతం కోహ్లీసేన సుదీర్ఘ పర్యటన కోసం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది.

లార్డ్స్ టెస్టు: పుజారా సిల్లీ రనౌట్‌పై రహానే ఇలాలార్డ్స్ టెస్టు: పుజారా సిల్లీ రనౌట్‌పై రహానే ఇలా

ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య లార్డ్స్ వేదికగా గురువారం ఆరంభం కావాల్సిన రెండో టెస్టు వర్షం కారణంగా తొలి రోజు పూర్తిగా ఆట రద్దయింది. తొలిరోజు ఒక్క బంతి కూడా పడకపోవడం విశేషం. దీంతో రెండోరోజైన శుక్రవారం ప్రారంభమైన ఆటలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్‌ కెప్టెన్ జో రూట్ కోహ్లీసేనను మొదట బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

తొలి టెస్టులో ఎదురైన ఓటమికి లార్డ్స్‌లో బదులిస్తారేమో అని అభిమానులు ఆశించినా టీమిండియా ఆటతీరులో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. తొలి రోజులాగే రెండో రోజు కూడా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో రెండు సెషన్లలో కేవలం 8.3 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.

1
42375

వర్షం దోబూచులాడిన రెండో రోజు ఆఖరి ఇన్నింగ్స్‌ మాత్రమే పూర్తిగా సాగగా ఇంగ్లండ్‌ పేసర్లు కచ్చితమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌ బంతులతో చెలరేగారు. ముఖ్యంగా జేమ్స్‌ ఆండర్సన్‌ (5/20) ధాటికి భారత్‌ వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో 35.2 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది.

5/20: లార్డ్స్‌లో ఆండర్సన్ నెలకొల్పిన అరుదైన రికార్డులివే5/20: లార్డ్స్‌లో ఆండర్సన్ నెలకొల్పిన అరుదైన రికార్డులివే

ఈ మ్యాచ్‌లో శిఖర్‌ ధావన్ స్థానంలో జట్టులోకి వచ్చిన పుజారా రనౌట్‌ అయ్యాడు. తనదైన శైలిలో డిఫెన్స్‌ ఆడుతూ క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నం చేస్తోన్న పుజారా.. కోహ్లీ తప్పిదం కారణంగా ఔటయ్యాడు. సిల్లీ పాయింట్‌లో బంతిని ఆడి పరుగు కోసం ప్రయత్నించాడు పుజారా. కోహ్లీ కూడా స్పందించడంతో అతను ముందుకెళ్లిపోయాడు.

కానీ తర్వాత కోహ్లీ మనసు మార్చుకుని వెనుకంజ వేశాడు. కానీ, అప్పటికే పుజారా చాలా దూరం వెళ్లిపోయాడు. తిరిగి క్రీజులో బ్యాట్‌ పెట్టేలోపు పుజారాను పోప్‌ రనౌట్‌ చేశాడు. 41 నిమిషాల పాటు క్రీజులో నిలిచిన పుజారా 25 బంతులాడి ఒక్క పరుగుకే పెవిలియన్‌కు చేరాడు.

లార్డ్స్‌లో భారత్ 107 ఆలౌట్: ఆండర్సన్‌ అరుదైన రికార్డు (ఫోటోలు)లార్డ్స్‌లో భారత్ 107 ఆలౌట్: ఆండర్సన్‌ అరుదైన రికార్డు (ఫోటోలు)

గత పదేళ్లలో టెస్టు క్రికెట్‌లో అత్యధిక సార్లు రనౌటైన ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే పుజారానే ముందున్నాడు. మొత్తం ఎనిమిది సార్లు పుజారా రనౌటయ్యాడు. మ్యాట్‌ ప్రియర్‌, రంగనా హెరాత్‌, రికీ పాంటింగ్‌, రాస్‌ టేలర్‌ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. గత పదేళ్లలో 13 మంది భారత ఆటగాళ్లు రనౌట్‌ కాగా, అందులో 8సార్లు పుజారానే ఉన్నాడు.

ఈ ఏడాది మొదట్లో దక్షిణాప్రికా పర్యటనలో భాగంగా సెంచూరియన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పుజారా రెండు సార్లు రనౌట్ అయిన సంగతి తెలిసిందే.

Story first published: Saturday, August 11, 2018, 16:24 [IST]
Other articles published on Aug 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X