న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అలా ఫీలైతే ధోనినే తప్పకుంటాడు: రవిశాస్త్రి

If MS Dhoni doesn’t feel good in IPL, he’ll say ‘Thank you very much - Ravi Shastris big statement on Dhoni Cricket

ఆక్లాండ్ : సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనికి క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌ మంచిగనిపించకపోతే ఇంటర్నేషనల్ క్రికెట్‌ నుంచి స్వయంగా తప్పుకుంటాడని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి తెలిపాడు.

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల్లో మాజీ కెప్టెన్ ధోనికి చోటుదక్కని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతని భవితవ్యంపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. కొందరూ ధోనీ రీ ఎంట్రీ పక్కా.. అంటే, మరికొందరూ జార్ఖండ్ డైనమైట్ ఇంటర్నేషనల్ కెరీర్‌ ముగిసినట్లేనని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ధోని భవితవ్యంపై రవిశాస్త్రి మరోమారు స్పందించాడు. న్యూజిలాండ్‌తో తొలి టీ20 విజయానంతరం ఓ మీడియా చానె‌ల్‌తో మాట్లాడుతూ.. ధోని భవితవ్యం ఐపీఎల్‌‌తో తేలనుందని తనతో సహా ప్రతీ ఒక్కరికి తెలుసన్నాడు.

టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ సరికొత్త రికార్డుటెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ సరికొత్త రికార్డు

'అప్ కమింగ్ ఐపీఎల్ ధోనికి ఎంత కీలకమో సెలెక్టర్లు, కెప్టెన్‌తో సహా ప్రతి ఒక్కరికి తెలుసు. చివరకు ధోనికి కూడా తెలుసు. ఇక నేను చెప్పేదేంటంటే ధోని ఏదిఏమైనా అతని నిర్ణయంపైనే నిలబడే వ్యక్తి. ఇది మీకు, నాకు తెలుసు. ఈ విధంగానే అనూహ్యంగా టెస్ట్ క్రికెట్‌ నుంచి తప్పుకున్నాడు. కనీసం 100 టెస్ట్‌ల వరకు ఆగలేదు. ఈ విషయం మనందరికి తెలుసు. ఇప్పటికీ ధోని ప్రాక్టీస్ మొదలు పెట్టాడో లేదో నాకైతే తెలియదు. కానీ ఐపీఎల్‌లో మాత్రం కచ్చితంగా ఆడుతాడు. అప్పుడే అతని భవితవ్యం ఏంటో తెలుస్తోంది. ఒక వేళ ఐపీఎల్‌లో తన ఆట మంచిగనిపించకపోతే ధోనినే నిర్మోహమాటంగా తప్పుకుంటాడు. ధన్యవాదాలు తెలుపుతూ.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతాడు'అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.

అసభ్య పదజాలంతో అభిమానిని దూషించిన బెన్ స్టోక్స్అసభ్య పదజాలంతో అభిమానిని దూషించిన బెన్ స్టోక్స్

గతేడాది వన్డే వరల్డ్ కప్ సెమీస్ ఓటమి అనంతరం ధోని మైదానానికి దూరమైన విషయం తెలిసిందే. కొన్నాళ్లు ఆర్మీతో గడిపినా.. అనంతరం తన భవితవ్యంపై స్పష్టతనివ్వకుండా మౌనంగానే ఉన్నాడు. పైగా జనవరి వరకు క్రికెట్ సంబంధించిన ప్రశ్నలు అడగవద్దని సూచించాడు. ఆటకు దూరమవడంతోనే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి తొలిగించింది. అయితే ఇటీవల జార్ఖండ్ టీమ్‌తో కలిసి ధోని ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. ఈ వార్తలను జార్ఖండ్ టీమ్ పెద్దలు కూడా ధృవీకరించారు. ఐపీఎల్ కోసమే ధోని ప్రాక్టీస్ మొదలు పెట్టినట్లు తెలిపారు.

Story first published: Saturday, January 25, 2020, 22:54 [IST]
Other articles published on Jan 25, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X