న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

షకీబ్.. వాడు చాలా ఎక్స్‌ట్రాలు చేస్తున్నాడు.. చిర్రుబుర్రులాడిన విరాట్ కోహ్లీ (వీడియో)

IND vs BAN: Virat Kohli had a heated exchange with the Bangladesh players goes viral

మిర్పూర్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సహనం కోల్పోయాడు. భారత రెండో ఇన్నింగ్స్‌లో 22 బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేసిన విరాట్ కోహ్లీ.. మెహ్‌దీ హసన్ మీరాజ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు. పూర్తి స్పిన్‌కు అనుకూలిస్తున్న వికెట్‌పై డిఫెన్స్ ఆడిన విరాట్.. షార్ట్ లెగ్ ఫీల్డర్‌ సూపర్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. విరాట్ ఔటవ్వడంతో బంగ్లాదేశ్ ఆటగాళ్లు సంబరాలు చేసుకోగా.. విరాట్ ఆగ్రహానికి గురయ్యాడు.

తైజుల్‌తో కోహ్లీ గొడవ..

ముఖ్యంగా తైజుల్ ఇస్లామ్‌తో గొడవకు దిగాడు. దాంతో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్, అంపైర్లు జోక్యం చేసుకోగా.. ఏ మాత్రం శాంతించని కోహ్లీ.. వాడు చాలా ఎక్స్‌ట్రాలు చేస్తున్నాడని షకీబ్‌కు సూచిస్తూ.. తిట్టుకుంటూ క్రీజును వీడాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. భారత ఇన్నింగ్స్ 20వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ నాలుగో బంతిని రఫ్ ప్యాచ్‌లో మెహ్‌దీ హసన్ వేయగా విరాట్ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని షార్ట్ లెగ్ ఫీల్డర్ చేతిలోకి దూసుకెళ్లింది.

స్పష్టత కరువు..

అయితే విరాట్ ఆగ్రహానికి దారి తీసిన పరిస్థితులపై క్లారిటీ లేదు. సహజంగా బ్యాటర్ ఔటైనప్పుడు ఫీల్డింగ్ టీమ్ సంబరాలు చేసుకోవడం సాధారణమే. కానీ తైజుల్ ఇస్లామ్‌పై విరాట్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతను ఏమైనా నోటికి పనిచెప్పాడా? అనేది తెలియాల్సి ఉంది. ఇక విరాట్ కోహ్లీ ఆగ్రహంతో తైజుల్ ఇస్లామ్ దగ్గరకు వెళ్లిన షకీబ్ అల్ హసన్ అతన్ని మందలించినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఏది ఏమైనా ఈ ఘటనకు గల కారణాన్ని విరాట్ కోహ్లీని చెప్పాల్సి ఉంది.

ఏమో సర్ నేను చూడలేదు..

మూడో రోజు ఆట అనంతరం మీడియా ముందుకు వచ్చిన మహమ్మద్ సిరాజ్‌ను ఈ గొడవ గురించి అడగ్గా.. తాను చూడలేదని, ఐస్ బాత్ చేస్తున్నానని తెలిపాడు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసమే విరాట్ కోహ్లీ కంటే ముందు అక్షర్ పటేల్‌ను పంపించామని స్పష్టం చేశాడు. 145 పరుగుల స్వల్ప లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 23 ఓవర్లలో 4 వికెట్లకు 45 పరుగులు చేసింది. క్రీజులో అక్షర్ పటేల్(26 బ్యాటింగ్), నైట్ వాచ్‌మన్ జయదేవ్ ఉనాద్కత్(3 బ్యాటింగ్) ఉన్నారు. మెహ్‌దీ హసన్ మీరాజ్(3/12) తీన్మార్ వేయడంతో టీమిండియా 37 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

రసవత్తరంగా మ్యాచ్..

బంగ్లా స్పిన్ ధాటికి శుభ్‌మన్ గిల్(7), కేఎల్ రాహుల్(2), విరాట్ కోహ్లీ(6), విరాట్ కోహ్లీ(1) క్రీజులో నిలబడలేకపోయారు. భారత్ విజయానికి ఇంకా 100 పరుగులు కావాలి. మరోవైపు బంగ్లా గెలుపునకు 6 వికెట్లు కావాలి. అంతకుముందు 7/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్.. 231 పరుగులకు కుప్పకూలింది. జకీర్ హసన్(51), లిటన్ దాస్(73) హాఫ్ సెంచరీలతో బంగ్లాను ఆదుకున్నారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీయగా.. అశ్విన్, మహమ్మద్ సిరాజ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనాద్కత్‌కు తలో వికెట్ దక్కింది.

Story first published: Saturday, December 24, 2022, 19:14 [IST]
Other articles published on Dec 24, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X