న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అయ్యర్ స్థానంలో అతన్ని ఆడించండి.. శుభ్‌మన్ గిల్ మాత్రం వద్దు: దినేశ్ కార్తీక్

Ind vs Aus: Dinesh Karthik says Suryakumar Yadav Ahead of Shubman Gill if Shreyas Iyer Misses Out

న్యూఢిల్లీ: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వరుస విజయాలు అందుకున్న టీమిండియా.. సంప్రదాయక ఫార్మాట్‌కు సిద్దమైంది. ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అమీతుమీ తేల్చుకోనుంది. ఫిబ్రవరి 9న నాగ్‌పూర్ వేదికగా జరిగే తొలి టెస్ట్‌‌తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇరు జట్లు ఇప్పటికే సన్నాహకాలు ప్రారంభించాయి. 10 రోజుల ముందే భారత్‌లో అడుగుపెట్టిన ఆసీస్.. బెంగళూరు సమీపంలోని ఆలూర్ వేదికగా సన్నదమవుతుండగా... టీమిండియా కాన్పూర్ వేదికగా నిర్వహిస్తున్న ప్రాక్టీస్ శిభిరంలో ముమ్మరంగా సాధన చేస్తోంది.

డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే..?

డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే..?

వరల్డ్ టెస్ట్ చాంపియన్‌‌షిప్ గెలవాలంటే ఈ సిరీస్ గెలవడం టీమిండియాకు చాలా ముఖ్యం. మరోవైపు 2004 నుంచి సొంతగడ్డపై భారత్‌ను ఓడించలేకపోతున్న ఆసీస్.. ఈ సారి ఎలాగైనా ఆ ముచ్చట తీర్చుకోవాలనుకుంటోంది. దాంతో ఈ సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తొలి టెస్ట్‌లోనే విజయం సాధిస్తే టీమ్ ఆత్మవిశ్వాసం పెరగనుంది. ఈ క్రమంలోనే ఇరు జట్లు తొలి టెస్ట్‌లోనే విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నాయి.

తలనొప్పిగా..

తలనొప్పిగా..

టీమిండియా కాంబినేషన్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మలకు తలనొప్పిగా మారింది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ వరుస సెంచరీలతో సూపర్ ఫామ్‌లో ఉండటం.. శ్రేయస్ అయ్యర్ గాయంతో తొలి టెస్ట్‌కు దూరమవ్వడంతో జట్టులోకి ఎవర్ని తీసుకోవాలనేదానిపై ఎటూ తేల్చుకోలేకపోతుంది. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ రోల్‌ విషయంలోనూ టీమ్‌మేనేజ్‌మెంట్‌కు క్లారిటీ లేదు. అతన్ని ఓపెనర్‌గా ఆడించాలా? లేకుంటే మిడిలార్డర్‌లో దించాలా? అనేది కూడా తేల్చుకోవాల్సి ఉంది. రోడ్డు ప్రమాదంతో జట్టుకు దూరమైన రిషభ్ పంత్ స్థానంలో కేఎస్ భరత్‌ను ఆడించాలా? అటాకింగ్ గేమ్ ఆడే ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇవ్వాలా? అనేదానిపై కూడా టీమ్‌మేనేజ్‌మెంట్‌కు క్లారిటీ లేదు.

శుభ్‌మన్ వద్దు..

శుభ్‌మన్ వద్దు..

శ్రేయస్ అయ్యర్ స్థానంలో సూపర్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌కు అవకాశం దక్కనన్నట్లు తెలుస్తోంది. అయితే శుభ్‌మన్ గిల్‌కు కాకుండా సూర్యకుమార్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అన్నాడు. క్రిక్ బజ్‌లో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో కార్తీక్ మాట్లాడుతూ... 'నాగ్‌పూర్ టెస్టులో శ్రేయాస్ అయ్యర్ ఆడకుంటే ఆ స్థానంలో సూర్య - గిల్‌లో ఎవరిని ఆడించాలనే చర్చ జోరుగా సాగుతోంది. నా అభిప్రాయం మేరకైతే అయ్యర్ ప్లేస్ లో సూర్యకుమార్ యాదవ్ ను ఆడించడమే బెటర్.

సూర్య బెటర్..

సూర్య బెటర్..

ఎందుకంటే సూర్య స్పిన్ బాగా ఆడగలడు. ఇక భారత్- ఆస్ట్రేలియా సిరీస్ లో చర్చ అంతా స్పిన్ చుట్టే తిరుగుతోంది కావున సూర్యను ఆడించడమే బెటర్ అని నా ఫీలింగ్. భారత్ లో స్పిన్ కు సహకరించే పిచ్ లపై సూర్య తప్పక రాణిస్తాడు. అయితే అతడికి ఒక అవకాశమివ్వాలి. టీ20లలో అతడు ఎలా విజృంభిస్తున్నాడనేది చూస్తూనే ఉన్నాం..'అని చెప్పాడు.

Story first published: Saturday, February 4, 2023, 20:54 [IST]
Other articles published on Feb 4, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X