‘టీ20’ ఫీవర్‌: సిరిస్‌పై కన్నేసిన ఇరు జట్లు, వరుణుడు కరునిస్తాడా?

Posted By:

హైదరాబాద్: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య పరిమిత ఓవర్ల సిరిస్ చివరి దశకు చేరుకుంది. ఐదు వన్డేల సిరిస్‌ను 4-1తో కైవసం చేసుకున్న టీమిండియా, ఇప్పుడు టీ20 సిరిస్‌పై కన్నేసింది. మూడు టీ20ల సిరిస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. దీంతో సిరిస్ ఫలితాన్ని తేల్చే మూడో టీ20కి హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఆతిథ్యమిస్తోంది.

దీంతో హైదరాబాద్ వాసులకు క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. గువహటి ఓటమితో అప్రమత్తమైన కోహ్లీసేన ఆఖరి టీ20లో నెగ్గి సిరిస్‌ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు భారత పర్యటనలో తొలిసారిగా విజయం సాధించిన ఆస్ట్రేలియా, టీ20 సిరీస్‌ అయినా నెగ్గి స్వదేశానికి బయల్దేరాలని పట్టుదలతో ఉంది.

 ఇప్పటికే అమ్ముడైన టిక్కెట్లు

ఇప్పటికే అమ్ముడైన టిక్కెట్లు

ఇప్పటికే మ్యాచ్‌కి సంబంధించిన టిక్కెట్లన్నీ అమ్ముడయ్యాయి. చాన్నాళ్ల తర్వాత హైదరాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడుతుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అంతేకాదు సిరీస్‌ ఫలితాన్ని తేల్చే టీ20 కావడంతో మూడో టీ20పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మూడో టీ20కి ఆతిథ్యమిస్తోన్న ఉప్పల్ స్టేడియం సీటింగ్ కెపాసిటీ 60వేలు.

 తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌

తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌

ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ ఇది. గత రెండు ఐపీఎల్‌ సీజన్‌లలో 15 తొలి ఇన్నింగ్స్‌ల్లో 11 సార్లు 160కి కంటే తక్కువ స్కోర్లు నమోదయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పిచ్‌ పేసర్లకు అనుకూలిస్తుందని అంచనా. భారత్‌లో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న 19వ వేదిక ఉప్పల్‌ స్టేడియం.

 200 బౌండరీల మైలురాయికి ఫోర్ దూరంలో కోహ్లీ

200 బౌండరీల మైలురాయికి ఫోర్ దూరంలో కోహ్లీ

ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఓ అరుదైన మైలురాయికి దగ్గర్లో ఉన్నాడు. టీ20ల్లో 200 బౌండరీల మైలురాయికి కోహ్లీ ఒక ఫోర్‌ దూరంలో ఉన్నాడు. దిల్షాన్‌ (223),షెజాద్‌ (200) ఇంతకుముందే ఈ ఘనత అందుకున్నారు. మరోవైపు మూడో టీ20 జరుగుతున్న ఉప్పల్ స్టేడియం ఆసీస్ తాత్కాలిక కెప్టెన్ డేవిడ్ వార్నర్ సొంతగడ్డ.

 వార్నర్‌కు ఉప్పల్‌ స్టేడియం అచ్చొచ్చిన వేదిక

వార్నర్‌కు ఉప్పల్‌ స్టేడియం అచ్చొచ్చిన వేదిక

ఇండియ్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో సన్‌రైజర్స్‌కు కెప్టెన్‌గా ఉన్న వార్నర్‌కు ఉప్పల్‌ స్టేడియం అచ్చొచ్చిన వేదిక. ఉప్పల్‌ స్టేడియంలో టీ20ల్లో 61.47 సగటు, 162.79 స్ట్రైక్‌రేటుతో అందరికంటే ఎక్కువగా 1291 పరుగులు చేశాడు. ఆసీస్‌కు టీ20 సిరీస్‌ను అందించడానికి వార్నర్‌కు ఇదే సరైన సమయమని ఆసీస్ అభిమానులు భావిస్తున్నారు.

 గత పది రోజులుగా హైదరాబాద్‌ను ముంచెత్తుతున్న వర్షాలు

గత పది రోజులుగా హైదరాబాద్‌ను ముంచెత్తుతున్న వర్షాలు

మరోవైపు గత పది రోజులుగా హైదరాబాద్‌ను ముంచెత్తుతున్న వర్షాలు శుక్రవారం మ్యాచ్‌ను సాగనిస్తాడా? అన్న అనుమానం కూడా ఉంది. హైదరాబాద్‌లో శుక్రవారం భారీ వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ కూడా పేర్కొంది. గురువారం రాత్రి భారీ వర్షానికి స్టేడియం తడిసి ముద్దయింది. గురువారం కూడా వర్షం రావడంతో ఉప్పల్‌ మైదానాన్ని సిబ్బంది కవర్లతో కప్పి ఉంచారు.

 టేబుల్‌ ఫ్యాన్లతో పిచ్‌ను ఆరబెడుతున్న సిబ్బంది

టేబుల్‌ ఫ్యాన్లతో పిచ్‌ను ఆరబెడుతున్న సిబ్బంది

వర్షం తగ్గగానే సిబ్బంది కవర్లు తొలగిస్తున్నారు. తేమ ఎక్కువగా ప్రదేశాల్లో సిబ్బంది టేబుల్‌ ఫ్యాన్లతో పిచ్‌ను ఆరబెడుతున్నారు. రాంచీలో జరిగిన తొలి టీ20కి వర్షం ఆటంకం కల్పించడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం భారత్‌కు 6 ఓవర్లలో 48 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన సంగతి తెలిసిందే. మరీ హైదరాబాద్‌ టీ20లో ఏం జరుగుతుందో చూడాలి.

Story first published: Friday, October 13, 2017, 12:53 [IST]
Other articles published on Oct 13, 2017
Please Wait while comments are loading...
POLLS