న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs BAN: భారత్‌తో వన్డే సిరీస్ ముందు బంగ్లాదేశ్‌కు గట్టి షాక్.. గాయంతో స్టార్ పేసర్ ఔట్!

IND vs BAN: Big Blow for Bangladesh, Taskin Ahmed RULED out of 1st against India

న్యూఢిల్లీ: భారత్‌తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్ జట్టుకు గట్టిషాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ టస్కిన్ అహ్మద్ వెన్ను నొప్పితో ఆదివారం జరగనున్న తొలి వన్డేకు దూరమయ్యాడు. కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ ఆడటంపై కూడా సందేహాలు నెలకొన్నాయి. వామప్ గేమ్‌లో అతను గజ్జ గాయానికి గురయ్యాడు.

టస్కిన్ అహ్మద్ తొలి వన్డే ఆడటం లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ సెలెక్టర్ మిన్‌హజుల్ అబెడిన్ తెలిపాడు. 'వెన్ను నొప్పితో భారత్‌తో జరిగే తొలి వన్డేకు టస్కిన్ అహ్మద్ దూరమయ్యాడు. అతని గాయం పురోగతిని బట్టి మిగతా మ్యాచ్‌లు ఆడటంపై తుది నిర్ణయం తీసుకుంటాం'అని పేర్కొన్నాడు.

గజ్జ గాయంతో..

గజ్జ గాయంతో..

తమీమ్ ఇక్బాల్ స్కాన్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తామని అబెడిన్ చెప్పాడు. 'తమీమ్ స్కాన్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నాం. అతను గజ్జ గాయానికి గురయ్యాడు. ఫిజియో స్కాన్ రిపోర్ట్ కావాలన్నాడు. అది వచ్చిన తర్వాతే అతను ఆడేది లేనిది తెలియనుంది'అని చెప్పుకొచ్చాడు. టస్కిన్ అహ్మద్ దూరమవ్వడం బంగ్లాదేశ్‌‌కు గట్టి ఎదురుదెబ్బ. అతను జట్టులో లేకుండా బౌలింగ్ విభాగం బలహీనం కానుంది. అతని స్థానంలో షోర్‌ఫిఫుల్ ఇస్లామ్ ఆడే అవకాశం ఉంది.

మూడు వన్డేలు.. రెండు టెస్ట్‌లు..

మూడు వన్డేలు.. రెండు టెస్ట్‌లు..

మూడు వన్డేల సిరీస్‌తో పాటు టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. గురువారమే టీమిండియా అక్కడికి చేరుకుంటుంది. న్యూజిలాండ్ పర్యటనకు దూరంగా ఉన్న కోహ్లీ, రోహిత్, రాహుల్ ఈ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ పర్యటనతో టీమిండియా వన్డే ప్రపంచకప్ సన్నాహకాలు మొదలు కానున్నాయి.

సరైన తుది జట్టు ఎంపికతో పాటు యువ ఆటగాళ్ల సత్తాను పరీక్షించనున్నారు. డిసెంబర్ 4-10 వరకు మూడు వన్డేల సిరీస్ జరగనుండగా.. డిసెంబర్ 14-26 వరకు రెండు టెస్ట్‌ల సిరీస్ జరగనుంది. ఈ రెండు సిరీస్‌లకు 15 మంది సభ్యులతో కూడిన జట్లను బీసీసీఐ ప్రకటించింది.

భారత వన్డే జట్టు

భారత వన్డే జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, షెహ్‌బాజ్ అహ్మద్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, ఇషాన్ కిషాన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్

భారత్ టెస్ట్ టీమ్

భారత్ టెస్ట్ టీమ్

రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, శ్రీకర్ భరత్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్

Story first published: Thursday, December 1, 2022, 16:49 [IST]
Other articles published on Dec 1, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X