న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022 సీజన్‌లో కూడా కేకేఆర్‌తో ఉంటే అతని కెరీర్ నాశనమయ్యేది!

If Kuldeep Yadav was there KKR for one more season, he would have been diminished as cricketer

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్‌కు ముందు స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను వదిలేసి కోల్‌కతా నైట్‌రైడర్స్ మంచి పని చేసిందని అతని చిన్ననాటి కోచ్ కపిల్ దేవ్ పాండే అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్ కూడా కుల్దీప్ యాదవ్ కేకేఆర్‌తో ఉంటే క్రికెటర్‌గా అతని కెరీర్ నాశనమయ్యేదన్నాడు. ఆ జట్టు వదిలేయడంతోనే ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని వేలంలో కొనుగోలు చేసిందని తెలిపాడు. ఢిల్లీ తరఫున వరుస అవకాశాలందుకుంటున్న కుల్దీప్ యాదవ్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడని చెప్పాడు. తాజాగా టైమ్స్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుల్దీప్ యాదవ్ కెరీర్‌కు సంబంధించి దేవ్ పాండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

చాన్స్‌లు రాక అల్లాడిపోయాడు..

చాన్స్‌లు రాక అల్లాడిపోయాడు..

'గత మూడేళ్లుగా కుల్దీప్ యాదవ్ అవకాశాల్లేక అల్లాడిపోయాడు. టెస్ట్, వన్డే, టీ20.. చివరకు ఐపీఎల్‌లో కూడా అతనికి ఎవరూ అవకాశం ఇవ్వలేదు. కేకేఆర్ అయితే అతనిపై కనీసం నమ్మకం కూడా ఉంచలేదు. దాంతో కుల్దీప్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. నాతో టచ్‌లో ఉన్న అతను అవకాశాలు రావడం లేదని ఆవేదన చెందాడు. నేను మాత్రం ఆశ కోల్పోవద్దని చెప్పాను. ట్రైనింగ్ కొనసాగించాలని, ప్రాక్టీస్ సెషన్స్ మిస్సవ్వకుండా మరింత కష్టపడమని సూచించా.

తక్కువ ధరే అయినా..

తక్కువ ధరే అయినా..

ఈ సీజన్‌ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని రూ.2 కోట్ల కనీస ధరకు తీసుకుంది. నేను వెంటనే ప్రైజ్ ట్యాగ్ చూడవద్దని కుల్దీప్‌కు చెప్పా. మంచి టీమ్ నిన్ను ఎంచుకుందని, నీకు చాలా అవకాశాలు వస్తాయని తెలిపా. దానికి అతను ఐపీఎల్‌లో సత్తా చాటి భారత్ తరఫున మళ్లీ అన్ని ఫార్మాట్లలో ఆడాలనుకుంటున్నానని చెప్పాడు. అవకాశాల కోసం అతను చాలా ఆకలిగా ఉన్నాడని అర్థమైంది. వరుస అవకాశాలిస్తూ కుల్దీప్‌కు అండగా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.

కేకేఆర్‌కు ఓ దండం..

కేకేఆర్‌కు ఓ దండం..

కుల్దీప్ యాదవ్‌ను వదిలేసి కేకేఆర్ మంచి పని చేసింది. ఇది కుల్దీప్‌కు చాలా కలిసొచ్చింది. కుల్దీప్ గనుక ఈ సీజన్ కూడా కేకేఆర్‌లో ఉండి ఉంటే క్రికెటర్‌గా అతని కెరీర్ నాశనమయ్యేది. కేకేఆర్ గతేడాది అతన్ని రిటైన్ చేసుకొని ఒక్క అవకాశం ఇవ్వలేదు. అది తనను షాక్‌కు గురి చేసింది'అని కపిల్ దేవ్ పాండే చెప్పుకొచ్చాడు. ఇక వరుణ్ చక్రవర్తీ కారణంగా కుల్దీప్ యాదవ్ కేకేఆర్ తరఫున ఒక్క అవకాశం అందుకోలేకపోయాడు. గతేడాది అతను అద్భుత ప్రదర్శన కనబర్చడంతో కుల్దీప్ బెంచ్‌కే పరిమితమయ్యాడు.

9 మ్యాచ్‌లు.. 17 వికెట్లు..

9 మ్యాచ్‌లు.. 17 వికెట్లు..

ఈ సీజన్‌లో ఢిల్లీ ఆడిన 9 మ్యాచ్‌ల్లో బరిలోకి దిగిన కుల్దీప్ యాదవ్ 17 వికెట్లతో సత్తా చాటాడు. ఇందులో 4 వికెట్ల ఘనతను రెండుసార్లు అందుకున్నాడు. ఇప్పటికే ఈ సీజన్‌లో అతను 4 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. గతంలో వికెట్ల వెనుకాల మహేంద్ర సింగ్ ధోనీ అండతో చెలరేగిన కుల్దీప్ యాదవ్.. మళ్లీ అలాంటి సపోర్ట్ రిషభ్ పంత్ నుంచి లభిస్తుండటంతో రాణిస్తున్నాడు. హెడ్ కోచ్ రికీ పాంటింగ్ సైతం కుల్దీప్‌కు అండగా నిలుస్తుండటం అతనికి కలిసి వస్తోంది.

Story first published: Monday, May 2, 2022, 17:35 [IST]
Other articles published on May 2, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X