న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'సూచనలు ఇవ్వకుండా కోచ్‌లు ఏం చేస్తున్నారు.. సరదాగా ఇంగ్లండ్‌ చూడడానికి వెళ్లారా?'

If coaches want to go on pleasure trip, send them for world tour: Aamer Sohail slams Misbah & co

కరాచీ: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్ తడబడుతున్న విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్‌ను గెలిచే అవకాశం ఉన్నా.. పేలవ ప్రదర్శనతో ఇంగ్లండ్‌కు అప్పగించింది. వర్షం కారణంగా రెండు టెస్టును 'డ్రా'గా ముగించినా.. చివరిదైన మూడో టెస్టులో పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. దీంతో పాకిస్తాన్‌ మాజీ ఆటగాడు అమీర్‌ సోహైల్ ఆ జట్టు కోచింగ్ బృందంపై మండిపడ్డాడు. మిస్బా ఉల్ హక్ నేతృత్వంలోని కోచింగ్‌ టీంను తనదైన శైలిలో విమర్శించాడు.

ఎంజాయ్‌ చేయాలనుకుంటే వరల్డ్‌ టూర్‌ వెళ్లండి:

ఎంజాయ్‌ చేయాలనుకుంటే వరల్డ్‌ టూర్‌ వెళ్లండి:

తాజాగా అమీర్‌ సోహైల్‌ తన యూట్యూబ్‌ చానెల్‌లో మాట్లాడుతూ... 'పాకిస్తాన్‌ ఆటగాళ్లు బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా అన్ని విభాగాల్లో విఫలమవుతుంటే.. కోచ్‌లు చూస్తూ ఊరుకుంటున్నారు. ఆటగాళ్లకు ఎటువంటి సూచనలు చేయడం లేదు. మిస్బా నేతృత్వంలోని కోచింగ్‌ టీమ్‌ ఏం చేస్తుంది?. వారిని ఎందుకు కోచ్‌లుగా నియమించారు. సరదాగా ఇంగ్లండ్‌ చూడడానికి వెళ్లారా?.. లేక పాక్‌ ఆటగాళ్లకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి వెళ్లారా?. ఎంజాయ్‌ చేయడానికి వెళ్లాము అనుకుంటే మాత్రం కోచ్‌లందరూ కలిసి వరల్డ్‌ టూర్‌కు వెళ్లండి. మీరు కోచ్‌లుగా పనిచేయడం వ్యర్థం' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

యాసిర్ షా మాత్రమే:

యాసిర్ షా మాత్రమే:

'ఈ మ్యాచ్‌లో యాసిర్ షా మాత్రమే కొద్దిగా మంచి ప్రదర్శన చేశాడు. కానీ అతను మళ్ళీ 150 పరుగులకు పైగా ఇచ్చుకున్నాడు. సుదీర్ఘ స్పెల్ బౌలింగ్ చేసినప్పుడల్లా 150 పరుగులకు పైగా రన్స్ ఇచ్చాడు. వికెట్లు తీయకుండా పరుగులు ఇస్తే.. అవకాశాలు రావడం కష్టం. నసీమ్ షా, షాహీన్ అఫ్రిది కూడా ప్రభావం చూపలేకపోతున్నారు. కోచింగ్‌ టీమ్‌ ఏం చేస్తుందో వారికే తెలియాలి' అని సోహైల్‌ పేర్కొన్నాడు. పాకిస్తాన్‌‌ జట్టుకు మిస్బా ఉల్‌ హక్‌ ప్రధాన కోచ్‌గా కొనసాగడంతో పాటు పాక్‌ జాతీయ చీఫ్‌ సెలెక్టర్‌గా కూడా ఉన్నాడు. బౌలింగ్‌ కోచ్‌గా వకార్‌ యూనిస్‌, ఫీల్డింగ్‌ కోచ్‌గా గ్రాంట్‌ బ్రాడ్‌బర్న్‌లు ఉన్నారు.

ఓటమి దిశగా:

ఓటమి దిశగా:

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే మొదటి మ్యాచ్‌ను ఆతిథ్య జట్టుకు సమర్పించుకున్న పాకిస్తాన్..‌ 0-1 తేడాతో వెనుకబడి ఉంది. వర్షం పుణ్యమాని రెండో టెస్టు మ్యాచ్‌ డ్రాగా ముగించింది. ఇక కీలకమైన మూడో టెస్టులోనూ నిరాశపరుస్తుంది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 8వికెట్ల నష్టానికి 583 పరుగుల వద్ద డిక్లెర్ ‌చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ 273 పరుగులకే ఆలౌట్ అయి ఫాలోఆన్ ఆడుతోంది. ఇప్పటికే రెండు కీలక వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది. ఓపెనర్లు షాన్ మసూద్ (18), అబిద్ అలీ (42)లు పెవిలియన్ చేరారు. కెప్టెన్ అజర్ అలీ (29), బాబర్ అజమ్ (4) క్రీజులో ఉన్నారు. వర్షం కారణంగా చివరి రోజు మ్యాచ్ ఇంకా ప్రారంభం కాలేదు.

ధోనీ, కోహ్లీ, రోహిత్‌లకు డోపింగ్‌ పరీక్షలు!!

Story first published: Tuesday, August 25, 2020, 16:38 [IST]
Other articles published on Aug 25, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X